వేప చేదు!
శ్రీసాయినాథాయనమః శ్రీసాయిభక్త పాఠక పరివారానికి శార్వరి నామనూతన సంవత్సర (ఉగాది ) శుభాకాంక్షలు ! " సదానింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్య ప్రియంతం తరుమ్ కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం ! " ( " సదా చేదురసమును స్రవించు వేపచెట్టుమూలంలో నివసించి దానిని కల్పవృక్షముకంటే అధికమైన దానినిగా చేసిన ఈశ్వరరూప సద్గురునకు నమస్కరించుచున్నాను." సద్గురు సాయినాథులు సమస్త మానవాళిని కరోనా మహమ్మారి విషప్రభావంనుండి రక్షించి , అందరిజీవనం మధురమయం జేయుగాక! ) సాయి కథలు - వేప చేదు. " మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము సాయిబాబా శిరిడీ వచ్చిన మొదటిరోజుల్లో వేపచెట్టుక్రింద కూర్చుని తపస్సుచేసేవారు. అదేవేపచెట్టుకింద సెల్లార్ వారిగురుస్థానమని బాబానే వివరించారు. సాయి తపోశక్తిచే వారు కూర్చున్నభాగంవైపు చెట్టుకొమ్మ ఆకులు చేదురుచి కోల్పోయి చప్పగామారినవట. రెండవపక్కనున్న వేపాకులు సహజరుచి...