తల్లిదండ్రుల భక్తిశ్రద్ధలు, బిడ్డలకు శక్తిముద్రలు!
శ్రీసాయినాథాయనమః
సాయి కథలు - తల్లిదండ్రుల భక్తిశ్రద్ధలు, బిడ్డలకు శక్తిముద్రలు!
" మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము
భగవంతరావు క్షీరసాగర్ పాండురంగ విఠలుని మిగుల పూజించెడివాడు. వాని మరణానంతరము కొడుకు ఇంట్లోని దేవతావిగ్రహాలకు పూజజేయడం మానేసాడు, నైవేద్యం కూడా పెట్టడం లేదు. అతడు మొదట శిరిడీ రాగానే సాయి, " ఇతని తండ్రి నాకాప్తుడు. నాకు నివేదించక తినేవాడుగాదు. ఆయన చనిపోయాక యితడు నైవేద్యమివ్వక నన్నూ, విఠలుణ్ణి పస్తుంచాడు. ఇతనికి హితం చెప్పడానికే రప్పించాను ". అన్నారు. క్షీరసాగరుని భక్తిశ్రద్ధలు, వానిపుత్రుని బాబా పిలుపుకు, కరుణాకటాక్షాలప్రాప్తికి కారణమయ్యాయి. చేసిన పుణ్యం చెడని పదార్ధం! పెద్దలు జేసిన పుణ్యము బిడ్డలకు తప్పకప్రాప్తిస్తుందనేది, వారిని రక్షిస్తుందనేది అక్షరసత్యం కదా! తల్లిదండ్రులు, పూర్వీకులు చేసిన కష్టఫలం, పుణ్యఫలం మనప్రస్తుతస్థితికి మూలము. వారిపట్ల సదాకృతజ్ఞతగలిగియుండటం మన కనీసధర్మం కదా! అందులకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ యని పెద్దలు వచించారు.
" మాతృదేవోభవ! పితృదేవోభవ! ఆచార్యదేవోభవ! "
ReplyDelete