సాయి కథలు - బాధ్యతలు !


శ్రీసాయినాథాయనమః 

సాయి కథలు - బాధ్యతలు 

" మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము  చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము

సాయిబాబా తన భక్తులసయితము  తమతమ వ్యక్తిగత బాధ్యతలను విస్మరింపనిచ్చెడివారు కాదు. శ్రీసాయిసచ్చరిత్రములో యిందులకు కొన్నిఉదాహరణలు కలవు. హరిభావూ బాబాకు అంకితభక్తుడు. ఒకసారి జబ్బుపడ్డ  తనతల్లికి చెప్పకుండా రామేశ్వరం బయలుదేరి మార్గంలో శిరీడీ వచ్చాడు. సాయి ఆతనినుండి డబ్బంతా దక్షిణగా తీసుకొని " ఇంటికివెళ్ళు,  రామేశ్వరం నీకోసం పస్తుంది. నీవు వెళ్లకుంటే మరణిస్తుంది" అన్నారు. అతడిల్లు చేరేసరికి అతని తల్లి  ఆహారం మాని, " సాయీ, నీవు మహాత్ముడవైతే  నా కొడుకు తిరిగి రావాలి " అని రోజూ ప్రార్ధిస్తుందని తెలిసింది. తల్లి రామేశ్వరమంత పవిత్రమైనదని, పుత్రుడు తల్లియోగక్షేమములు మరచి తీర్ధయాత్రలు చేయకూడదనెడిది బాబా యుద్దేశ్యం. ఒకసారి భక్తురాలు  శ్రీమతి ప్రధాన్ పాదపూజ జేస్తుండగా , " నీవు వెంటనే యింటికెళ్ళు" అన్నారు బాబా. ఆమె వెళ్లేసరికి పాప గుక్కపెట్టి ఏడుస్తుంది. ఆమె పాపను సముదాయించి మరలా మసీదుకు వెళ్ళింది. " ఇప్పుడు పూజ పూర్తిచేసుకో! " అన్నారు సాయి. బిడ్డలపట్ల తల్లి తనబాధ్యతలు నిర్వహించాలనెడిది సాయిభావం. కాకా మహాజని శిరిడీలో ఒక వారముండాలని వచ్చాడు. అతనిని జూస్తూనే బాబా, " నీవింటికి ఎప్పుడు వెళ్తావు? " అన్నారు. " ,మీరు చెప్పినప్పుడు ! " అన్నాడు కాకా. " అయితే రేపే వెళ్ళు అన్నారు సాయి. అతడు మర్నాడు బొంబాయి జేరేసరికి , ఆఫీసులో పై అధికారికి జబ్బుజేసి  ఆరోజు కాకా తప్పక ఆఫీసుకు పోవలసి యున్నది. కాకా శిరిడీలో కొనసాగటం కంటే ఆఫీసుకు వెళ్లి తన బాధ్యతలు నిర్వహించడం ముఖ్యమనేది సాయి సందేశం!
ప్రేరణ: శ్రీ సాయి లీలామృతము, పూజ్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!

కాకా మహాజని 

Comments

  1. సమాజమే దేవాలయం, వ్యక్తులు సమాజపరంగా తమతమ బాధ్యతలు నిర్వహించాలనేది సాయిబాబా సందేశము !

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)