గురుచరణాలు !
శ్రీసాయినాథాయనమః
సాయి కథలు - గురుచరణాలు !
" మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము
( ప్రస్తుతము కొవిడ్ మహమ్మారి ప్రబలిన ప్రపంచవిపత్కర పరిస్థితిలో పెక్కుమంది తమ యిండ్లకే పరిమితమయ్యారు. కొంతవిరామసమయం లభిస్తుందిగావున శ్రీసాయిచరిత్ర, విష్ణుసహస్రనామము, భగవద్గీత లాంటి పవిత్రగ్రంధాలుచదివి మనకాలాన్ని సద్వినియోగపరచెదముగాక! )
" విశ్వాన్ని గురువు ధరిస్తాడు, ఆగురుని వారి చరణాలు భరిస్తాయి " ఇది శాస్త్రవాక్యం. గురుపాదసేవ భక్తులకెంతో శ్రేయస్కరము. శిరిడీలో యెందరో భక్తులకిది యనుభవ విషయం. సాయి పాదములనుండి గంగాయమునలు వెల్లుబికిన లీల శ్రీసాయి సచ్చరిత్రములో వివరింపబడినది. ప్రయాగ వెళ్లదలచిన భక్త దాసగణుకు సాయి తమ పాదములందే పవిత్ర గంగయమునల ప్రవహింపజేశారు. పరవసించిన దాసగణు సాయిని స్తుతించాడు. ఎందరో భక్తులు శిరిడీలో, సాయిసమాధి దర్శనముచే పరమశాంతిని పొందారు. ఇచట బాబాచూపిన మరొక చమత్కారం చూచెదము. ఒకప్పుడు కొందరు భక్తులు బాబాను ఫొటోతీయుటకు యనుమతి కోరారు. బాబా మొదట అంగీకరింపలేదు, చివరకు పదేపదే ప్రాధేయపడితే యనుమతిచ్చారు. ఫోటో తీసాక జూస్తే అందులో సాయిపాదాలుమాత్రమే కనిపించాయి. ఆ విషయం చెబితే , " ముఖ్యమైనవి పాదాలేగదా! " అన్నారు బాబా. వేరొకభక్తుడు సాయి యనుమతిపొందక ఫొటోతీస్తే అందులో వానిగురువుగారి చిత్రం దర్శనమిచ్చినది.
మనసులో గురుచరణాల స్మరిద్దాం, ప్రపంచవిపత్తులనుండి రక్షణ పొందుదాం !
ReplyDelete