వేప చేదు!

శ్రీసాయినాథాయనమః 

శ్రీసాయిభక్త పాఠక పరివారానికి శార్వరి నామనూతన సంవత్సర (ఉగాది ) శుభాకాంక్షలు !  

" సదానింబవృక్షస్య మూలాధివాసాత్ 
  సుధాశ్రావిణం తిక్తమప్య ప్రియంతం 
     తరుమ్ కల్పవృక్షాదికం సాధయంతం 
         నమామీశ్వరం సద్గురుం సాయినాథం ! "

( " సదా చేదురసమును స్రవించు వేపచెట్టుమూలంలో నివసించి దానిని కల్పవృక్షముకంటే అధికమైన దానినిగా చేసిన ఈశ్వరరూప సద్గురునకు నమస్కరించుచున్నాను."   సద్గురు సాయినాథులు సమస్త మానవాళిని  కరోనా మహమ్మారి విషప్రభావంనుండి  రక్షించి , అందరిజీవనం మధురమయం జేయుగాక!  )

సాయి కథలు -  వేప చేదు.
" మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము  చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము

సాయిబాబా శిరిడీ వచ్చిన మొదటిరోజుల్లో వేపచెట్టుక్రింద కూర్చుని తపస్సుచేసేవారు. అదేవేపచెట్టుకింద సెల్లార్ వారిగురుస్థానమని బాబానే వివరించారు. సాయి తపోశక్తిచే వారు కూర్చున్నభాగంవైపు చెట్టుకొమ్మ ఆకులు చేదురుచి కోల్పోయి చప్పగామారినవట.  రెండవపక్కనున్న వేపాకులు సహజరుచి చేదుగా వుండేవట. ఆవిధంగా చేదువృక్షాన్ని అమృతఝరియ జేశారు  సమర్ధగురు సాయినాథులు. సాయిచరిత్రలో ఇలాంటిదే మరొక మహిమ జూస్తాము.
" అక్కల్ కోటలో దత్తావతారమైన స్వామి సమర్ధ సమాధిచెందనున్నారు. వారిభక్తుడు కేశవ్ నాయక్ దుఃఖిస్తుంటే  స్వామివారు తమ పాదుకల కతనికిచ్చి , "  నా అవతారం శిరిడీలో వున్నారు సేవించుకో! " అన్నారు. ఆపిమ్మట నాయక్ తన కొడుకును తీసుకొని శిరిడీ బయల్దేరాడు. రైల్లో శిరిడీ వెళ్ళేతోటిప్రయాణీకులు సాయి కేవలం పిచ్చిఫకీరని చెప్పారు. అయినా శిరీడీ చేరాక నాయక్ తో వారుగూడ మసీదువద్దకొచ్చారు. నాయక్ తో సాయి , " నువ్వు నీకుమారుడు రావచ్చు. తక్కినవారొస్తే భ్రష్టులౌతారు! " అన్నారు. తర్వాత వేపచెట్టునుండి కొద్ది ఆకులు అందరకూ పంచి రుచిజూడమన్నారు. అవి నాయక్ లకు తియ్యగాను, మిగిలినవారికి అతిచేదుగానూ వున్నాయి! సద్గురు భక్తులకు సంసారం మధురంగాను, విద్యాహంకారులకు చేదుగానూ వుంటుంది. "   శ్రీ సాయి లీలామృతము

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!

A Christian lady's experience ! 

Comments

  1. శార్వరీ కొత్తసంవత్సరం మనందరిలో నూతనోత్సాహము, సుఖసంతోషములనింపి ఆయురారోగ్యసౌభాగ్యములు ప్రసాదించుగాక ! సాయిరక్ష సదా శ్రీరామరక్ష !

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)