సాయి కథలు - హోళీవిందు.
శ్రీసాయినాథాయనమః
పాఠకమహాశయులెల్లరకు హోళీ శుభాకాంక్షలు!
సాయి కథలు - హోళీవిందు
" మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము
ఈ అద్భుతసంఘటన యిప్పటికి 103 సంవత్సరములక్రిందట అనగా 1917 లో, హోళీ పండుగనాడు జరిగినది. ఆరోజు తెల్లవారుజామున బొంబాయి నగరంలో హేమాద్రిపంతుకు స్వప్నంలో, సన్యాసి వేషంలో బాబాకన్పించి ఆ రోజు వారింటికి భోజనానికి వచ్చెదమని చెప్పారు. నిజముగా బాబా వస్తారనే ఆశతో , బాబాకు కూడా వంటచేయించాడు పంతు. భోజనసమయమైనది. అతిధులందరు భోజనానికి సిద్ధమైనారు. బాబాకొరకై వారిమధ్య నొక పీటనమర్చారు. 12 గంటలైనను ఎవరు రాకపోవుటచే, తలుపులు వేశారు. అన్నశుద్ధియనంతము అందరూ భోంచేయుటకుపక్రమింపబోగా , మేడమెట్లపై చప్పుడు వినిపించింది. హేమాద్రిపంతు వెంటనేపోయి తలుపుతీయగ, ఇద్దరు ముస్లింలు పాతపత్రికలో కట్టిన పటమును విప్పి టేబుల్ పై పెట్టి, యది తమవస్తువుగా స్వీకరింపుమని, భోజనసమయమగుటచే ఆ ఫోటో వివరములు తరువాత వివరించెదమనుచు, చకచకా వెళ్లిపోయారు. హేమాద్రిపంతు కాగితము విప్పి చూచుసరికి అందులో పెద్దదియగు చక్కని సాయిబాబా పటముంది. అతడు మిగుల ఆశ్చర్యపడుచూ, బాబా పటమునకు నమస్కరించి బాబాకొరకు వేసిన పీటపై బెట్టి వండిన వంటకములెల్ల వడ్డించి, నైవేద్యము పెట్టిన పిమ్మట అందరు సకాలమున భోజనముపూర్తిజేశారు. చెప్పినమాట కలలోయైనను, తమమాటకు కట్టుబడి సరియగు సమయానికి చక్కని ఫోటో రూపంలోవచ్చి బాబా అందరిని ఆశ్చర్య పరచారు. ఇలా ఫోటోతోకూడ తమ ఏకాత్మ భావాన్ని నిరూపించారు.
శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!
హేమాద్రిపంతు ఇంటజేరిన సాయిబాబా చిత్రపటం!
సాయిలీలలు చెప్పతరమా, తమ చిత్రపటరూపానవచ్చి విందారగించారు!
ReplyDelete