Posts

Showing posts from April, 2020

భగవద్గీత - సాయి జీవనగీత !

Image
శ్రీసాయినాథాయనమః  ఓం శ్రీ సాయి ఆరోగ్యప్రదాత్రేనమః ! భగవద్గీత - సాయి జీవనగీత ! " మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము  చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము " గీతకు భాష్యం చెప్పిన రూపం   దీనుల గీతల మార్చిన రూపం    గీతయె తానుగ చూపిన రూపం                తత్ప్రణమామి గురూ సాయినాథం ! "    ( Ref: శ్రీ సాయి అష్టకము, dated August 23, 2018;  SaileelaTelugu.blogspot.com) భగవద్గీత బ్రహ్మవిద్య, యోగశాస్త్రముల, ఉపనిషత్తుల సారాంశమును తెలియబరచు  పవిత్ర హిందూమత మూల  గ్రంధము మరియు  బోధనా గ్రంథము. గీతయందు వివరింపబడిన పెక్కు జీవనసత్యములను సాయిబాబా నిజజీవితంలో చక్కగా చూడవచ్చును. వేరొకవిధముగా చెప్పాలంటె, బాబాజీవితము భగవద్గీత రహస్యములను, సత్యములను  రుజువుపరచిన ప్రయోగశాలగ తలంచవచ్చును. ఉదాహరణముగా ఆత్మ సర్వవ్యాపి యను గీతవాక్యమును, సాయి తాను అనుభవపూర్వకంగా భక్తులకు తెలియజెప్పారు. కుక్కకువేసిన రొట్టెతో సాయి ఆకలి తీరింది, గుఱ్ఱంపై వేసిన కర్రదెబ్బచే సాయి దేహంపై వాతలు తేలాయి, యిలా ఎన్నోన్నో ఉదాహరణలు...

రెండు అధ్యాయములు !

Image
శ్రీసాయినాథాయనమః  ఓం శ్రీ సాయి ఉపద్రవనివారిణే  నమః ! సాయి కథలు - రెండు అధ్యాయములు " మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము  చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము శ్రీసాయిసచ్చరిత్ర పఠనము మిగుల శ్రేయోదాయకము. సాయిభక్తులకీ పారాయణ పవిత్రగ్రంధములైన భగవద్గీత, ఖురాను, బైబిల్ గ్రంథపఠనముతో సమానఫలదాయిగా చెప్పబడినది. శ్రీసాయిసచ్చరిత్రములో 51 అధ్యాయములున్నవి. ఈగ్రంధమును సాయి ప్రేరణచే అన్నాసాహెబ్ దబోల్కర్ యను భక్తుడు ప్రప్రధముగా మరాఠీ భాషలో రచించాడు. ఈగ్రంధాన్ని సంక్షిప్తముగా తెలుగులోనికనువదించినవారు శ్రీ పత్తి నారాయణ. గ్రంథపారాయణమువలన కలుగు పెక్కుప్రయోజనములను ఈగ్రంథమునందు విపులీకరించడమైనది. పారాయణచే భక్తులకు కలిగిన పెక్కు యనుభవములే  యిందులకు సాక్ష్యము. సాధారణముగా శ్రీసాయిసచ్చరిత్రపారాయణము  భక్తులు ఏడురోజులలో పూర్తిజేసెదరు, దీనినే సప్తాహపారాయణమందురు. కొందరు రోజుకోయధ్యాక్రమమున చదివెదరు. ముఖ్యముగా భక్తుల కష్టనివారణకై  11, 15  అధ్యాయములు శ్రేయస్కరమని ఆయా అధ్యాయముల చివర చెప్పబడుటచే ఆయా అధ్యాయములందు చెప్పబడిన విషయములను  సంక్షిప్తముగా   తెలిస...

పునరుజ్జీవం ( Resurrection ) !

Image
శ్రీసాయినాథాయనమః  ఓం శ్రీ సాయి రోగనివారిణే నమః ! Happy Easter greetings to all the readers!  సాయి కథలు - పునరుజ్జీవం (Resurrection)  " మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము  చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము " I incarnate from time to time to protect the righteous and punish the evil " Lord Krishna "He who lives for others lives forever !" మహాత్ములెన్నడు గతించరు, వారి ఆత్మ సదాచైతన్యవంతము. ప్రళయానంతరము వారి దైవకార్యము కొనసాగుతుంది.  నేడు ప్రవక్త, దైవసుతుడు, పరమపవిత్రుడైన  జీసస్ క్రిస్ట్ యొక్క పునరుజ్జీవపు రోజు. శిలవేయబడ్డ  అనంతరము మూడవరోజు వేరువేరు ప్రదేశముల  వివిధ శిష్యులకు దర్శనిమిచ్చాడు జీసస్ క్రిస్తు.  ప్రపంచ క్రైస్తవులెల్లరకు మహా పర్వదినం. శిరిడీ సాయిబాబా కూడ జీసస్ వలె మరణించిన మూడురోజుల పిమ్మట పునరుజ్జీవము పొందారు. ఈవిషయమై శ్రీ సాయిసచ్చరిత్రములో ( 43-44 అధ్యాయములలో ) విపులముగా వ్రాయబడియున్నది. ప్రస్తుతంఈవిషయమును గ్రహించెదము. "  సాయిబాబా 1918వ సంవత్సరములో మహాసమాధి చెందారు. అంతకు 32 సంవత్సరములకు పూర్వము అనగా 18...

రామలాలతొ రామకృష్ణ !

Image
శ్రీసాయినాథాయనమః రామలాలతొ  రామకృష్ణ ! " మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము  చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము పురాణాల్లో తరచుగా బాల శ్రీకృష్ణలీలలు  విన్నాము కాని బాల శ్రీరాముని లీలలు అంతగా వినలేదనడం సత్యవాక్యం. ప్రస్తుతం శ్రీరామకృష్ణ పరమహంస బాల శ్రీరామునితోటి ఆశ్చర్యకర అనుభవముల  తెలుసుకొనెదము.   శ్రీరామకృష్ణ పరమహంస సాధనా అవస్థలో వేరు వేరు సమయాల  వివిధ విద్వాంసులు, సన్యాసులు, మంత్రోపాసకులు,  గురువులు  వారిని దర్శించడమేగాక వారి పరమహంసస్థితి ప్రాప్తికి తమతమ పాత్రల నిర్వహించారు. జఠాధారి యను రామాయత్ శాఖకు సంబంధించిన శ్రీరామభక్త సన్యాసి 1864వ సంవత్సరంలో దక్షిణేశ్వర్ కు వచ్చాడు. అతడు శ్రీరామకృష్ణునకు   రామ మంత్రోపదేశము జేసినాడు. అంతేగాక రామలాల ( బాల శ్రీరాముని) చిన్నవిగ్రహాన్నికూడా బహూకరించాడు, ఆవివరాలనిపుడు శ్రీరామకృష్ణుల వారి మాటలలోనే  పరిశీలించెదము. " ఆ బాబాజీ (జటాధారి) రామలాల విగ్రహాన్నెన్నో యేండ్లు పూజించాడు. తాను వెళ్లిన ప్రదేశాలకు తనతోపాటే తనదైవ ప్రతిమను తీసుకెళ్ళేవాడు. తాను పొందిన భిక్షతోడనే వంట...

శ్రీ సాయిరాముడు !

Image
శ్రీసాయినాథాయనమః  పాఠక సాయిభక్తులెల్లరకు శ్రీరామనవమి శుభాకాంక్షలు!  "  వేదపురాణాది సద్గ్రంధములు చదువునప్పుడు నా సద్గురువైన సాయిబాబాయే శ్రీరాముడుగా, శ్రీకృష్ణుడుగా  తోచును. "  శ్రీసాయిసచ్చరిత్ర రచయిత హేమాద్రిపంతు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రాక్షససంహారం జేసి మానవాళినుద్ధరించినవిధముగా  కలియుగ సద్గురు శ్రీ సాయిరాముడు కరోనామహమ్మారీ  రాక్షసవ్యాధి పీచమణచి ప్రపంచజనావళిని కాపాడుటకై ప్రార్ధించెదము! సాయి కథలు - శ్రీ సాయి రాముడు ! " మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము  చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము సాయిభక్తులు పెక్కుమంది సాయిబాబాను సాయిరామునిగా భావించి పూజిస్తారు. దీనికి ముఖ్యకారణము సద్గురుసాయినాథుడు   అవతారపురుషుడు శ్రీరామచంద్రుడు  వేరుకారని విశ్వసించడమే. ఈభక్తుల విశ్వాసానికి అనేక ఆధారాలను చూడగలము. శిరిడీలో జరుగు ముఖ్యవేడుకలలో శ్రీరామనవమి ఒక్కటి, ఆవేడుకలు జరుపుకొనుటకు సాయిబాబ  సంపూర్ణయనుమతి నిచ్చారు. ప్రప్రధమంగా రామనవమివేడుక 1912వ సంవత్సరంలో జరిగినది.  అదేరోజున ముస్లింలు జరుపుకొ...