" వేదపురాణాది సద్గ్రంధములు చదువునప్పుడు నా సద్గురువైన సాయిబాబాయే శ్రీరాముడుగా, శ్రీకృష్ణుడుగా తోచును. " శ్రీసాయిసచ్చరిత్ర రచయిత హేమాద్రిపంతు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రాక్షససంహారం జేసి మానవాళినుద్ధరించినవిధముగా కలియుగ సద్గురు శ్రీ సాయిరాముడు కరోనామహమ్మారీ రాక్షసవ్యాధి పీచమణచి ప్రపంచజనావళిని కాపాడుటకై ప్రార్ధించెదము!
సాయి కథలు - శ్రీ సాయి రాముడు !
" మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము
సాయిభక్తులు పెక్కుమంది సాయిబాబాను సాయిరామునిగా భావించి పూజిస్తారు. దీనికి ముఖ్యకారణము సద్గురుసాయినాథుడు అవతారపురుషుడు శ్రీరామచంద్రుడు వేరుకారని విశ్వసించడమే. ఈభక్తుల విశ్వాసానికి అనేక ఆధారాలను చూడగలము. శిరిడీలో జరుగు ముఖ్యవేడుకలలో శ్రీరామనవమి ఒక్కటి, ఆవేడుకలు జరుపుకొనుటకు సాయిబాబ సంపూర్ణయనుమతి నిచ్చారు. ప్రప్రధమంగా రామనవమివేడుక 1912వ సంవత్సరంలో జరిగినది. అదేరోజున ముస్లింలు జరుపుకొను ఉర్సు మరియు చందనోత్సవములకు అప్పటికి కొన్ని సంవత్సరములముందునుండియే శిరిడీలో బాబాయనుమతితో జరుపబడుచున్నవి. హిందూముస్లిం ఐక్యతకై బాబా అలాచేశారనేది భక్తుల నమ్మిక. ద్వారకామాయిగ పిలువబడు పాతమజీదు సాయిబాబా జేరునప్పటికే సమీపమున హనుమదేవాలయముండుట రామునికి ముందుగనే హనుమ ఆప్రదేశము జేరెననెడి భక్తులయోచన ఆలోచింపదగిన సత్యము. అంతియేగాక సాయి, తమ భక్తులకు శ్రీరామచంద్రునిగా దర్శనమిచ్చిన సందర్భములను శ్రీసాయిసచ్చరిత్రములో చూడవచ్చును. శ్రీరాముని పూజించెడి ఓ డాక్టరు తనస్నేహితుడగు మమల్తదారుతో శిరిడీవెళ్లి యచట ద్వారకామాయిలో సాయి స్థానంలో శ్రీరామునిజూచి బాబాను అవతారపురుషునిగా యనుభవము పొందాడు. మరొక్క సంఘటన పరిశీలిద్దాము. తమ కాశీయాత్ర మార్గంలో బాబాను దర్శింప మదరాసు భక్తసమాజమండలి ద్వారకామాయి వచ్చి చక్కటిభజనజేశారు. యజమాని భార్య శ్రీరాముని భక్తురాలు, అపుడపుడు శ్రీరామదర్శనము పొందుచుండెడిది. మధ్యాన్న ఆరతి సమయమున సాయిబాబా ఆమె భక్తివిశ్వాసాలకు మిగుల ప్రసన్నులై శ్రీరామచంద్రునిగా దర్శనమిచ్చారు. శ్రీమతి ఖాపర్డే భార్య శిరిడీలో షుమారు ఏడుమాసములు సాయిని మిగుల భక్తిశ్రద్ధలతో సేవించినది. ఓరోజు మధ్యాన్న సమయాన ఆమెతెచ్చిన భోజనమును సాయి మిగుల ప్రేమతొ భుజించారు. ఆపై ఆమె బాబా కాళ్ళను భక్తితో తోముట ప్రారంభించినది. ప్రతిగా, తోముచున్న ఆమె చేతులను బాబా తోముట ప్రారంభించారు. గురుశిష్యుల ప్రేమకు సమీపమునయున్న భక్తుడు శ్యామా మిగుల ఆశ్చర్యపడ్డాడు. ఆమె యదార్ధమైన ప్రేమకు సంతసించి బాబా మెల్లగా మృదువయిన యాకర్షించు కంఠముతో ' రాజరామ్ ' యనుమంత్రమును ఎల్లప్పుడు జపించమనియు, అట్లు చేయుటచే ఆమె జీవితాశయము నెరవేరునని, మనసు మిగుల ప్రశాంతమగునని చెప్పారు. అది శక్తిపాతము, బాబా భక్తురాలికి శక్తిప్రసాదించారు. బాబా చెప్పిన మాటలు మంత్రాల్లా ఆమె హృదయంలో స్థిరపడ్డాయి. శిరిడీలోని సాయిబాబా, అయోధ్య శ్రీరామచంద్రుడు వేరుకారని విశ్వసిస్తూ వారి దివ్యాశీసులకై హృదయపూర్వకంగా ప్రార్ధించెదముగాక!
శ్రీసాయినాథాయనమః సాయి బోధ - ఈశోపనిషత్తు దేహ ఆరోగ్యానికి, పోషణకు, ఎదుగుదలకు ఆహారపువిలువలతోకూడిన పౌష్టిక ఆహారము మిక్కిలి ఆవశ్యకము. అలాగే తిన్నటువంటి ఆ ఆహారమును బాగుగా జీర్ణించుకొనవలెను, లేనియెడల అజీర్ణవ్యాధిచే ఆరోగ్యసమస్యలు తలెత్తవచ్చును. ఇదేవిధంగా పుస్తక లేక గ్రంథపఠనముకూడ. చదివిన మంచి విషయముల భావమునెఱిగి తదనుగుణంగా ఆచరించినయెడల ప్రయోజనముంటుందికాని, కేవలం అర్ధం తెలియని పఠనం వ్యర్థం, పైపెచ్చు యెంతో తెలుసుననెడి గర్వం తలెత్తే ప్రమాదముంది. సరిగ్గా దీనిని పోలిన ఓ సంఘటన శ్రీసాయి సచ్చరిత్రములో చూడగలము. దాసగణు మహరాజు, గొప్పసాయి భక్తుడు, కీర్తనకారుడు. ఓ పర్యాయం యితడు సంస్కృత భాషలోని ఈశావాస ఉపనిషతును మరాఠీభాషలోని ఓవీ ఛందస్సులోనికి అనువదించాడు. (గ్రంధంలో ఆత్మ తత్వముగూర్చి వివరింపబడినది.) కాని ఆ ఉపనిషత్తులో చెప్పబడిన విషయ సారాంశము వానికి సరిగా బోధపడలేదు, పండితులతో చర్చించినప్పటికి సరియైన సమాధానం లభింపకపోవుటచే ఆత్మసాక్షాత్కారము పొందిన సద్గుఫు సాయినాథుని దర్శించి తన సమస్యను వివరించి వివరణకై వేడుకొన్నాడు. బాబా వాని నాశీర్వదించి యిట్లన్నార...
శ్రీసాయినాథాయనమః.సాయిబాబ తమ శుభసందేశాలనే కిరణాలతో భక్తుల హృదయాల్లో వెలుగులనింపి చైతన్యవంతం చేస్తున్నారు . బాబాసందేశాలనాచరిస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకుందాము. పాఠక భక్తులెల్లరకు విజయదశమి శుభాకాంక్షలు,సదా బాబా ఆశీసులు! సమర్ధసద్గురు శ్రీసాయినాథులకు శతకోటి హృదయపూర్వక నమస్కారములతో ఈ వ్యాసమును ప్రారంభిస్తున్నాను. బాబా దయవలన గత కొన్ని సంవత్సరములుగా శ్రీసాయి సచ్చరిత్ర నిత్యపారాయణము విధిగా జరుగుచున్నది. చదివిన ప్రతిసారి కొత్త కొత్త అర్ధాలు,సందేశాలు స్ఫురణకు రావడం గమనించాను. చదివిన మొదట్లో బాబా లీలలు భక్తుల బాధానివారణ కన్నట్లు తలచేవాడను. పారాయణము కొనసాగేకొలది లీలల వెనుక బాబా మనకేదో సందేశమిస్తుంన్నారనే భావన కలుగ సాగింది. లోతుగా చదివిన పిమ్మట నిగూఢసందేశాల జాడ కొద్ది కొద్దిగా అవగాహన కొచ్చెడిది. అధ్యాయ క్రమంలో ఆయా లీలాసందేశాల సమాహారమే ప్రస్తుత సాయిసందేశామృతము. పాఠక భక్తులకు పారాయణానంతరము సాయిలీలల వెనుక వేరువేరు అర్ధములు,భావములు గోచరించుట సహజము. ప్రస్తుతం నా జ్ఞానపరిధికందిన భావాలను తోటి సాయి భక్తులతో పంచుకుంటున్నాను. ఇది పూర్తిగా వ్యక్తిగత భావన. భక్తులెల్లరు తమతమ సూచనలను,స్పందనను క్రిందనున్న...
శ్రీకోదండరాముడు, శ్రీ సాయిరాముడు ఒక్కరే, దివ్యశక్తి సంభూతులు! వారిరక్షణ మానవాళికి సదా లభించుగాక!!
ReplyDelete