పునరుజ్జీవం ( Resurrection ) !
శ్రీసాయినాథాయనమః
ఓం శ్రీ సాయి రోగనివారిణే నమః !
Happy Easter greetings to all the readers!
సాయి కథలు - పునరుజ్జీవం (Resurrection)
" మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము
" I incarnate from time to time to protect the righteous and punish the evil " Lord Krishna
" I incarnate from time to time to protect the righteous and punish the evil " Lord Krishna
"He who lives for others lives forever !"
" సాయిబాబా 1918వ సంవత్సరములో మహాసమాధి చెందారు. అంతకు 32 సంవత్సరములకు పూర్వము అనగా 1886 లో ఒక మార్గశిర పౌర్ణమి ( ఆగష్టు నెల) నాడు బాబా ఉబ్బసమువ్యాధితో మిగుల బాధపడుచుండెను. దానిని తప్పించుకొనుటకై బాబా తనప్రాణమును పైకి దీసుకొనిపోయి సమాధిలోనుండవలెననుకొని, భక్త మహాల్సాపతితొ నిట్లనిరి. ' నా శరీరమును మూడురోజులవరకు కాపాడుము. నేను తిరిగి వచ్చినట్లయిన సరే, లేనియెడల నా శరీరమును మూడురోజులవరకు నెదురుగా నున్న ఖాళీ స్థలములో పాతిపెట్టి గుర్తుగా రెండు జండాలను పాతుము.' అని స్థలమును జూపిరి. ఇట్లనుచు రాత్రి పదిగంటలకు బాబా క్రిందకూలెను. వారి ఊపిరి నిలచిపోయెను. వారి నాడికూడ ఆడకుండెను. శరీరములో నుండి ప్రాణము పోయినట్లుండెను. ఊరివారందరు అచ్చట జేరి న్యాయవిచారముచేసి బాబా చూపిన స్థలములో సమాధి చేయుటకు నిశ్చయించిరి. కాని మహల్సాపతి యడ్డగించెను. తన ఒడిలో బాబా శరీరమునుంచుకొని మూడురోజులట్లే కాపాడుచు కూర్చుండెను. మూడు దినముల పిమ్మట తెల్లవారుఝామున 3 గంటలకు బాబా శరీరములో ప్రాణమున్నట్లు గనిపించెను. ఊపిరి ఆడ నారంభించెను, కడుపు కదలెను. కండ్లు తెరచెను. కాళ్ళు చేతులు సాచుచూ బాబా లేచెను. "
సమస్తమానవాళి రక్షణకై సదాచైతన్య దైవదూతలు జీసస్ , సాయిబాబాలను హృదయపూర్వకముగా ప్రార్ధించెదముగాక !
Similar to Jesus Christ, Saibaba resurrected after death.
Ref: Sri Sai Saccharitra
క్రీస్తుని చూడండి !
ఇచటనె చూడండి రాముని శిరిడిలొ చూడండి
ఇచటనె చూడండి రాముని శిరిడిలొ చూడండి
శిరిడిలొ చూడండి రాముని శిరిడిలొ చూడండి
దానవగుణ సంహారక రాముని సాయిగ చూడండి !
ఇచటనె చూడండి కృష్ణుని శిరిడిలొ చూడండి
ఇచటనె చూడండి కృష్ణుని శిరిడిలొ చూడండి
శిరిడిలొ చూడండి ద్వారక కృష్ణుని చూడండి
ద్వాదశకళ సమ్మోహిత కృష్ణుని సాయిగ చూడండి !
ఇచటనె చూడండి నానక్ శిరిడిలొ చూడండి
ఇచటనె చూడండి నానక్ శిరిడిలొ చూడండి
శిరిడిలొ చూడండి సద్గురు నానక్ చూడండి
తేనెల సూక్తుల తేజసు నానక్ సాయిగ చూడండి !
ఇచటనె చూడండి క్రీస్తుని శిరిడిలొ చూడండి
ఇచటనె చూడండి క్రీస్తుని శిరిడిలొ చూడండి
శిరిడిలొ చూడండి జీసస్ క్రీస్తుని చూడండి
కారుణ్యాలయ కాంతుల క్రీస్తుని సాయిగ చూడండి !
Also please visit the following links for related information.
"Commonality in the messages of Jesus and Sai" https://saileelatelugu.blogspot.com dated Dec 25th, 2018
" సాయీ నీవే జీసస్ " https://saileelatelugu.blogspot.com dated October 7th, 2018
Also please visit the following links for related information.
"Commonality in the messages of Jesus and Sai" https://saileelatelugu.blogspot.com dated Dec 25th, 2018
" సాయీ నీవే జీసస్ " https://saileelatelugu.blogspot.com dated October 7th, 2018
Jesus Christ and Sai Baba, 'The Ever living Divine Holy Sons' of God may always protect the suffering humanity!
ReplyDelete