భగవద్గీత - సాయి జీవనగీత !
శ్రీసాయినాథాయనమః
ఓం శ్రీ సాయి ఆరోగ్యప్రదాత్రేనమః !
భగవద్గీత - సాయి జీవనగీత !
" మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము
" గీతకు భాష్యం చెప్పిన రూపం
దీనుల గీతల మార్చిన రూపం
గీతయె తానుగ చూపిన రూపం
తత్ప్రణమామి గురూ సాయినాథం ! "
భగవద్గీత బ్రహ్మవిద్య, యోగశాస్త్రముల, ఉపనిషత్తుల సారాంశమును తెలియబరచు పవిత్ర హిందూమత మూల గ్రంధము మరియు బోధనా గ్రంథము. గీతయందు వివరింపబడిన పెక్కు జీవనసత్యములను సాయిబాబా నిజజీవితంలో చక్కగా చూడవచ్చును. వేరొకవిధముగా చెప్పాలంటె, బాబాజీవితము భగవద్గీత రహస్యములను, సత్యములను రుజువుపరచిన ప్రయోగశాలగ తలంచవచ్చును. ఉదాహరణముగా ఆత్మ సర్వవ్యాపి యను గీతవాక్యమును, సాయి తాను అనుభవపూర్వకంగా భక్తులకు తెలియజెప్పారు. కుక్కకువేసిన రొట్టెతో సాయి ఆకలి తీరింది, గుఱ్ఱంపై వేసిన కర్రదెబ్బచే సాయి దేహంపై వాతలు తేలాయి, యిలా ఎన్నోన్నో ఉదాహరణలు చూపవచ్చును. ప్రస్తుతము శ్రీమద్భగవద్గీత నుండి పదకొండు శ్లోకములు గ్రహింపబడి, వాని భావమును సాయి జీవితమెలా పోలియున్నదో వివరించు ప్రయత్నము చేయబడినది. ఈపోలికలను చూచినపిమ్మట బాబా జీవితము భగవద్గీతకు భాష్యముగా చెప్పుట అతిశయోక్తి కాదను విషయము తెలియగలదు.
( Ref: శ్రీ సాయి అష్టకము, dated August 23, 2018; SaileelaTelugu.blogspot.com)
" యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుద్దాన మధర్మస్య తదాత్మానాం సృజామ్యహం ! " 4:7
( ఓ అర్జునా! ధర్మమునకు హానికలిగినప్పుడును , అధర్మము హెచ్చుపెరిగిపోవుచున్నప్పుడును నన్ను నేను
( శ్రీకృష్ణుడు) సృజించుకొందును. )
" పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చదుష్కృతాం
ధర్మసంస్థాపనార్ధాయ సంభవామి యుగేయుగే ! " 4:8
( సత్పురుషులను పరిరక్షించుకొనుటకును, దుష్టులను రూపుమాపుటకును, ధర్మమును సుస్థిరమొనర్చుటకును నేను ప్రతియుగమునందును అవతరించుచుందును.)
ధర్మగోవిట భూతలమందున
ఒంటికాలితొ కుంటుచునుండగమతమౌఢ్యములే మెండుగనిండగ
మానవత్వమే మటుమాయంబవ !
కులగోత్రములె రాజ్యమేలగ
నిజసూత్రాలిట పూజ్యమవ్వగ
సరితరుణంబని సాయిగ వెలసెను
కలికలవరములో శిరిడీ పురములో !
పాపుల కర్మల పుడమిలొ బాపగ
పావనధర్మమె పృథివిలొ నింపగ
స్వయంభవుగ సాయుదయించెలె
ద్వారకమాయిలొ దత్త అంశతో !
" కర్మణ్యే వాధికారస్తే
మాఫలేషు కదాచన
మాకర్మ ఫలహేతుర్భు
ర్మాతే సంగో స్వకర్మణి ! " 2:47
( కర్తవ్యకర్మము నాచరించుటయందే నీకు అధికారము గలదు. ఎన్నటికినీ దాని ఫలములయందులెదు. కర్మములకు నీవు హేతువు కారాదు. కర్మలను మానుటయందు నీవు ఆసక్తుడవు కావలదు. అనగా ఫలాపేక్షరహితుడవై కర్తవ్యబుద్ధితో కర్మల నాచరింపుము.)
జన్మకు మూలము కర్మయె చూడుము
కర్మఫలంబులె మరుజన గర్భము
ఆశపాశముల కర్మలె బంధము
ఆజన్మ విముక్తికె జన్మము జన్మము !
కామ్యములేనిది సాయికర్మము
దీనోద్ధరణమె సాయి జన్మము
బంధమువేయని బాబజన్మము
ఆ... భగవంతుని ఆశయజన్మము !
తనసుఖంబును కోరని జన్మము
పర హితంబులకు అంకిత జన్మము
భక్తులబాధలు బాబతొ శూన్యము
భవబంధాలె దూరము దూరము !
మృత్తిక జీవుల ముదముతొ బట్టెను
పుత్తడి బొమ్మలా చేతన నింపెను
జాడ్యము మాంద్యము తుదముట్టించెను
భోగము భాగ్యము కొంగున పంచెను !
సంతానంబిడి చింతలు బాపెను
చంచలచిత్తపు హయముల గట్టెను
సిత్తరంబుగ భక్తుల నీడ్చెను
చక్కదనంబుల రంగుల దిద్దెను !
శిరిడిలొ నిలచే దూరము జేరెను
ఎల్లలు వేళలు సాయికి చెల్లెను
చిత్రపటంబుల విందులు సేసెను
భక్తకోటి కనువిందు జేసెను !
శిక్షింపకనె శిక్షణ గూర్చెను
రక్షించుటకె దక్షిణ లందెను
ధునిలో వికృత కర్మల గాల్చుచు
ఆశ్రిత కోటి తీరిచి దిద్దెను !
శిరిడీ వీధుల మథుకరమందెను
దీనులఁజన్మల యుధ్ధరించెను
ద్వారకమాయిలొ పాకము లొండెను
పశుపక్ష్యాదుల తొడ భుజించెను !
లీలామానుష వేషధారిలె
బాలగోపాల రూపు సాయిలె
ద్వారకామాయియె వాటి కాయిలె
యమునాతటికి సాటిసాటియే !
" మయ్యావేశ్య మనో యేమామ్
నిత్యయుక్తా ఉపాసతే
శ్రద్ధయా పరయోపేతా
స్థేమేయుక్త తమా మతః! " 12:2
(పరమేశ్వరుడనైన నాయందే ఏకాగ్రచిత్తులై, నిరంతరము నా భజన ధ్యానాదులయందే నిమగ్నులై, అత్యంతశ్రద్ధాభక్తులతో సగుణరూపమున నన్ను నన్ను ఆరాధించు భక్తులే యోగులలో మిక్కిలి శ్రేష్ఠులు - అని నా అభిప్రాయము.)
ఆ పరమాత్మయె తాను యైనను
ఆ అల్లాయే తాను యైనను
జీససు నానకు రూపుడైనను
తా సేవించెను సాయి గురువును !
పండెడేళ్ల గురువాసము జేసెను
ఆశపాశముల కేశములిచ్చెను
శ్రద్ధసబూరి రెండుపైసల
గురుదక్షిణగ నిష్ఠతొ నొసగెను !
తలకిందులుగా తా వేలాడుచు
అంతర్ముఖుడై ఆత్మను గాంచెను
గురుకరుణామృత పానము సేయుసు
గురుని కానుకగ ఇటుకను పొందెను !
భక్తిమార్గమె శక్తిమార్గమని
ముక్తినొసగు ప్రేమైక మార్గమని
తా సూదంటుల భక్తుల నీడ్చెలె
ద్వారకమాయిలొ సద్గతినొసగ !
నవవిధంబుల ఆ మార్గంబున
నేర్పుతొ భక్తుడు తా చరింపవలె
అహమును విడిచి గురుపాదంబుల
పరసుఖంబునకు పాటుబడవలె !
తనువును మనసును గురుపరంబుగ
నిరతము సతతము గురుపదంబుల
శరణము యన యన క్షణక్షణంబులొ
గురువందించులె పరమ పదంబును !
మన ధ్యానంబులు గురుని చేరులె
మన భారంబుల గురువు మోయులె
ఆ ద్వారంబుకె గురువు నడుపులె
ఆత్మానందమె యెదల నిండులె !
భక్తుల హృదయమె ప్రభునిరాజ్యము
ప్రభువసించెడి పసిడిపంజరము
హనుమ గుండె శ్రీరామువాసము
మార్జాలన్యాయమె భక్తమార్గము !
భక్తుని ఆర్తికి ప్రభువు పరుగిడు
వడివడి నడకల వచ్చి నిలబడు
గడబిడ నిడుముల తృటిలొ సరినిడు
గజరాజేంద్రుల గాధల మనమిడు !
మీరాభక్తికి విషము విరిగెను
ప్రహ్లాదశక్తికి వహ్ని యారెను
హాలాహలమునె హరుడు నిలిపెను
భక్తుల బాధల బాబ పొందెను !
బాబాతొ భక్తుల బంధమబేధము
ఆ.. పరమాత్మ ఆత్మల బంధము
సంగమ సాగర మత్యద్భుతము
మిళితము మిళితము అది అద్వైతము!
" ప్రజహాతి యదా కామాన్
సర్వాన్ పార్ధ మనోగతాన్
ఆత్మన్యే వాత్మనా తుష్టహః
స్థితప్రజ్ఞస్తదోచ్యతే ! " 2:55
(ఓ అర్జునా! మనస్సునందలి కోరికలన్నియును పూర్తిగా తొలగిపోయి, ఆత్మద్వారా ఆత్మయందు సంతుష్టుడైనవానిని, అనగా పరమాత్మ సంయోగమువలన ఆత్మానందమును పొందినవానిని స్థితప్రజ్ఞుడని యందురు.)
సుఖము దుఃఖము సాయికేకము
శునకము కనకము బాబకేకము
శీతల ఉష్ణము ఏకమేకము
రాజుయు పేదయు సాయికర్హము !
ఎల్లలు చెల్లిన అంతరంగము
పొంగుల పొరలెడి పున్నమి సంద్రము !
కూర్మన్యాయమె సద్గురు భావము
అంతర్ముఖపూ ఆత్మానందము
నందనందనుని నవనీతంబదె
ఆశ్రిత కోటి పాయసంబదె !
త్రిగుణాతీతుడె సాయి దేవుడు
త్రికాల నేత్రుడె సాయి నాథుడు
త్రిమూర్తి శక్తియె సాయి దత్తుడు
తురీయ క్షేతుడె అత్రి పుత్రుడు !
అసురగుణంబుల మదమణగించి
అరివర్గంబుల మదిలో గూలిచి
దైవ గుణంబుల తనలో నిలిపి
దేవగణంబుల నుతుల నొందెను !
" తద్విద్ధి ప్రణిపాతేన
పరిప్రశ్నేన సేవయా
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం
జ్ఞానినస్తత్వ దర్శినః ! " 4:34
(నీవు తత్వమును దర్శించిన జ్ఞానులకడకేగి, ఆ జ్ఞానమును గ్రహింపుము. వారికి దండప్రణామముల నాచరించుటవలనను, సేవలొనర్చుటవలనను, కపటములేకుండ భక్తిశ్రద్ధలతో సముచితరీతిలో ప్రశ్నించుటవలనను పరమాత్మతత్వమును చక్కగా నెరింగిన జ్ఞానులు సంప్రీతులై, నీకు ఆ పరమాత్మ తత్వజ్ఞానమును ఉపదేశించెదరు.)
బ్రహ్మమదియె అనంతవ్యాపకము
శతసూర్యప్రకాశము తేజొవంతము
ముంగిటయున్నను కొంగున నిండిన
నెరుగుట కష్టము నిష్ఠతొ సాధ్యము !
సద్గురు సహ చర్యము కావలె
తనువు మనసుతొ తాను లొంగవలె
ప్రాణ పంచక పంచేంద్రియముల
చిత్తకూటముల నర్పింపవలె !
పరిపరివిధముల ప్రశ్నవేయవలె
పరమాత్మగను ప్రశ్నవేయవలె
సవినయంబుగ సేవ సేయవలె
సతతము సద్గురు కనుల నిలుపవలె !
గురుముఖంబున జ్ఞానము విడివడు
గురునేత్రంబుల జ్ఞానము గనబడు
గురు సత్కృపతొ జ్ఞానము నిలబడు
గురుచరణంబుల ప్రణిపాతంబన !
ఆత్మను గాంచిన వారలె గురువులు
తిమిరము గూల్చిన వారలె జ్ఞానులు
అట్టి గురుండను గట్టిగపట్టి
సాయిదేవులు బ్రహ్మను బట్టెను !
బ్రహ్మయికత్వము తాను పొందెను
బ్రహ్మాండంబును తానై నిండెను
ఆసర్వాత్మకు రూపుగ నిలచెను
సాయి దేవునిగ శిరిడిలొ వెలసెను !
రూపమనేకము శతసహస్రము
విశ్వవ్యాపకము సాయి తేజము
ద్వారకామాయియె లీలల కేంద్రము
అంతరంగముల నీడ్చెడి సూత్రము !
ఆత్మపీఠము ద్వారకమాయది
అన్నిరూపులకు ఆటపట్టుయది
భావమెటులనొ రూపమటులుగ
భాసించెడి ప్రభాతకిరణమది !
కాశి అయోధ్య బృందావనమది
తిరు వేంకటపతి తిరుమలగిరియది
పండరిపుర సంబర అంబరమది
సిరీశైలంబును భద్రాచలమది !
అందరి తనలో చూపెడి గుడియది
తనలో అందరి నిలిపెడు మహిమది
పిపీలకంబుల హిమవన్నగముల
భగవన్మహిమగ నిండిన గుణమది !
శిష్ట కర్మల రక్షభూమియది
దుష్టకర్మల కాల్చు కాష్టమది
వైరాగ్యంబును గూర్చు వేదమది
సౌభాగ్యంబుల నింపు వూదియది !
శాపము తాపము తొలగెడి గుడియది
రాగము రోగము మానెడి గుహయది
అలజడి కోరిక లణగెడి గదియది
శాంతి ప్రశాంతుల నొసగెడి సుఖమది !
" పశ్యామి దేవాంస్తవ దేవ దేహే
సర్వాంస్తథా భూతవిశేషసంఘాన్
బ్రాహ్మణమీశం కమలాసనస్థం
ఋ షీ శ్చ సర్వానురగాశ్చ దివ్యాన్ ! 11:15
(అర్జునుడు పలికెను - ఓ దేవాదిదేవా! నీ విరాట్ రూపమునందు సకల దేవతలను, నానావిధప్రాణికోటిని, కమలాసనుడైన బ్రహ్మను, మహాదేవుడైన శంకరుని , సమస్తఋషులను, దివ్యసర్పములను చూచుచున్నాను.)
శ్రీకృష్ణునియందున పార్ధుడు గాంచెను
సకల చరాచర దేవిదేవతల
భక్తులు యటులనె గాంచిరి సాయిలో
రామకృష్ణపరమేశు రూపముల,
యోగిపుంగవుల సర్వజీవులా
" సర్వధర్మాన్ పరిత్యజ్య
మామేకం శరణం వ్రజ
అహంత్వా సర్వ పాపేభ్యో! "
మోక్షయిక్ష్యామి మా శుచః! " 18:66
(సర్వధర్మములను అనగా సమస్తకర్మలను నాకు సమర్పింపుము. సర్వశక్తిమంతుడను, సర్వాధారుడను, పరమేశ్వరుడను ఐన నన్నే శరణు జొచ్చుము. అన్ని పాపములనుండియు నిన్ను నేను విముక్తుని గావించెదను. నీవు శోకింపకుము.)
సర్వశక్తుల మూసయె సాయి
సర్వరూపముల కూటమె సాయి
సర్వవేదికల వేదమె సాయి
సర్వవాదముల అంతమె సాయి!
మనవిశ్వాసంబును సన్నగింపక
సర్వశక్తులతొ సాయిని గొల్వగ
సాయినాథుడిల మురళీధరునిగ
మోక్షంబిడులే యదృష్టంబన!
" యత్రయోగేశ్వరః కృష్ణో
యత్ర పార్ధో ధనుర్ధరః
తత్ర శ్రీర్విజయోభూతి
ర్దృవానీతి మతిర్మమహః ! " 18:78
(ఓ రాజా! యోగేశ్వరుడైన శ్రీకృష్ణభగవానుడను, గాండీవధనుర్ధారియైన అర్జునుడును ఉండుచోట సంపదలను, సర్వవిజయములును, సర్వైశ్వర్యములును, సుస్థిరమైన నీతియు ఉండును, అని నా నిశ్చితాభిప్రాయము.)
ఎచట సాయిగురు రూపముండునో
ఎచట శ్యామునీ భక్తినిలుచునో
అచట అభయము శుభము పొంగులే
అచట విజయము స్థిరము నిజములే!
" వాసాంసి జీర్ణాని యధా విహాయ
నవాని గ్రిష్ణాతి నరోపరాణి
తధాశరీరాణి విహాయ జీర్ణా
నన్యాని సంయాతి నవాని దేహి ! " 2:22
(మానవుడు జీర్ణవస్త్రములను త్యజించి, నూతన వస్త్రములను ధరించినట్లు జీవాత్మ ప్రాతశరీరములను వీడి నూతనశరీరములను పొందును.)
" నైనం ఛిన్దన్తి శస్త్రాణి
నైనం దహతి పావకః
నచైనం కెలేద యష్ట్యాపో
నశోషయతి మారుతః ! " 2:23
(ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు. అగ్ని దహింపజాలదు. నీరు తడుపజాలదు. వాయువు ఆరిపోవునట్లు చేయజాలదు.)
మాసిన కఫ్నిని మార్చిన తీరున
దేహ గేహమును సాయి మార్చెను
పాంచభౌతిక రూపు వీడినా
సూక్ష్మ రూపుతొ రక్షించుచు నుండెను!
మురళీధర రూపుడాయెను
బూటీ గృహ వాసుడాయెను
సమాధినుండియె సకల కార్యముల
సాయి సాయి యన సేయుచునుండెను!
బహు సత్యంబులు సాయి వాక్యములు
ఏకాదశముఖ సూత్ర సూత్రములు
నిత్యసత్యములు నిర్మలత్వములు
నమ్మినవారల ముక్తిమార్గములు!
రూపమనేకము శతసహస్రము
విశ్వవ్యాపకము సాయి తేజము
ద్వారకామాయియె లీలల కేంద్రము
అంతరంగముల నీడ్చెడి సూత్రము !
ఆత్మపీఠము ద్వారకమాయది
అన్నిరూపులకు ఆటపట్టుయది
భావమెటులనొ రూపమటులుగ
భాసించెడి ప్రభాతకిరణమది !
కాశి అయోధ్య బృందావనమది
తిరు వేంకటపతి తిరుమలగిరియది
పండరిపుర సంబర అంబరమది
సిరీశైలంబును భద్రాచలమది !
అందరి తనలో చూపెడి గుడియది
తనలో అందరి నిలిపెడు మహిమది
పిపీలకంబుల హిమవన్నగముల
భగవన్మహిమగ నిండిన గుణమది !
శిష్ట కర్మల రక్షభూమియది
దుష్టకర్మల కాల్చు కాష్టమది
వైరాగ్యంబును గూర్చు వేదమది
సౌభాగ్యంబుల నింపు వూదియది !
శాపము తాపము తొలగెడి గుడియది
రాగము రోగము మానెడి గుహయది
అలజడి కోరిక లణగెడి గదియది
శాంతి ప్రశాంతుల నొసగెడి సుఖమది !
" పశ్యామి దేవాంస్తవ దేవ దేహే
సర్వాంస్తథా భూతవిశేషసంఘాన్
బ్రాహ్మణమీశం కమలాసనస్థం
ఋ షీ శ్చ సర్వానురగాశ్చ దివ్యాన్ ! 11:15
(అర్జునుడు పలికెను - ఓ దేవాదిదేవా! నీ విరాట్ రూపమునందు సకల దేవతలను, నానావిధప్రాణికోటిని, కమలాసనుడైన బ్రహ్మను, మహాదేవుడైన శంకరుని , సమస్తఋషులను, దివ్యసర్పములను చూచుచున్నాను.)
శ్రీకృష్ణునియందున పార్ధుడు గాంచెను
సకల చరాచర దేవిదేవతల
భక్తులు యటులనె గాంచిరి సాయిలో
రామకృష్ణపరమేశు రూపముల,
యోగిపుంగవుల సర్వజీవులా
" సర్వధర్మాన్ పరిత్యజ్య
మామేకం శరణం వ్రజ
అహంత్వా సర్వ పాపేభ్యో! "
మోక్షయిక్ష్యామి మా శుచః! " 18:66
(సర్వధర్మములను అనగా సమస్తకర్మలను నాకు సమర్పింపుము. సర్వశక్తిమంతుడను, సర్వాధారుడను, పరమేశ్వరుడను ఐన నన్నే శరణు జొచ్చుము. అన్ని పాపములనుండియు నిన్ను నేను విముక్తుని గావించెదను. నీవు శోకింపకుము.)
సర్వశక్తుల మూసయె సాయి
సర్వరూపముల కూటమె సాయి
సర్వవేదికల వేదమె సాయి
సర్వవాదముల అంతమె సాయి!
మనవిశ్వాసంబును సన్నగింపక
సర్వశక్తులతొ సాయిని గొల్వగ
సాయినాథుడిల మురళీధరునిగ
మోక్షంబిడులే యదృష్టంబన!
" యత్రయోగేశ్వరః కృష్ణో
యత్ర పార్ధో ధనుర్ధరః
తత్ర శ్రీర్విజయోభూతి
ర్దృవానీతి మతిర్మమహః ! " 18:78
(ఓ రాజా! యోగేశ్వరుడైన శ్రీకృష్ణభగవానుడను, గాండీవధనుర్ధారియైన అర్జునుడును ఉండుచోట సంపదలను, సర్వవిజయములును, సర్వైశ్వర్యములును, సుస్థిరమైన నీతియు ఉండును, అని నా నిశ్చితాభిప్రాయము.)
ఎచట సాయిగురు రూపముండునో
ఎచట శ్యామునీ భక్తినిలుచునో
అచట అభయము శుభము పొంగులే
అచట విజయము స్థిరము నిజములే!
" వాసాంసి జీర్ణాని యధా విహాయ
నవాని గ్రిష్ణాతి నరోపరాణి
తధాశరీరాణి విహాయ జీర్ణా
నన్యాని సంయాతి నవాని దేహి ! " 2:22
(మానవుడు జీర్ణవస్త్రములను త్యజించి, నూతన వస్త్రములను ధరించినట్లు జీవాత్మ ప్రాతశరీరములను వీడి నూతనశరీరములను పొందును.)
" నైనం ఛిన్దన్తి శస్త్రాణి
నైనం దహతి పావకః
నచైనం కెలేద యష్ట్యాపో
నశోషయతి మారుతః ! " 2:23
(ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు. అగ్ని దహింపజాలదు. నీరు తడుపజాలదు. వాయువు ఆరిపోవునట్లు చేయజాలదు.)
మాసిన కఫ్నిని మార్చిన తీరున
దేహ గేహమును సాయి మార్చెను
పాంచభౌతిక రూపు వీడినా
సూక్ష్మ రూపుతొ రక్షించుచు నుండెను!
మురళీధర రూపుడాయెను
బూటీ గృహ వాసుడాయెను
సమాధినుండియె సకల కార్యముల
సాయి సాయి యన సేయుచునుండెను!
బహు సత్యంబులు సాయి వాక్యములు
ఏకాదశముఖ సూత్ర సూత్రములు
నిత్యసత్యములు నిర్మలత్వములు
నమ్మినవారల ముక్తిమార్గములు!
భగవద్గీతయందు శ్రీకృష్ణ పరమాత్మ చేసిన బోధకు, సాయి తమజీవితమున చూపిన యనుభవములకు యెంతటి సారూప్యమో ?
ReplyDelete