శ్రీసాయికృష్ణ భాగవతము.
శ్రీకృష్ణ పరమాత్మనే నమః !
పాఠక సాయిబంధువులందరికి హృదయపూర్వక జన్మాష్టమి శుభాకాంక్షలు!
ముందుమాట, ఓ చిన్న స్వానుభవము.
శ్రీకృష్ణ జన్మాష్టమి 1994 వ సంవత్సరములో ఆగష్టు 29 వ తేదీన వచ్చినది. షుమారు ఓ నెలరోజులముందుగ ఓ ఆలోచన కలిగినది. సాయిబాబా ఎన్నో మహిమలు, లీలలు చూపారు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మకూడ బాలప్రాయంలోనే ఎన్నెన్నో అద్భుత లీలలు చూపారు. సాయిబాబా బూటీ వాడలోని మురళీధరుడుగదా! మరి శ్రీకృష్ణ లీలలకు , బాబా లీలలకు ఏమైనా పోలికలున్నాయా అనే తలంపు వచ్చినది. ఆ ఆలోచన కలిగిన రెండు రోజుల తర్వాత ఈనాడు పేపర్ చదువుతున్నాను. కొన్నిపేజీల తర్వాత ఓ పేజీలో క్రిందభాగంలో శ్రీకృష్ణ లీలల సచిత్ర ధారావాహికం ప్రచురింపబడినది. అదే లీలా ప్రారంభ సంచిక. ఆలా నాలుగు వారాలు భాగవతంలోని కృష్ణలీలలన్నీ ప్రచురింప బడ్డాయి. నేను ఆ నాలుగు వారాల లీలను సేకరించడం జరిగింది. పరిశీలించిన పిమ్మట నాకే ఆశ్చ్యర్యం కలిగే విధంగా, ప్రతి శ్రీకృష్ణ లీలకు ఓ బాబా లీల పోలికగ నా ఊహ కందినది. అలా జన్మాష్టమి సమయానికి శ్రీసాయికృష్ణ భాగవతం గేయ రూపంగా వ్రాయడం పూ ర్తయినది. ఈ వ్యవహారమంతా సాయి ప్రేరణగా తలుస్తాను. ఇప్పటికీ సాయి బాబా గుర్తురాకుండా శ్రీకృష్ణ పరమాత్మను గూర్చి చదవలేను, అలాగే శ్రీకృష్ణ పరమాత్మ మది మెదలక సాయిపరమాత్మను స్మరించలేను. వారిరువురు ఒకే పరమాత్మ నాణానికి రెండు వైపులనే భావన కలుగుతుంది.
శ్రీకృష్ణ జన్మాష్టమి 1994 వ సంవత్సరములో ఆగష్టు 29 వ తేదీన వచ్చినది. షుమారు ఓ నెలరోజులముందుగ ఓ ఆలోచన కలిగినది. సాయిబాబా ఎన్నో మహిమలు, లీలలు చూపారు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మకూడ బాలప్రాయంలోనే ఎన్నెన్నో అద్భుత లీలలు చూపారు. సాయిబాబా బూటీ వాడలోని మురళీధరుడుగదా! మరి శ్రీకృష్ణ లీలలకు , బాబా లీలలకు ఏమైనా పోలికలున్నాయా అనే తలంపు వచ్చినది. ఆ ఆలోచన కలిగిన రెండు రోజుల తర్వాత ఈనాడు పేపర్ చదువుతున్నాను. కొన్నిపేజీల తర్వాత ఓ పేజీలో క్రిందభాగంలో శ్రీకృష్ణ లీలల సచిత్ర ధారావాహికం ప్రచురింపబడినది. అదే లీలా ప్రారంభ సంచిక. ఆలా నాలుగు వారాలు భాగవతంలోని కృష్ణలీలలన్నీ ప్రచురింప బడ్డాయి. నేను ఆ నాలుగు వారాల లీలను సేకరించడం జరిగింది. పరిశీలించిన పిమ్మట నాకే ఆశ్చ్యర్యం కలిగే విధంగా, ప్రతి శ్రీకృష్ణ లీలకు ఓ బాబా లీల పోలికగ నా ఊహ కందినది. అలా జన్మాష్టమి సమయానికి శ్రీసాయికృష్ణ భాగవతం గేయ రూపంగా వ్రాయడం పూ ర్తయినది. ఈ వ్యవహారమంతా సాయి ప్రేరణగా తలుస్తాను. ఇప్పటికీ సాయి బాబా గుర్తురాకుండా శ్రీకృష్ణ పరమాత్మను గూర్చి చదవలేను, అలాగే శ్రీకృష్ణ పరమాత్మ మది మెదలక సాయిపరమాత్మను స్మరించలేను. వారిరువురు ఒకే పరమాత్మ నాణానికి రెండు వైపులనే భావన కలుగుతుంది.
శ్రీసాయికృష్ణ భాగవతము.
యథా యథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యు త్తాన మధర్మస్య తదాత్మానాం సృజామ్యహం గీత: 4:7
(ఓ అర్జునా! ఎపుడెపుడు ధర్మానికి హాని కలుగునో, అపుడపుడు
ధర్మరక్షణార్థము స్వయముగ అవతరించెదను.)
శ్రీ సాయిలీలామృతము మధురము అతి ప్రియము ప్రియము,
లీలల ఘనలీలల, శ్రీ కృష్ణలీల భాగవతము!
కృష్ణ జన్మ రహస్యము రాక్షస సంహారమె
ధర్మరక్షణార్థమే మహావిష్ణు అవతారము
కలి ఇచట థర్మగోవు ఒంటికాలు కుంటుచుండ
ఇల వెలసెను సాయీశుడు ధర్మమును నిలుపగను | శ్రీ సాయిలీలామృతము |
(ద్వాపరయుగంలో రాక్షస సంహారము, ధర్మరక్షణార్ధము శ్రీకృషుని అవతారము, కలియుగంలో మానవతా విలువలను పెంపొందించుటకొరకు శ్రీ సాయినాథుని అవతారము.)
బాలకృష్ణ జననము మథురలొ చెరసాలయె
దేవకి సుత వాసము గోకుల యశోద గృహమె
తెలియరాని గుహ్యమదియె సాయినాథ జననము
షిరిడియె బృందావనము సాయిదేవ నిజవాసము | శ్రీ సాయిలీలామృతము |
(మథుర చెరసాలలో శ్రీకృష్ణ జననము, తెలియరానిది సాయిబాబా జన్మస్థలము, బృందావనంలా మహిమల కేంద్రము సాయి నివాస షిరిడీ పురము.)
కంసమామ పంపున పెక్కురక్కసి మూకలు
విధ్వంసము సేసెను గోవిందుని వాసము
కలిమాయతొ వెల్లువాయె కామ క్రోధ మోహములు
జనజీవన మాయెలె అల్లకల్లోలము | శ్రీ సాయిలీలామృతము |
( కంసుని ఆజ్ఞమేర పెక్కురక్కసులు గోకుల బృందావనముల ధ్వంసముచేయ, కామక్రోధమోహాలు, పెక్కుదేహబాధలు కలియుగంలో మానవుల చుట్టుముట్టాయి.)
లీలలెన్నొ చూపెలె గోకుల ప్రియ తిలకము
అవలీలగ రక్కసుల నేల కొరగ జేసెను
సాయి సాయి యటులనె జగతి జనుల గాచెను
రోగముల వేదనల త్రుటిలొ ద్రుంచివేసెను | శ్రీ సాయిలీలామృతము |
( శ్రీకృష్ణుడు అవలీలగ రాక్షసుల చంపి పెక్కులీలల జూపాడు. సాయినాథుడు మానవాళి బాధలను, వేదనల కుపశమనం కల్గించాడు.)
చిరువేలిపై చిన్మయుడే గోవర్ధనం నిలిపెను
గోవుల గోపాలుర విస్మయముగ బ్రోచెను
ప్రళయమదియె గర్జనల షిరిడి ప్రజయె కంపింప
శాంతిపగ శాసించె కనుసైకల సాయిదేవ | శ్రీ సాయిలీలామృతము |
( తన చిఱువేలిపై గోవర్ధన పర్వతమునెత్తి పెక్కుప్రళయంనుండి గోవుల గోపాలుర రక్షించాడు చిన్నకృష్ణుడు. పెనుతుఫానుచే షిరిడీ ప్రజలు మిగుల భయపడ వారిని కాపాడాడు సాయినాథుడు.)
తనదు చిన్న నోటిలోనె విశ్వంబును జూపింప
యశోదమ్మ విస్తుబోయె వాస్తవము గ్రహించి
ఇష్టదైవ రూపముల ఆశ్రీతులు కనులజూడ
విశ్వరూపుడయ్యే సాయి భక్తకోటి మిగుల పొగడ | శ్రీ సాయిలీలామృతము |
( తన చిన్న నోటిలొ సకల విశ్వాన్ని జూపి తల్లి యశోదను ఆశ్చర్యపరిచాడు శ్రీకృష్ణుడు, భక్తులకు తమ ఇష్టదైవ రూపములఁజూపి విశ్వరూపుడైనాడు సాయినాథుడు.)
( తన చిన్న నోటిలొ సకల విశ్వాన్ని జూపి తల్లి యశోదను ఆశ్చర్యపరిచాడు శ్రీకృష్ణుడు, భక్తులకు తమ ఇష్టదైవ రూపములఁజూపి విశ్వరూపుడైనాడు సాయినాథుడు.)
సృష్టికి ప్రతి సృష్టిజేసి గోవుల గోపాలుర
తమ గృహముల వెడల జేసె నందలాల గోపాల
నీరు నిప్పు సృష్టించి నీటితోటె వెలుగునిచ్చి
ఆ సృష్టినె మరలజూపె సృష్టికర్త యనగ సాయి | శ్రీ సాయిలీలామృతము |
( బ్రహ్మ మాయంజేసిన గోవుల, గోపాలుర సృష్టించి తమతమ యిండ్లకు పంపాడు శ్రీకృష్ణుడు, చిలుము వెలిగించుటకు నీరు నిప్పు సృష్టించాడు, నీటితో దీపాలు వెలిగించాడు సాయిదేవుడు.)
నవనీత చోరుడు నందగోపాలుడు
గోపికల మనసులనే దొంగిలించె వెన్నలా
సూదంటు శిలయె సాయి తనభక్తుల నీడ్చగా
తనువులూ మనసులూ, వశములు పరవశములే | శ్రీ సాయిలీలామృతము |
( వెన్నదొంగ గోపికల మనసుల దొంగిలింప, సూదంటు లాంటి సాయి తమభక్తులను తనువులు మనసులు పరవశించునటుల షిరిడీ కీడ్చినాడు.)
మురళీ రవ హాయికి లోకువాయె లోకాలు
మైమరపులు గోవులకు గోపిక గోపాలురకు
తర తమ భేదము మరచి హాయినొందె జీవకోటి
సాయిచూపు తాకినంత సాయి రూపు కనులనిండ | శ్రీ సాయిలీలామృతము |
( వేణుగాన నాదానికి లోకాలు లోకువైనాయి, గోవులు గోపాలురు మైమరచారు. సాయి నీడన తర తమ బేధముల మరచి జీవకోటి మిగుల హాయి పొందినది.)
బహుశిరముల నురగ రాజు కాళీయుని మర్థించి
పడగలపై నర్తించె ద్వాపరయుగ అవతారము
శ్యామ నాగ విషము విరచి ప్రాణంబుల రక్షించె
కృష్ణ యవతారుడనగ ద్వారకమయి సాయిదేవ | శ్రీ సాయిలీలామృతము |
( కాళీయుని మర్దించి పడగలపై నర్తించాడు చిన్నికృష్ణుడు. పెదనాగు విషంనుండి భక్తుడు శ్యామా ప్రాణాల రక్షించాడు , పెక్కు సర్పగండాల తొలగించాడు శిరిడి దేవుడు.)
గోపిక గోపిక క్రీడల నల్లనయ్య కృష్ణయ్య
గోపిక లందరి గృహముల చల్లనయ్య కృష్ణయ్య
యశోదమ్మ ముంగిట అల్లరయ్య కృష్ణయ్య
ఒక్కడే కృష్ణయ్య ఇచట నచట చూడరయ్య | శ్రీ సాయిలీలామృతము |
( ఒక్కడే కృష్ణుడు అటు గోపికల అందరి యిండ్లలోను, తల్లి యశోదమ్మ ముంగిటను మురిపించాడు.)
ద్వారకమయి నీడనెపుడు వీడని సాయన్న
జాంనేరు లీల చూపేలె బహునేర్పరి సాయన్న
హేమాద్రిపంత్ విందుకాయె హాజరు సాయన్న
ముందు పలికి గయలో విందు సేసె సాయన్న | శ్రీ సాయిలీలామృతము |
అక్రూరుని పూర్వ జన్మ సుకృతమది యేమొ గాని
( తన నిజవాసము ద్వారకామాయిని వీడని సాయినాథుడు, జాంనేరులో లీలజూపి విభూతి నందించాడు, బాంద్రాలోని హేమాడ్ పంతునింట విందుకు హాజరైనాడు, దూరాన గయలో చిత్రపటం రూపంలో చిత్రాలజూపాడు.)
జలవాటిక విష్ణురూప దర్శనమదె కృష్ణమాయ
శిలవేదిక మసీదున దశరూపుడు సాయిదేవ
దశ దిశల ఖ్యాతి వెడల ఆశ్రీ..తుల మాయతొలగ | శ్రీ సాయిలీలామృతము |
( బృందావనంనుండి మథురకు వెడలు మార్గంలో ఓ సరోవరంలో భక్తుడు అక్రూరునకు విష్ణురూపదర్శనిమిచ్చాడు శ్రీకృష్ణుడు. ద్వారకామాయిలో తనస్థానమున కూర్చుండియే భక్తులకు దశావతారముల జూపించాడు సాయిబాబా. )
కురూపికి రూపమిడియె కృష్ణ భక్త బాంధవుడు
సుధామునికి కుసుమములతొ విభవమొసగె మాధవుడు
కుష్టురోగ ముక్తుడాయె భాగోజీ బాబా చలువ
కలకండతొ భాగ్యమొందె చోల్కర్ బాబ వలన | శ్రీ సాయిలీలామృతము |
(సుగంధద్రవ్యాల సమర్పించిన కురూపికి రూపమిచ్చాడు, పరిమళ పుష్పాలు సమకూర్చిన సుధామునకు సంపదలు గూర్చాడు శ్రీకృష్ణుడు. సాయి దీవెనల కుష్టువ్యాధి ముక్తుడైనాడు భాగోజీ షిండే, సాయికి కలకండ సమర్పించి ఉద్యోగం పొంది ఈతిబాధలనుండి ముక్తుడైనాడు చోల్కరు.)
మేనమామ నేలగూల్చి అవనిభార మంతరించి
తనవారల హితముసేసె మురారియె యిలలొ మేటి
అంతరంగ రిపువర్గము అంతరింపజేయ బలికి
శరణుగోరు వారినెల్ల లీల గాచె సాయి షిరిడి | సాయిలీలామృతము |
( సొంత మేనమామ దుష్ట కంసుని సంహరించి ప్రజల కాపాడాడు శ్రీకృష్ణుడు, మనసులలో దాగియున్న కామ క్రోధ లోభాది శత్రువులనుండి తన భక్తుల రక్షించాడు సాయిదేవుడు.)
సాందీపుని శుశ్రూషతొ సకలవిద్య లభ్యసించి
దక్షిణగా గురుపుత్రుని తిరిగితెచ్చి ముదముగూర్చెశ్రద్ధాసహన దక్షిణలగ సాయిదేవ గురునిసేవ
బహుకాలము జేసి జేసి కలియుగ అవతారుడాయె | సాయిలీలామృతము |
( గురు సాందీపునికి సేవలుజేసి పెక్కువిద్యలు నేర్చినాడు, మాయమైన గురుపుత్రుని తెచ్చి కానుకగా సమర్పించాడు శ్రీకృష్ణుడు. శ్రద్ధాసహనములనెడి రెండు కాసుల నర్పించి పెక్కుకాలము గురుసేవజేసి కలియుగ అవతారుడైనాడు సాయినాథుడు.)
తదాశ్రయ భక్తకోటి రక్షణ నిమిత్తమే
ద్వారక నిర్మాణ మాయె సాముద్ర గర్భమున
ద్వారకా మయి యదియె సాయిదేవ ప్రియవాసము
కలిబాధల భువి మానుపు కన్నతల్లి ప్రియ గర్భము | సాయిలీలామృతము |
( తనను ఆశ్రయించిన ప్రజలను కాపాడుటకై ద్వారకానగరాన్ని నిర్మించాడు శ్రీకృష్ణుడు. శరణుకోరినవారల రక్షించు తల్లిగర్భము సాయిదేవునివాసము ద్వారకామాయి.)
రక్కసులా నచట గూల్చె శ్రీకరుడూ ముకుందుడు
గతికోరిన వారల శీఘ్రగతి రక్షించు సాయి
అభయ మొసగి శుభముగూర్చు వాస్తవంబు నాడు నేడు | సాయిలీలామృతము |
( శత్రువులపై పోరాడి మనసిచ్చిన రుక్మిణిని వివాహమాడినాడు శ్రీకృష్ణుడు. సర్వశ్య శరణాగతికోరిన భక్తుల శుభములగూర్చాడు సాయినాథుడు.)
శమంతక మణియదియె బహుసంపద ప్రదాయిని
కేశవుడది త్యజియించి మోహమునే జయించిలె
సచిదానంద గురువె సాయి ద్వారకా మయిలొ
ఇహసంపద నిరశించి పరసంపద నందించె | సాయిలీలామృతము |
( బహుసంపదల గూర్చు శమంతక మణిని నిరసించి మోహమునే జయించాడు శ్రీకృష్ణుడు. బాహ్యసిరిసంపదల కోరకయే దైవసంపద నందించాడు భక్తులకు సాయినాథుడు.)
గుప్పి డవియె కుచేలుని అటుకులు శ్రీకృష్ణునికి
లేమితొలగ కలిమిజేసె తనదుబాల్య మిత్రునికి
భక్తి కుదిరినేని యింత శ్రద్ధ కలిగెనేని యింత
శత గుణక ఫలము గలుగు సిరిసంపద సాయినింట | సాయిలీలామృతము |
( తన బాల్యమిత్రుడు పేదవాడు, కుచేలునకు గుప్పెడు అటుకులచే పెక్కుసంపదలందించాడు శ్రీకృష్ణుడు. భక్తిశ్రద్ధలతో సమర్పించిన కానుకలకు వేయిరెట్ల ఫలమందించాడు సాయిదేవుడు.)
బహుళాశ్వ శృతిదేవుల గోవిందుడె విందుపొంద
హృదయమందు రాజుపేద ఒకరను సందేశమాయె
భాగోజీ బూటియుల సమదృక్కుల సేవలంద
సాయి మనము కలిమి లేమి ఏకమనే భావమాయె | సాయిలీలామృతము |
( ధనవంతుడు బహుళాస్వుడు, పేదవాడు శృతిదేవుని గృహములకు వెళ్లి వారి విందుల స్వీకరించాడు శ్రీకృష్ణుడు. పేదవాడు భాగోజీ షిండే, కోటీశ్వరుడు బుటీలను సమంగా ఆదరించాడు సాయినాథుడు.)
మేనత్త కుంతిపుత్రు పాండవులా యెల్లవేళ
కురుయోధుల కపటంబుల రక్షించెను కృష్ణదేవ
అక్క బాయిజ బాయి పుత్ర తాత్య మరణవేళ
తనదు ప్రాణంబులా ఫణముసేసె సాయిలీల | సాయిలీలామృతము |
( మేనత్త కుంతీ పుత్రులు పాండవులను కంటికి రెప్పలా రక్షించాడు కృష్ణపరమాత్మ. తాను అక్కగా పిలిచే బాయిజా బాయి పుత్రుడు తాత్యాప్రాణముల రక్షించుటకై తనప్రాణములనిచ్చినాడు సాయిదేవుడు.)
అష్టమి పుట్టినవానికి అష్టపట్ట మహీషిలే
గీతబోధ యోగేశ్వర నిత్యశోభ లాలసయే
అష్టదిక్పాలకులతొ సాయిదర్బారులే
సాయిలోక పాలకుడే నిత్య అప్రమత్తుడే | సాయిలీలామృతము |
( అష్టమిపుట్టిన కృష్ణునకు ఎనిమిదిమంది రాణులతో నిత్యభోగవిలాసములు. అష్టదిక్పాలకులు సాయిమహరాజ్ దర్బారులో హాజరు. )
వనమాలికి వందనాలు శిఖిపించికి చందనాలు
గురుసాయికి ప్రణామాలు సుఖసంపద లీనాడు
ద్వారకమయుని కివే హృదయకుసుమ పరిమళాలు
కృష్ణలీల సాయిహేల శ్యాము బ్రోవ యెల్లవేళ | సాయిలీలామృతము |
( వనమాలి శ్రీకృష్ణ పరమాత్మకు శతకోటివందనాలు, గురుసాయిసమర్ధులకు సహస్రకోటి ప్రణామాలు.)
మంగళమిదె ముకుందునకు దేవ దేవ వందితునకు
మంగళమిదె దేవకీ నందగోవిందునకు
మంగళమిదె గురుసాయి ద్వారకామాయునకు
మంగళమిదె బహురూప దత్తదేవ రూపునకు | సాయిలీలామృతము |
( శ్రీకృష్ణ పరమాత్మకు మంగళములు, సమర్ధగురు సాయిదేవునకు మంగళ శుభమంగళములు! )
(శ్రీసాయిలీల భాగవతమును భక్తి శ్రద్దల పఠించు భక్తకోటికి శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీసాయినాథులు
శ్రీకృష్ణలీలలు మధురం, సాయిలీలలు అతిమధురం వారి లీలల పోలిక మధురాతిమధురం!
ReplyDelete