దేహ ఆరోగ్యానికి, పోషణకు, ఎదుగుదలకు ఆహారపువిలువలతోకూడిన పౌష్టిక ఆహారము మిక్కిలి ఆవశ్యకము. అలాగే తిన్నటువంటి ఆ ఆహారమును బాగుగా జీర్ణించుకొనవలెను, లేనియెడల అజీర్ణవ్యాధిచే ఆరోగ్యసమస్యలు తలెత్తవచ్చును. ఇదేవిధంగా పుస్తక లేక గ్రంథపఠనముకూడ. చదివిన మంచి విషయముల భావమునెఱిగి తదనుగుణంగా ఆచరించినయెడల ప్రయోజనముంటుందికాని, కేవలం అర్ధం తెలియని పఠనం వ్యర్థం, పైపెచ్చు యెంతో తెలుసుననెడి గర్వం తలెత్తే ప్రమాదముంది. సరిగ్గా దీనిని పోలిన ఓ సంఘటన శ్రీసాయి సచ్చరిత్రములో చూడగలము. దాసగణు మహరాజు, గొప్పసాయి భక్తుడు, కీర్తనకారుడు. ఓ పర్యాయం యితడు సంస్కృత భాషలోని ఈశావాస ఉపనిషతును మరాఠీభాషలోని ఓవీ ఛందస్సులోనికి అనువదించాడు. (గ్రంధంలో ఆత్మ తత్వముగూర్చి వివరింపబడినది.) కాని ఆ ఉపనిషత్తులో చెప్పబడిన విషయ సారాంశము వానికి సరిగా బోధపడలేదు, పండితులతో చర్చించినప్పటికి సరియైన సమాధానం లభింపకపోవుటచే ఆత్మసాక్షాత్కారము పొందిన సద్గుఫు సాయినాథుని దర్శించి తన సమస్యను వివరించి వివరణకై వేడుకొన్నాడు. బాబా వాని నాశీర్వదించి యిట్లన్నారు, " తొందరపడవద్దు, ఆ విషయంలో ఎట్టి కష్టంలేదు తిరుగు ప్రయాణంలో విలే పార్లేలోని కాకాసాహెబు దీక్షితుని పనిపిల్ల నీ సందేహమును తీర్చును." అక్కడున్నవారు బాబా తమాషా చేస్తున్నారనుకొన్నారు. భాషాజ్ఞానంలేని పనిపిల్లకేమి తెలియునని సందేహించారు. కాని బాబాను పూర్తిగా నమ్మిన దాసగణు అలా తలువక విలేపార్లే లోని దీక్షితు ఇంటికి వెళ్ళాడు. మరునాటి ఉదయం దాసగణు నిదురలేవగనే ఒక పేదపిల్ల చక్కనిపాటను మిగుల సంతోషంతో పాడుతోంది. ఆ పాటలోని విషయం ఎర్రచీర యొక్క చక్కటి వర్ణనము. ఆ పాట నచ్చుటచే దాసగణు బయటకు వచ్చివిన్నాడు. ఆ చిన్నపిల్ల కాకా పనిమనిషి నామ్యా యనువాని చెల్లెలు. మిగుల పేదరికంలోని ఆమె చిరుగులు గుడ్డలతో పాత్రలు తోముతోంది. ఆమె ఆనందానికి పేదరికం అడ్డురాలేదు. దాసగణు ఆమెపై మిగుల జాలిపడి మరుసటి రోజున మరొక సాయి భక్తుడు రావు బహదూర్ ప్రధాన్ చే ఓ చక్కటి చిన్న చీరను బహూకరింపజేశాడు. పనిపిల్ల మిగుల సంబరపడి మరునాడు ఆకొత్త చీరధరించి పనిచేయుటకొచ్చినది. మిగుల సంతోషంతో తోటిపిల్లలతో ఆడిపాడి, ఆటలనెగ్గింది. ఆమరుసటిరోజున కొత్తచీర దాచి, పాతచిరుగు బట్టలతో పనిలోనికొచ్చినది. ఆరోజుకూడ ఆమె మునుపటి సంతోషంతోనే తన పనులజేసింది, చిరుగులగూర్చి ఏమాత్రం చింతలేదు. ఇపుడు పనిపిల్ల నాలుగు రోజులలో చెప్పక చెప్పిన పాఠం ఏమిటో మరొక్కసారి పరిశీలించుదాము. దాసగణు మొదటిరోజున చూసిన పేద సేవిక బాలిక ఓ ఎర్రచీరఅందాన్ని వర్ణిస్తూ ఆడుతూ పడుతూ పనిచేసుకొంటుంది, ఒంటిమీద సరైన బట్టలుకూడ లేవు. రెండవరోజు అలాంటి సంతోషంతో పనిలోనికొచ్చినది, దాసగణు చెప్పుటచే ప్రధాను యను భక్తునినుండి ఓ కొత్త చిన్నచీరను బహుమతిగా పొందినది. మూడవరోజున ఆ కొత్తచీర ధరించి అదే సంతోషంతో తోటివారలతో ఆడుతూపాడుతూ వారల గెలిచినది. నాలుగవ రోజున కొత్తచీర పెట్టెలోదాచుకొని మాములుగా పాత చిరుగు బట్టలతోనె పనిలోనికొచ్చినది. కాని ఆరోజుకూడ ఆమె అదే పూర్వపు సంతోషాన్నే చూపిందికాని, చిరుగులు ధరించినందులకు ఎలాంటి విచారాన్ని ప్రదర్శింపలేదు. ఈనాలుగురోజుల కథకు నిజ జీవితానికి చాల దగ్గర సంబంధముంది. నరునికి నాలుగు దశలంటారుగదా మనపెద్దలు. అలాగే కలిమిలేములు కష్టసుఖాలు జీవితచక్రంలోని భాగాలనికూడ పెద్దలు చెబుతారు. బాహ్యపరిస్థుతులకు అతీతంగా అన్ని వేళల సంతోషంతో మనం మనపనులను నిర్వహించాలి. ఇదే ఉపనిషదు ప్రస్తుత సందేశం. ప్రతి వ్యక్తి ఆంతరంగిక సంతోషాన్ని బాహ్యపరిస్థితులు ప్రభావితం జేయకుండా సదా వివేకంతో వ్యవహరించాలి. ప్రస్తుత ఆందోళన ప్రపంచంలో ఈ ఉపనిషదు సందేశమెంతో ఊరట కలిగిస్తుంది.
పనిపిల్ల స్వభావం గ్రహించిన దాసగణుకు ఓ విషయం బోధపడింది. మన కష్టసుఖాలు మనోవైఖరిపై ఆధారపడియుంటాయని గ్రహించాడు. భగవంతుడు మన రక్షకుడు, అవసరముల తప్పక సమకూర్చుతాడు. మనకు సమకూరినదానితో సంతోషంగా జీవించాలేగాని, దుఃఖిపరాదు, ఆందోళనలకు తావులేదు; ఈ విషయాలన్నీ వానిమదిలో మెదిలాయి. ఎంత చక్కటిది సాయి బోధ, బోధించిన మార్గం మన ఊహ కందనిది. ఉపనిషదులు భగవద్గీతాది గ్రంధములలో చెప్పబడిన అమూల్యవిషయములను సద్గురుకృపతో గ్రహించి ఆచరించి ప్రయోజనంపొందటం అత్యంత ప్రయోజనకరం. కేవలపుస్తకపఠనం అరుగని ఆహారం.
Sai’s Teaching – The Message of the Īśa Upaniṣad
Śrī Sāyināthāya Namaḥ
Good nourishment is essential for the body—food that strengthens, sustains, and helps us grow. Yet, merely eating rich food is not enough; it must be digested properly. If digestion fails, illness arises.
Exactly the same is true of reading sacred texts.
When we read great scriptures, we must absorb their meaning, digest their essence, and live according to their teaching. Otherwise, mere reading becomes empty, and worse still, it may lead to pride—“I know so much!”
True understanding is not in the tongue or in the book, but in the heart that lives the wisdom.
A beautiful incident from Shri Sai Satcharitra illustrates this timeless truth.
⸻
Dāsagaṇu’s Quest for Understanding
Dāsagaṇu Maharaj—devotee, kirtankar, poet—had translated the Īśāvāsya Upaniṣad from Sanskrit into Marathi in ovī metre. The Upaniṣad expounds the nature of the Self, subtle and profound.
Yet, after translating it, Dāsagaṇu felt he had not truly grasped the inner meaning. Even learned scholars could not resolve his doubts.
Finally, he came to Shirdi, bowed at the feet of the realized Master, Sai Baba, and sought clarification.
Baba listened with compassion, blessed him, and said gently:
“Do not worry. There is no difficulty in this.
On your return journey, the maidservant at Kakasaheb Dixit’s house in Ville Parle will clear all your doubts.”
All who heard this were surprised. What could an uneducated maid know of Upaniṣadic wisdom?
But Dāsagaṇu, filled with unshakable faith in Sai, accepted Baba’s words without question and travelled to Ville Parle.
⸻
The Four Days and Four Lessons
Next morning, as Dāsagaṇu woke, he heard a young girl singing joyfully. Her song vividly described the beauty of a bright red sari.
He came out to see. She was a poor girl—Namya’s sister, the maid at Dixit’s home—wearing torn, patched clothes yet glowing with happiness.
Deeply moved, Dāsagaṇu arranged, through Rao Bahadur Pradhan, to gift her a new sari.
Day 1:
The little girl works cheerfully in ragged clothes, singing blissfully of the lovely red sari.
Day 2:
She arrives for work with the same joy.
Dāsagaṇu is touched and arranges a sari for her.
Day 3:
She comes wearing the new sari, radiant with delight, playing and laughing with the other children.
Day 4:
She comes once again in her old torn clothes.
The new sari is safely kept away.
Yet—her happiness is absolutely the same as before.
No trace of shame, sorrow, or complaint.
Her joy was not born of possessions.
Her joy flowed from within.
⸻
The Revealed Teaching
Watching her over these four days, Dāsagaṇu suddenly understood Baba’s message.
Life has its own four stages.
Fortune and hardship come and go.
Outer circumstances rise and fall like waves.
But the wise one remains inwardly steady, inwardly joyful.
True happiness does not depend on what we have or lack.
It springs from a mind at peace, a heart anchored in God.
The maid’s innocence taught the essence of the Upaniṣad:
Never let external situations disturb the inner bliss.
Perform your duties with serenity and contentment.
Live with what God provides.
Trust that He protects and sustains us always.
In today’s world, filled with anxiety and restlessness, this message brings profound solace.
⸻
Dāsagaṇu’s Realization
Dāsagaṇu realized that sorrow and joy arise not from the world but from the mind.
When trust in God deepens, worries melt away.
What a beautiful way Sai taught!
A Master whose methods are beyond imagination,
whose compassion touches the simplest lives
and transforms the deepest hearts.
The Upaniṣads, the Gita, and all sacred scriptures reveal their true essence only through the grace of the Sadguru.
Book-learning alone—like undigested food—cannot nourish the soul.
May the rays of Sai’s compassion shine upon all.
May all be blessed, peaceful, and uplifted.
Om Sai, Sri Sai, Jaya Jaya Sai!
నిజ జీవితంలో సహాయపడు చక్కటి సందేశం, ఆలోచనకు ఆచరణకు మిగుల ప్రయోజనకారి !
ReplyDelete