సాయిమహిమ - జాంనేరులీలా విశ్లేషణ !
శ్రీసాయినాథాయనమః!
" ఎవరైతే నా లీలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును." శ్రీసాయిబాబ. దీనినిబట్టి సాయి తమ లీలాశ్రవణమునకెంత ప్రాధాన్యమిచ్చారో ఊహింపగలము. సాయిబాబాపై భక్తిపెరుగుటకు వారి లీలాస్మరణము ఓ చక్కనైన మార్గము. ప్రస్తుతము అతిప్రాచుర్యం పొందిన సాయి లీలనొక్కటిని క్లుప్తముగా గుర్తుకు తెచ్చికొనెదము. నానాసాహెబు చాందోర్కర్ సాయికి గొప్పభక్తుడు, సాయిమహిమలను దూరదూర ప్రాంతాలకు వ్యాపింపజేయడంలో ప్రముఖ పాత్రవహించిన ఘనుడు. ఈ సంఘటన 1904-1905 ప్రాంతంలో జరిగినది, ఆసమయాన చాందోర్కర్ శిరిడీకి బహుదూరమైన జలగాం కి సమీప జాంనేరు నందు మామల్తదార్ (deputy collector) గా పనిజేస్తున్నాడు. వానికుమార్తె మైనతాయి నిండుగర్భిణి 2,3 దినములుగా మిగుల ప్రసవవేదననుభవించు చుండెను. నానా సాహెబ్ మందులనెన్నింటినో వాడినను ప్రయోజనం కలుగకుండెన, ు యింట్లో బాబావిభూతి లేకుండెను. అట్టి నిస్సహాయ స్థితిలో ఆతడు బాబాను జ్ఞప్తికి తెచ్చుకొని సాయంకోసమై దీనంగా ప్రార్ధించాడు. సాయి సర్వాంతర్యామి సర్వహృదయనివాసి కరుణామయుడు, నానా ప్రార్ధన బాబా దయాహృదయాన్ని తాకింది. సాయి కుశలకర్ముడు, వారిని నమ్మినవారి పనులు విచిత్రంగా సమకూరుతాయి. అదే సాయిఘనత. నానా ప్రార్థిస్తున్న సమయాన శిరిడీలోని ద్వారకామాయిలో ఏంజరుగుతుందో తెలిసికొనెదము. బాబాచే బాపుగీర్ బువాగా పిలువబడే రామ్ గీర్ బువా ఖాందేష్ ప్రాంతంలోని తనగ్రామానికి వెళ్ళుటకు సిద్ధమౌతున్నాడు. బాబా వానిని పిలచి జలగాం మీదుగా జాంనేరు వెళ్లి నానాకు విభూతి మరియు ఆరతి అందివ్వమన్నారు. కాని జలగామ్ వరకు మాత్రమే వెళ్ళగలనని, ఆపై జాంనేరు వెళ్ళుటకు డబ్బులు లేవనే సందేహం వెలిబుచ్చాడు బువా. కాని సర్వం సమకూరగలవని చెప్పుటచే బాబాపై విశ్వాసంతో ప్రయాణానికి సిద్ధమయ్యాడు. సమీపానున్న సన్నిహితభక్తుడు శ్యామా బాబాఆజ్ఞపై విభూతిమరియు మాధవ్ అడ్కర్ రచించిన ఆరతిసాయిబాబా పాటను వానికందించాడు. ఇచట సాయి విభూతి మరియు ఆరతికి యెంతటి ప్రాముఖ్యతనిచ్చారో గ్రహింపగలము. రాం గీర్ బువా బాబావద్ద శెలవుపొంది బయలుదేరి రాత్రి రెండుగంటల సమయానికి జలగాం జేరాడు. అచటినుండి 30 మైళ్ళదూరం ప్రయాణంజేసి జాంనేరు చేరుటకు తనవద్ద కేవలం రెండు అణాల పైకముండుటచే మిగుల వ్యాకులపడుతున్నాడు. సాయిసహాయం భక్తులకు వివిధ వింతమార్గాల్లో లభిస్తుందనేది పెక్కు భక్తుల అనుభవం. అదేసమయంలో ఆతనికి " బాపూగీర్ " అనే కేకవినిపించుటచే ఆ పిలుపు వైపుకెళ్లాడు బువా. ఇచట రాంగీర్ ను బాపూగీర్ గ పిలవటం పాఠకులు తెలియగలరు. ఓ బంట్రోతు తాను నానాసాహెబ్ పంపగా వచ్చితినని బలికి బువాను ఓచక్కని రెండుగుఱ్ఱాల టాంగా వద్దకు నడిపించాడు. జాంనేరు వైపుకు ప్రయాణం సాగింది. తెల్లవారుజామున టాంగా ఓసెలయేటి యొద్దకు జేరుకొంది. బండివాడు గుఱ్ఱముల నీళ్లు త్రావించుటకు పోవుసమయాన బంట్రోతు బువాకు ఫలహారం పెట్టాడు. బంట్రోతును మహమ్మదీయునిగా దలచి సందేహిస్తున్న బాపూగీర్ కు తాను క్షత్రియుడనని, ఫలహారం నానా పంపాడని చెప్పుటచే ఇరువురూ ఫలహారం జేసి ముందుకు సాగి ఉషోదయ సమయానికి జాంనేరు జేరారు. ఒంటికి పోసుకొనుటకై వెళ్లిన బువా రెండుమూడు నిమిషాల్లో తిరిగివచ్చునప్పకి మిగుల ఆశ్చర్య కరంగా బంట్రోతు బండి, తోలువాడు అచటలేకుండిరి; బువాకు నోటమాటరాకుండెను. సమీప కచేరినుండి వివరాలు తెలిసికొన్న బూవా నానాసాహెబు యింటికెళ్ళి తాను శిరిడీ బాబావద్దనుండి వచ్చినటుల బలికి ు దెచ్చిన విభూతి, అరతుల నానాకందించాడు. అతి క్లిష్ట పరిస్థితిలోనున్న మైనతాయిచే విభూతి కలిపిన నీళ్లు త్రాగిచ్చి ఆరతి పాడారు. కొద్దినిమిషాల్లో ప్రసవం సుఖంగా జరిగిన వార్తవచ్చినది. టాంగా మరియు ఫలహారములు పంపినందులకు నానాకు కృతజ్ఞతలు తెలిపాడు బూవా. తానెలాంటి బండిని ఫలహారాలను ంు పంపలేదని, శిరిడీనుండి వచ్చువిషయంకూడా ుతెలియదని పలుకుటచే అందరూ ఈ విచిత్ర సంఘటనను సాయిలీలగా దలచి మిగుల అబ్బురపడ్డారు. ఈ అద్భుతమైన సాయిలీలలో ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలను మనం గమనింపగలము. ముందుగా సమయపాలన. రామ్ గీర్ జలగాం జేరిన కచ్చిత సమయానికి బండివాని సాయం లభించింది. భక్తులకు సాయి సాయం సమయానికందుతుందనే విషయమిచట ధ్రువపడినది. తెల్లవారుసరికి జాం నేరు ప్రయాణం సుఖంగా జరిగినది. సాయి దీవెనల ప్రయాణాలు సుఖంగా జరుగగలవనే సత్యమిచట తెలియగలదు. సాయి తమభక్తుల పస్తుండ నీయడు, ప్రయాణంజేసి అలసిన రామ్ గీరుకు చక్కని ఫలహారం అందినది. సరియైన సమయానికి విభూతి మరియు ఆరతు లందుటచే మైనతాయికి సుఖప్రసవం జరిగినది. బంట్రోతుగా, బండివానిగా, గుఱ్ఱాలుగా, బండిగా మారి సమయానికి సాయమందించిన సాయి అద్భుతలీలనెలా పొగడగలము? కేవలం మౌనంగా వారిని స్మరించి సర్వస్య శరణాగతి కోరడంతప్ప! తుదిగా మరొక్క గమనించదగిన విషయమేమన సాయిలీలలు మనతర్కానికంత సులువుగా చిక్కవు. దాసగణుమహరాజు తాను స్వయంగా వ్రాసిన ఈశోపనిషత్తు వ్యాఖ్యానానికి తనకే సరైన అర్ధము తెలియనపుడు వీలేపార్లేలోని దీక్షితు పనిపిల్లద్వారా చక్కటి సమాధానాన్ని తెలియపరిచారుగాని, సాయితనకుతానుగా ఆవిషయాన్ని వివరించలేదు. అలాగే కేవల తమ సంకల్పమాత్రాన బహదూరానున్న ు మైనాతాయి ప్రసవవేదన మాన్పగలిగినప్పటికీ బాపుగిరీ బువాద్వారా విభూతి ఆరతులపంపి ఓ పెద్దనాటకాన్ని నడిపారు నాటకసూత్రధారి సాయినాథులు. సమర్ధసద్గురు సాయిదేవులు సమస్తమానవాళిని ముఖ్యంగా దారుణపరిస్తుతులెదుర్కొంటున్న భారతీయదేశవాసులను రక్షించుటకై శతకోటివందనముల వేడుకొనెదము, సచ్చిదానంద సమర్ధసద్గురు శ్రీసాయినాథ్ మహరాజుకు ుజేజేలు పలికెదము ! శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికీ శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!
శ్రీసాయిబాబా నిత్యసత్యులు పిలిచినపలికే దైవం, సాయి రక్ష శ్రీరామ రక్ష. సదా సర్వులకు లభించుటకై ప్రార్ధించెదముగాక !
ReplyDelete