గురుపూర్ణిమ.

శ్రీసాయినాథాయనమః
నేడు పవిత్ర గురుపూర్ణిమ. గురుపూర్ణిమ పరిపూర్ణ సద్గురుతత్వానికి, జ్ఞానానికి సంకేతమని విజ్ఞులు చెబుతారు. విష్ణుభగవానుని అంశగా జన్మించిన వేదవ్యాసమహర్షి ఇదేసుదినమున ఆవిర్భవించుటచే ఈరోజు వ్యాసపూర్ణిమగా ప్రాచుర్యము పొందినది. గౌతమబుద్ధుడు పూర్ణిమరోజునే జన్మించాడు, పూర్ణిమరోజునే నిర్వాణము లేక ఆత్మసాక్షాత్కారం పొందాడు మరల పూర్ణిమరోజునే నిర్యాణం చెందాడు. పవిత్రసిక్కుమత స్థాపకుడు గురునానక్ పూర్ణిమదినముననే అవతరించాడు. ఈవిధంగా పూర్ణిమ వ్యక్తియొక్క ఆధ్యాత్మిక జీవనంలో ప్రముఖ సంకేతస్థానాన్ని సంతరించుకొంది. సమర్ధసద్గురు శ్రీసాయినాథులు స్వయంగా భక్తులకు చేసుకోమని చెప్పినది గురుపూర్ణిమ పండుగను మాత్రమే! ప్రస్తుతవ్యాసంలో శిరిడీలో జరుగుగురుపూర్ణిమ యెలా ఆరంభమైనదో తెలుపు వివరాలను పరిశీలించెదము. పూజ్య ఆచార్యభారద్వాజ మాస్టరుగారు రచించిన శ్రీసాయిలీలామృతమునుండి ప్రస్తుత విషయములను గ్రహించడమైనది. " ఓరోజు 1908వ సంవత్సరములో, పండరినుండి వచ్చిన కృష్ణాజీ నూల్కర్ చావడిలో వున్నాడు. బాబా శ్యామాతో " ఆముసలయ్య (నూల్కర్) ను ధునివద్ద స్తంభాన్ని పూజించుకొమ్మని చెప్పు " అని అతడు చెప్పిరాగానే, " మీరంతా గూడా చేసుకోరాదా!" అన్నారు సాయి. " దేవా మీకైతే చేస్తాముగాని స్థంభాన్నేల పూజిస్తాము? " అన్నాడు శ్యామా. మొదట అంగీకరించని బాబా అతడు పట్టుబట్టినమీదట ఒప్పుకొన్నారు. ఇంతలో నూల్కర్ పంచాంగం చూస్తే , నాడు వ్యాస(గురు) పూర్ణిమ. తాత్యా, దాదాకేల్కర్, శ్యామా మున్నగువారు సాయికి ధోవతులిచ్చి పూజించారు. అప్పటినుండి శిరిడీలో గురుపూర్ణిమ చేసుకోవడం ఆచారమయ్యింది. ఐతే సాయి స్థంభాన్నెందుకు పూజింపమన్నారు? భక్తుల శ్రేయస్సు కోరిమాత్రమే, ' గురువుని సేవించు 'అన్న భావానికి సంకేతంగా సాయి చెప్పారు. గురువెన్నడూ ' నన్నుపూజించు ' అనడు. జ్ఞానిదృష్టిలో అందరూ పరమాత్మ రూపాలే. వారికి శిష్యులెలావుంటారు? తాను గురువునని తలచేవాడు ఆ పేరుకే తగడన్నారు రమణమహర్షి. అలా అనలేదుగనుకనే సాయి సద్గురుడు. ఇంటికప్పును మోసే ఆధారం స్తంభము. అదినేలలో దృఢంగా నాటుకొని వుంటుంది. అదే దానిబలము. ఆబలంతోనే అది ఆ భవనాన్ని ఆశ్రయించేవారినందరినీ రక్షిస్తుంది. అలానే సద్గురువు సర్వానికి ఆధారమైన ఆత్మనిష్ఠలో, గురుభక్తిలో నాటుకొని వుంటారు. అంటే గురుభక్తిరూపమైన ఆత్మనిష్ఠవలన గురువుగూడ తమను ఆశ్రయయించినవారిని రక్షిస్తారు, స్తంభంలాగే! గురురూపాన్ని తగురీతిన కొలవమని సాయి భావం.... " శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికీ శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి!
పున్నమిరోజు. సాయి సాయి పరమాత్మను చూసినరోజు సాయి షిర్థి బృందావని నడచిన రోజు పున్నమి రోజు.... జనమ ధన్యపు రోజు నింబవృక్ష మూలంబును చుట్టిన రోజు సద్గురుని పాదుకలను పట్టిన రోజు వెన్నెల రోజు .... మనసు పొంగిన రోజు ||సాయి|| ద్వారకమయి ద్వారంబును చేరినరోజు ధుని ఊదీని భక్తితోడ దాల్చినరోజు మల్లెలరోజు.... సాయి మహిమల రోజు ||సాయి|| మురళీధర మందిరమున మొక్కిన రోజు సాయిదేవ సమాధి తల తాకిన రోజు చల్లని రోజు.... సమాధాన మందిన రోజు ||సాయి|| తన్మయమున తనువు పులకరించిన రోజు చిన్మయునితో కన్ను చెమ్మగిల్లిన రోజు బంగరు రోజు.... బాబ లంగరు రోజు ||సాయి|| గులాబినై బాబ పాద మందిన రోజు గులామునై సలామునే చేసిన రోజు పన్నీ.. రుగ, కన్నీ..టిని చిలికిన రోజు తపనల రోజు.... సాయి తలపుల రోజు

Comments

  1. " The yogi who has attained the state which is beyond everything and remains always cool as the full moon is truly the Supreme Lord or Sad Guru." Yoga vasishta sara; 3:3

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)