జ్ఞానదివ్వెలు.
శ్రీసాయినాథాయనమః!
పాఠక భక్తులెల్లరకు దీపావళి శుభాకాంక్షలు! శ్రీసాయిజీవితచరిత్ర చదివిన భక్తులెల్లరకు ఓ సాయిలీల తప్పక గుర్తుంటుంది. అదేమన శిరిడీలో వర్తకులు సామూహికంగా నిర్ణయించుకొని బాబాకు నూనెనివ్వనివేళ సాయి నిరాశ చెందక ద్వారకామాయికి తిరిగివచ్చి ప్రమిదలను నీటితోనింపి దీపాలవెలిగించారు. రాత్రంతా దివ్వెలు ప్రకాశవంతంగా వెలుగుల నింపాయి. చాటున దాగియున్న వణిజులు తమతప్పుతెలిసికొని బాబాను క్షమార్పణ నర్ధించారు. వారితో సత్యాన్ని నమ్ముకొమ్మని చెప్పి క్షమించారసాయి. ఆధ్యాత్మిక పరంగాజూచినా సాయి అవతరించినదందులకే. అజ్ఞానపు చీకటిలో మగ్గుతున్న మానవాళికి తనబోధయనెడి జ్ఞానంతో సరైన మార్గం జూపారు.ఈ దీపావళి పర్వదిన సందర్భమున మన మనోదేహము లనెడి ప్రమిదెలలో సాయిపట్ల పరిపూర్ణవిశ్వాసమనెడి నూనెనింపి, భక్తిశ్రద్ధ వత్తులువేసెదముగాక. సాయి కరుణయే దివ్వెలవెలిగించు అగ్నిజ్వాల యగుగాక! ఆ దివ్వెల ప్రకాశంలో జీవనచర్యల చక్కదిద్దుకొంటూ సాయిచూపిన మార్గంలో గమ్యాన్నిచేరెదముగాక! శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికి శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి!
May Samartha Sadguru Sainath bless you all on this Happy Diwali day!
ReplyDelete