శ్రీమద్భగవద్గీతాసారము 1 - భగవాన్ శ్రీరమణమహర్షి.
శ్రీసాయినాథాయనమః, శ్రీరమణాయనమః.
భగవాన్ ఓ పర్యాయం తమను దర్శించవచ్చిన పండితునికి భగవద్గీతా ఘనతనుగూర్చి వివరిస్తున్నారు. ఆ సమయంలో వారికి సమీపమునున్న భక్తుడొకరు 700 శ్లోకములతో కూడిన గీతను గ్రహించుట బహుజటిలమనియు ఒక్కశ్లోకములో గీతాసారమును తెలుపవలసినదిగా విన్నవించుకున్నాడు. అందులకు సమాధానంగా భగవాన్, గీత 10వ అధ్యాయంలోని 20వ శ్లోకాన్ని వివరించారు. " ఓ అర్జునా! నేను సకలభూతములయొక్క హృదయ కమలమందుండు ప్రత్యగాత్మ(Self)ను, సమస్తభూతములయొక్క ఆది మధ్యాంతములును నేనే".పిమ్మట వారు దిగువ వివరించిన 42 శ్లోకముల నెన్నుకొన్నారు. వేరు వేరు అధ్యాయములలోని శ్లోకములను భగవాన్ భక్తులకుపయోగముకొరకు ఓ ప్రత్యేక క్రమములో కూర్చారు. (పైన పేర్కొనబడిన శ్లోకము వరుసలో 4వదిగా చెప్పడమైనది).
1) సంజయుడు చెప్పాడు: మధుసూదనుడు, అట్లు కనికరముతో కూడుకొన్నవాడును, కన్నీటితో నిండుకొని కలతబారిన నేత్రములు గలవాడును, దుఃఖపడుచున్న వాడును నగు అర్జునినికిటుల జెప్పెను.(2:1, రెండవ అధ్యాయము :1వ శ్లోకము). 2) శ్రీ భగవంతుడు చెప్పెను. కుంతీపుత్రుడవగు ఓ అర్జునా ! ఈ దేహము క్షేత్రమని చెప్పబడుచున్నది. దీనినెవడు తెలియుచున్నాడో,వానిని క్షేత్రజ్ఞుడని, క్షేత్ర క్షేత్రజ్ఞుల తత్త్వము నెరింగినవారు చెప్పుదురు.(13:2). 3)బ్రహ్మాది స్తంబ పర్యంతముగల సకలోపాదులయందు నుపాధి భేదముచే వేరుగా నున్నను,పరమార్ధజ్ఞానముచేత నొక్కటేయగు ఆత్మయే నేనని తెలిసికొనుము. ఇట్టి క్షేత్రక్షేత్రజ్ఞులను తెలిసికొనెడి జ్ఞానమేదికలదో, అదియే నిజమైన జ్ఞానమని నామతము.(13:3). 4) ఓ అర్జునా! నేను సకలభూతములయొక్క హృదయ కమలమందుండు ప్రత్యగాత్మ(Self)ను, సమస్తభూతములయొక్క ఆది మధ్యాంతములును నేనే.(10:20). 5)పుట్టినవానికి చావును,చచ్చినవానికి పుట్టుకయును నిశ్చయమై యున్నది. కావున అనివార్యముగా కలుగుచున్న జనన మరణముల విషయమై నీవు దుఃఖించుట యుక్తము గాదు.(2:27). 6)ఈ ఆత్మ యెప్పటికిని పుట్టునది కాని,మరణము బొందునది కాని కాదు. మరియు కొంతకాలముండి పిమ్మట లేకపోవునది కాని, కొంతకాలము లేకుండ పిమ్మట నుండునది కాని కాదు. కావున నీ ఆత్మ పుట్టుక లేని దనియు, నాశము లేనిదనియు, సర్వకాలములయందును ఒకేవిధముగా నుండునదనియు,అనాదియైన దనియును తెలిసికొనుము, కావుననే శరీరము మారిపోవు చున్నప్పటికిని ఈ ఆత్మ మారిపోవునది కాదు.(2:20). 7)ఈ ఆత్మ శస్త్రాదులచే ఛేదింపదగినది కాని,అగ్నిచే దహింప దగినది కాని,నీటిచే నాన్చదగినది కాని,గాలిచే శుష్కిమ్ప దగినది కాని కానేరదు. ఇయ్యది నిత్యము,సర్వవ్యాపకము,నిశ్చలము,నిర్వికారము,సనాతనమునై యున్నది.(2:24). 8)ఆత్మ యింద్రియములచే తెలియ శక్యము కానిదనియు, వికారము లేనిదనియు, మనస్సునకుగూడ గోచరము కానిదనియును చెప్పబడుచున్నది. అందువలన ఈ ప్రకారముగా ఆత్మ మనోబుద్ధీన్ద్రియములకు గోచరము కానిదనియు, నిర్వికారమైనదనియు, నిత్యమైనదనియును తెలిసికొని దుఃఖిప దగవు.(2:25) 9)లేని పదార్థము లేనేలేనిదనియు, ఉండేపదార్థమునకు లేకపోవుట యనునది లేనిదనియు అనగా అసత్పదార్థమునకు ఉనికి లేదనియు, సత్పదార్థమునకు అభావము అసంభవమనియు తత్వజ్ఞానులగువారీ రెంటియొక్క నిశ్చయమును, చివరి నిష్కర్షను తెలిసికొనియున్నారు. (2:16). సద్గురుదేవుల కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికి శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి! (To be continued.) Ref:The complete works of Sri Ramana Mharshi. Sreemad Bhagavad Geeta by Maharshi Sadguru Sree Malayalaswami.
Summary of Sreemad Bhagavad Geetha 1/7 : Bhagavan Ramana Maharshi selected these following 42 verses (total of 700), as essence of Geeta, for an easy understanding of the devotees.
1) Sanjaya said: To him who was thus overcome with pity and despondency, with eyes full of tears and agitated, Madhusudhana spoke these words.(2:1). 2) The blessed Lord said: This body o Arjuna, is called the Field and he who knows it is called Knower (Kshetrajna) by the sages.(13:2). 3) Know Me as the " Knower-of-the-Field" in all "Fields", O Bharata; Knowledge of the "Field" as also the "Knower-of-the-Field" is considered by Me as True Knowledge.(13:3). 4) I am the Self, O Gudakes, seated in the hearts of all beings; I am the beginning, the middle, and also the end of all beings.(10:20). 5) Indeed certain is death for the born, and certain is birth for the dead; therefore, over the inevitable, you should not grieve.(2:27). 6) He is not born, nor does He ever die; after having been, He again ceases not to be; Unborn,Eternal,Changeless and Ancient, He is not killed when the body is killed.(2:20). 7) This Self cannot be cut, nor burnt, nor moistened, nor dried up. It is eternal, all pervading, stable, immovable and ancient.(2:24). 8) This(Self) is said to be Unmanifest, Unthinkable, and Unchangeable. Therefore, knowing This to be such, you should not grieve.(2:25). 9) The unreal has no being; there is no non-being of the Real; the truth about both these has been seen by the Knower of the Truth.(2:16). (To be continued).
Ref: " The Holy Geeta " commentary by Swami Chinmayananda.
Everybody should go through Bhagavathgeetha particularly for youth. The above matter is very lucid and simple for all.
ReplyDeleteజాగర్తగ పరిశీలిస్తే ఓ సత్యం బోధపడగలదు, అదేమన భగవద్గీతాసారము మరియు రమణమహర్షుల ఆధ్యాత్మిక అనుభవసారమునకు తేడాలేదనెడి విషయము. .
ReplyDeleteA careful study of Geethasaramu and Divine Life experience of Sree Ramana Maharshi reveals the truth of their striking identity.