అమ్మల మిన్న యమ్మ సాయి మాయమ్మ !
శ్రీసాయినాథాయనమః! నేడు అంతర్జాతీయ మాతృదినోత్సవము (Mothers Day). " Mothers were created by God to show us that He loves us with or without cause. " Paramahansa Yogananda. అంతర్జాతీయ మాతృదినోత్సవ వేడుక సందర్భమున మాతృమూర్తులెల్లరకు శతాధిక వందనములు. తల్లి ప్రేమ తల్లికే తెలుస్తుంది, ఆ ప్రేమ ఉహకందదు, వర్ణలకు చిక్కదు. కాని అట్టి ప్రేమను గూడ మించునట సద్గురువు ు తన భక్తులపై జూపెడు ప్రేమ. తల్లిప్రేమను వేయి రేట్లు మించునని స్వామి సమర్ధ అక్కల్కోట్ మహారాజ్ వచించారు. సాయిప్రేమ అలాంటిదే! మాతృమూర్తి ప్రేమానురాగాలు కేవలం తన బిడ్డలకే పరిమితమైతే సాయి ప్రేమ శరణాగతి కోరిన సమస్తమానవాళిపైనే గాక , జీవజంతువులపైనా, సమస్త చరాచర జగత్తుపైనా సదా ప్రసరిస్తుంది. నేటి ప్రత్యేక శుభ సమయమున ఎల్లలెరుగని సాయి తల్లిప్రేమనిచట స్మరించుకొనెదము. తమను జూడ వచ్చిన భక్తుడు బాబాసాహెబ్ మిరీకర్ తో సాయి యిలా అన్నారు, " నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి, ఎవరైతే ఆమె ఒడిలో కూర్చొనెదరో వారిని ఆమె కష్టములనుండి యాతురతలనుండి తప్పించును. ఈ మసీదు తల్లి చాల దయార్ద్ర హృదయురాలు. ఆమె నిరాడంబర భక్తులకు తల్లి. వారిని ఆపదల...