శ్రీమద్భగవద్గీతాసారము 4 - భగవాన్ శ్రీరమణమహర్షి.

శ్రీసాయినాథాయనమః, శ్రీరమణాయనమః.
( Continued ) 28) అధికముగా చపలమైనది గనుకనే స్థిరముగానుండని మనస్సు ఏయే విషయములమీదికి బోవుచుండునో. ఆయా విషయములనుండి దానిని మరల్చి తన యాత్మస్వరూపమునందు నిలిచియుండు దానినిగా చేయవలయును. (6 : 26). 29) ఏ పురుషుడు ఇంద్రియములను మనస్సును బుద్ధిని జయించినవాడును, మోక్షమును కోరుచున్నవాడును, మనన శీలులుడును, విషయాపేక్ష భయము క్రోధము యనునవి లేనివాడునై యుండునో, అటువంటివాడు సర్వకాలములయందును మోక్షమును పొందినవాడే యగుచున్నాడు. (5 : 28). 30) యోగముతో గూడుకొనిన మనస్సు గలవాడు సమస్తజంతువులయందు సమభావము గలవాడై, తనను సమస్త భూతముల యందున్న వానినిగాను, సమస్తభూతములు తనయందున్న వానినిగాను చూచుచున్నాడు. (6 : 29). 31) ఏ పరమభక్తులు ఇతర చింతలు లేనివారై, పరమదైవమగు పరమాత్మయగునన్ను ఎల్లప్పుడును ధ్యానించువారై సేవించుచున్నారో, వారియొక్క యోగక్షేమములను నేను వహించుచున్నాను. (9 : 22). 32) సర్వకాలములయందు సమాహిత చిత్తుడును, సర్వేశ్వరుడనైన నాయందే భక్తిగలవాడు నయిన ఆత్మవేత్త (జ్ఞాని ) సర్వశ్రేష్ఠుడగుచున్నాడు. ఏలయన, ఆత్మవేత్త యగు వానికి నేను మిగుల ఇష్టుడను, కనుకనే అట్టి ఆత్మవేత్తగూడ నాకు పరమప్రియుడు. (7 : 17). 33) అనేక జన్మములలో నాచరించిన పుణ్యసంస్కారమువలన నంతఃకరణ పారిశుధ్యమును బడసి కట్టకడపట జ్ఞానము గలవాడై నన్ను పొందుచున్నాడు. సర్వము వాసుదేవస్వరూపమని భావించు అటువంటి మహాత్ముడు లోకములో మిక్కిలి దుర్లభుడు. (7 : 19). 34) ఎవడు దశేన్ద్రియములద్వారా శబ్దాది విషయములు హృదయములో ప్రవేశించినను, ఏ విషయసంకల్పములులేక హృదయము నిర్విషయముగా నుండునో అట్టివాడు అచలుడగు యోగి యగును. అట్టివానికి పరమశాంతి లభించును. (2 : 70). 35) ఎవడు సమస్తములైన కోరికలను విడిచి నిస్పృహుడై, అహంకార మమకారములు లేనివాడై సంచరించుచున్నాడో వాడు పరమశాంతిని సకలదుఃఖ నివృత్తి రూపమైన మోక్షమును ు పొందుచున్నాడు. (2 : 71). 36) ఎవనివలన జనము భయము నొందదో, ఎవడు లోకమువలన భయము నొందడో, ఎవడు సంతోష భయ ద్వేషములచేత కలత నొందని మనస్సు కలవాడో, అట్టివాడు నాకు ప్రియుడు. (12 : 15). సద్గురుదేవుల కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికి శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి! (To be continued.)
Summary of Sreemadbhagavadgeetha 4 : Selected verses by Bhagavan Sree Ramana Maharshi. 28) From whatever cause the restless and the unsteady mind wanders away, from that let him restrain it, and bring it back under the control of the Self alone. (6:26). 29) With senses, mind, and intellect ever controlled, having liberation as his Supreme Goal, free from desire, fear, and anger the sage is liberated forever. (5:28). 30) With the mind harmonized by Yoga he sees the Self abiding in all beings., and all the beings in the Self; he sees the same everywhere. (6:29). 31) To those men who worship Me alone, thinking of no other, to those ever self-controlled, I secure for them that which is not already possessed (Yoga) by them and preserve for them what they already possess (Kshema). (9:22). 32) Of them the wise, ever steadfast, and devoted to the One, excels; for, I am exceedingly dear to the wise, and he is dear to Me. (7:17). 33) At the end of many births the wise man comes to Me, realizing that all this is Vasudeva ( the innermost Self), such a great soul (Mahatma) is very hard to find. (7:19). 34) He attains Peace into whom all desires enter as waters enter the ocean, which, filled from all sides, remains unmoved; but not the " desirer of desires". (2:70). 35) The man attains peace who, abandoning all desires, moves about without longing, without the sense of ' I-ness' and 'my-ness'. (2:71). 36) He by whom the world is not agitated, and who cannot be agitated by the world, who I free from joy, envy, fear, and anxiety--he is dear to Me. (12:15). ( To be continued).

Comments

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

అధ్యాత్మరామాయణము : అహల్యస్థుతి.