శ్రీమద్భగవద్గీతాసారము 5 - భగవాన్ శ్రీరమణమహర్షి.
శ్రీసాయినాథాయనమః, శ్రీరమణాయనమః.
( Continued )
37) మానవమానముల యందును, శత్రుమిత్రుల యందును, సముడై, సకల కామ్యకర్మములను విడిచినవాడును లేక సొంత కార్యముల నన్నిటిని విడిచి పరుల మేలుకొరకు ప్రవర్తించువాడును ఎవడో వాడు ' గుణాతీతుడని ' చెప్పబడుచున్నాడు. (14 : 25). 38) ఏ మనుష్యుడైతే తనలో తానే ఆనందించువాడును, తనలో తానే తృప్తిపొందిన వాడును, తనయందే సంతోషపడుచుండు వాడును అగునో వానికి చేయదగిన కార్యమేదియును లేదు. అట్టి ఆత్మారాముడు కృత కృత్యుడని భావము. (3 : 17). 39) అట్టి ఆత్మానందభరితుడగు బ్రహ్మవేత్తకు ఈ లోకమునందు కర్మను చేయుటచేతగాని, కర్మనుచేయకుండుటచేతగాని యెట్టి ప్రయోజనుమును లేదు. వీనికి ఏ ప్రయోజనుములకొరకుగాని సమస్త భూతములలో నాశ్రయింపదగిన దేదియును లేదు. (3 : 18). 40) అప్రయత్నముగా తనంతట లభించిన ఆహారాదులతో తృప్తిబొందిన వాడును, సుఖదుఃఖములవలన హర్షశోకముల నొందని వాడును, ఇతరులపై మాత్సర్యము లేనివాడును, ప్రాప్తాప్రాప్తముల యందు సమబుద్ధి గలవాడునైన యోగి దేహధారణకు అవసరమైన పనులు మాత్రము చేసినను కర్మబద్ధుడు గాడు. (4 : 22). 41) ఓ యర్జునా! మానవులను కీలుబొమ్మలవలె, సర్వాంతర్యామి యగు పరమేశ్వరుడు సకలప్రాణులయొక్క హృదయములందుండి మాయచేత సకల భూతములను వారి వారి జన్మాంతరకర్మ సంస్కారము ననుసరించి త్రిప్పుచు, ఆయా కర్మములందు ప్రవర్తింపజేయుచున్నాడు. (18 : 61). 42) ఓ అర్జునా! అన్నివిధముల నా సర్వేశ్వరునే రక్షకునిగా వేడుకొనుము. ఆ సర్వేశ్వరుని యనుగ్రహము వలన, సర్వోత్కృష్టమైన పరమశాంతిని, శాశ్వత మగు మోక్షపదవిని పొందగలవు. (18 : 62).
సద్గురుదేవుల కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికి శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి! (Concluded).
Summary of Sreemadbhagavadgeetha 5 : Selected verses by Bhagavan Sree Ramana Maharshi.37) The same in honor and dishonor; the same to friend and foe; abandoning all the undertakings--he is said to have crossed beyond the Gunas. (14:25). 38) The man who rejoices only in the Self, who is satisfied with the Self, who is content in the Self alone, for Him verily there is nothing more to be done. (3:17). 39) For him there is here no interest whatever in what is done, or what is not done; nor does he depend upon any being for any object. (3:18). 40) Content with what comes to him without effort, free from the pairs of opposites and envy, even-minded in success and failure, though acting he is not bound. (4:22). 41) The Lord dwells in the hearts of all beings, O Arjuna, causing all beings, by His illusive power, to revolve, as if mounted on a machine. (18:61). 42) Fly unto Him for refuge with all your being, O Bharata; by His grace, you shall obtain Supreme Peace and the Eternal Abode. (18:62). (Concluded).
Comments
Post a Comment