రక్షకుడు.

శ్రీసాయినాథాయనమః.
Wishing all the fathers a vey happy Father's Day. సాయిబాబా కరుణాసాగరుడు, భక్తవత్సలుడు,ఆపద్బాంధవుడు,అనాదరక్షకుడు. ఆ మహామహితాత్ముని లీలల కొన్నింటినిచట స్మరించెదము. " లేదు,అట్లు జరుగనేరదు. నేనే దాని తండ్రిని. నేనిచటనే యున్నాను. పాముచేత కప్పనెట్లు తినిపించెదను? నేనిక్కడ ఊరకనే యున్నానా ? " ఓ ఆగంతుకునితో బాబా అన్న మాటలివి. కర్మఫలంచే కప్పగాజన్మించి శత్రు పామునోటబడ్డ చెన్నబసప్ప పూర్వజన్మలో తన బద్ధ విరోధియైన వీరభద్రప్ప బారినుండి తప్పించుకొనుటకై బాబాను ఆశ్రయించి వారి ఆశీసుల పొందాడు. మాటనిలుపుకొనుటకై బాబా సమయానికివెళ్ళి కప్పనురక్షించాడు. జన్మజన్మల రక్షణ సాయిదేవునిది. శ్రీమతి సదాశివ్ తార్కాడ్ కళ్ళపోటుతో సాయిని దర్శించింది. ఆయన కొద్దిక్షణాలు ఆమె కళ్ళలోకి చూచారు. అప్పటికప్పుడే ఆమె కళ్ళ పోటు తగ్గిపోయింది. నీరు కారడం ఆగిపోయింది. కాని బాబాకనులవెంట నీరు కారసాగింది. ప్లేగువ్యాధిచే మిగుల బాధపడుచున్న తనకురుమారునికై సాయిని ఆశ్రయించినది శ్రీమతి ఖాపర్డే. క్షణాల్లో నాలుగు పెద్దబొబ్బలను తమదేహంపైకి తీసుకొని ఆమెబిడ్డను రక్షించారు సాయినాథులు. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న ఒక భక్తుడు బాబాకు తన కుమారుని ద్వారా 500 రూపాయల దక్షిణ పంపాడు. బాబా దానిని స్వీకరించగానే ఆ జ్వరం ఆయనకు ఆవహించి తక్షణమే రోగికి తగ్గిపోయింది. బాబా భక్తరక్షణా కార్యం వారిమహాసమాధి యనంతరం కొనసాగుచుండటం భక్తుల నిత్యానుభవ సత్యం. పశ్చిమగోదావరి పాలకొల్లు సాయిమందిర అధ్యక్షులనుండి నేనువిన్న ఓ విచిత్రానుభవం. 1996 లో ప్రతిష్ట సమయాన బాబా విగ్రహాన్ని బండిపై ఉరేగిస్తున్నారు. ప్రమాదవశాత్తు ఓ మలుపువద్ద బండి తిరగబడి ఓ కార్యకర్తచేతికి బలమైన గాయాలు తగిలాయి. చూచినవారు వానిచేయి విరిగినట్లు భయపడ్డారు. ఆశ్చర్యంగా స్వల్పగాయాలతో అతడు బయటపడ్డాడు, కాని బాబావిగ్రహానికున్న అదేవైపు చేయి పూర్తిగా విరిగిపోయింది. కొంతకాలంపిమ్మట మరోవిగ్రహాన్ని ప్రతిష్టించారు. దయామయుని రక్షణ సదా ప్రాప్తించుటకై హృదయపూర్వకంగా ప్రార్ధించెదముగాక! సమర్ధసద్గురు సాయిమహారాజునకు శతకోటి వందన కుసుమాలు! శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికి శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి! Ref: SriSaisannidhi by Sri Ekkirala Bharadwaja.

Comments

  1. సమర్ధ సద్గురు సాయి శరణుకోరిన భక్తకోటికి తల్లి,తండ్రి మరియు రక్షకుడు !

    ReplyDelete
  2. Really great miracles of Sai Baba. When we trust upon him, HE always behind and saves us. This is my feeling.

    ReplyDelete

Post a Comment