సినిమా(యా) లోకం !

శ్రీ సాయినాథాయనమః! శ్రీ రమణదేవాయనమః! నేడు భగవాన్ శ్రీ రమణమహర్షి 143వ జయంతి. పాఠకులందరికి భగవానుల ఆశీసులు లభించుగాక!
జీవితము ఓ రంగస్థలమని, బొమ్మలాటయని పెద్దలు చెబుతుంటారు. ప్రస్తుతకాలంలో నాటకరంగము మరియు తోలుబొమ్మలాటలు కనుమరుగయ్యాయని చెప్పవచ్చును. వాటిస్థానంలో మూవీ థియేటర్స్ చోటుచేసుకున్నాయి. థియేటర్లో ప్రేక్షకులు చూసే సినిమాకి మరియు నిజజీవితానికి ఎంతో సారూప్యముంది. అదెలాగో పరిశీలించెదము. ప్రధమంగా థియేటర్లో సినిమా ప్రదర్శనవెనుక జరిగే ప్రక్రియ ఏమిటో చూచెదము. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుల వెనుకవైపు గోడలోపల ఆపరేటర్ చే నడుపబడే ప్రొజెక్టర్ రూమ్ వుంటుంది. సినిమా పెద్దఫిల్ములో రికార్డయి పైనున్న చక్రమునకు చుట్టబడి చలిస్తూ ఓ చట్రం ద్వారా పయనించి క్రింది కదిలే చక్రానికి వృత్తాకారంగా చుట్టబడుతుంది. ఫిలిం చట్రం వెనుకభాగాన పెద్దదేదీప్యమానంగా ప్రకాశించే వెలుగు దీపముంటుంది. ఫిల్ము చట్రానికి ముందుభాగాన కటకముంటుంది. సినిమా నడిచేటప్పుడు దీపమునుండి మిరుమిట్లు గొల్పు వెలుగు ఫిల్ముపై పడుతుంది. ఆ ఫిల్ము ప్రతిబింబం సమీప కటకంపై బడి, ఆకటకమునుండి విభజననొంది ఎన్నోరెట్లుగా ప్రేక్షకుల ముందున్న తెరపై ప్రదర్శింపబడుతోంది. ఇదీ క్లుప్తంగా సినిమానడిచే ప్రక్రియ. ప్రొజెక్టర్ నడిపే ఆపరేటర్ కు సినిమా కథతో ఎలాంటి సంబంధం వుండదు, కేవలం ఆపరేషన్ పై శ్రద్ధపెడతాడు. ఇలాంటి చలనచిత్ర ప్రదర్శనయే ప్రతివ్యక్తి వెనుక ఆ వ్యక్తికి తెలియకుండానే నిత్యం జరుగుతుందంటే ఆశ్చర్యం కలుగక మానదు, భగవాన్ రమణ మహర్షి తమ భక్తులతోటి ప్రసంగాలలో ఈ విషయంపై చాల ఆసక్తికరమైన పోలికను వివరించారు. వారి వివరణ నిచట తెలిసికొనెదము. ప్రొజెక్టర్ లోని ప్రకాశవంతమైన దీపం ఆత్మ (The Self ). దీపానికి ముందున్న గాజు కటకం ఆత్మకు అతిసమీపానున్న సాత్వికగుణ ప్రధానమైన మనసు లేక శుద్ధమనసు. వివిధములైన ఫొటోలతోకూడిన ఫిల్ము మనుషుల అంతరంగాలలో దాగియున్న సూక్ష్మ ఆలోచనలతోకూడిన విషయవాసనలు లేక సంస్కారములు. కటకము(lens), దానిగుండా ప్రసరించే వెలుగు మరియు దీపము, ఈ మూడును కలిపి కేంద్రీకృత వెలుగు కిరణము (focussed light ray) మనసు, దానిపై ప్రసరించే వెలుగు మరియు స్యయంప్రకాశ ఆత్మ మూడున్ను కలిసి ద్రష్ట లేక జీవుడు. కటకముగుండా ప్రసరించి తెరపై బడు వెలుగు కిరణం ఏమన మనసుద్వారా వెల్వడి ఇంద్రియముల ( కన్ను, చెవి, ముక్కు, నాలుక, స్పర్శ ) ద్వారా ప్రకటితమై ప్రపంచ నామరూపములుగా ఏర్పడిన మూల ఆత్మ ప్రకాశాకిరణము. మనుషుల అంతరంగాలలో దాగిన విషయవాసనల కనుగుణంగా బాహ్యప్రపంచంలో ప్రకటితమయ్యెడి అనుభవాల కల్గించెడి యంత్రాంగ( మెకానిజం ) మేమన, అదియే దైవ శాసనము. అంటే మనుషులు చేసే ఆలోచనల,వాక్కుల,కర్మల కనుగుణంగా విషయవాసనలు అంతరంగాలలో ఘనీభవిస్తాయి, ఆ విషయవాసనలు దైవశాసనానికి లోబడి మనుషుల అనుభవాలుగా వెలువడుతాయి. అందులకే చేసిన కర్మలు చెడని పదార్ధమని విజ్ఞులంటారు. అంటే వ్యక్తి కష్టాలకు,సుఖదుఃఖాలకు వాని పూర్వ కర్మఫలాలే కారణమన్నమాట! ఎపుడైతే పూర్వ వివిధ విషయవాసనలు క్షీణిస్తాయో అపుడు పై చెప్పబడిన ఫిల్ముపై ఎలాంటి బొమ్మ లేక చిత్రం ఏర్పడదు. అంటే తెల్లటి ఫిల్ము అది. తెల్లటి ఫిల్ముపై బడిన వెలుగుకిరణం తెల్లటి గాజుకటకంపై బడి అది ప్రకాశమయ వెలుగుగామాత్రమే తెరపై బడుతుంది, ఎలాంటి సినిమా నడువదు,తెల్లటి తెరమాత్రమే గోచరమౌతుంది. అనగా కర్మఫలములచే, విషయవాసనలచే మలినమైన ఆత్మ పరిశుద్ధ ఆత్మగా పరిణితిచెంది; వ్యక్తి జగన్నాటకమునుండి ముక్తుడౌతాడన్నమాట! అందరిహృదయాలలోని ప్రకాశమయ జ్యోతియే సాయి లేక భగవాన్ రమణమహర్షి వివరించిన పరి శుద్ధాత్మ (Self). ఇదే విషయాన్ని స్వామి విద్యారణ్యులు తాము రచించిన పంచదశి పదవ అధ్యాయ, నాటకదీపము లో విపులంగా వివరించారు. అందరి అంతరంగాల, నామరూపాలకతీతంగా వెలిగే చైతన్య ప్రకాశదీపమే శ్రీసమర్ధసద్గురు సాయినాథులు. సద్గురుదేవుల కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికి శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి! Ref: The complete works of Sri Ramana Maharshi.
Title: The Light Within Life is like a theater And we the moving scenes A play of light and shadow Behind the silver screens. A lamp shines in the darkness Bright, eternal, still Through the mind, the lens focuses The Self’s enduring will. Chorus The Light within, the Light within Shines through the mind, dispelling sin Through every thought, through every scene The Self reveals what life has been The Light within, the Light within Shines beyond the world, beyond the din The film rolls between the wheels Each frame a thought we keep Impressions stored within the heart Now blossom and now weep. Each joy, each sorrow, every choice Reflects the hidden past The lens of mind, pure and still Shows what the soul casts. Chorus The Light within, the Light within Shines through the mind, dispelling sin Through every thought, through every scene The Self reveals what life has been The Light within, the Light within Shines beyond the world, beyond the din When all the frames are vanished The film no longer rolls No sorrow, fear, or fleeting dream Disturbs the silent Soul. The lamp alone, untouched by time Shines softly in the heart No lens, no film, no worldly play Can dim the sacred part. Bridge / Rhythmic Part Flow of impressions, roll of deeds Shapes the screen where life proceeds Every frame a seed that grows In the world the Self now shows Oh, Light eternal, pure, and free Guide my soul eternally Final Chorus The Light within, the Light within Shines through the mind, dispelling sin Through every thought, through every scene The Self reveals what life has been The Light within, the Light within Shines beyond the world, beyond the din Awaken now, let truth begin See the Light within May the Light of all Masters Shine forever in every heart. 🙏

Comments

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

అధ్యాత్మరామాయణము : అహల్యస్థుతి.