శ్రీసాయిసందేశామృతము 2(Nectar of Sri Sai's message 2).

శ్రీసాయినాథాయనమః. నేడు పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ 87వ జయంతి పర్వదినము. సాయిబాబ తమ శుభసందేశాలనే కిరణాలతో భక్తుల హృదయాల్లో వెలుగులనింపి చైతన్యవంతం చేస్తున్నారు . బాబాసందేశాలనాచరిస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకుందాము.
శ్రీసాయిసందేశామృతము : అధ్యాయము 2. సాయిలీలలు వినోదంతోపాటు విజ్ఞానాన్ని సంతోషాన్ని కల్గిస్తాయి. ఆపారవశ్యంతోనే రచయిత అన్నాసాహెబ్ దబోల్కర్ సాయిమహిమలను గ్రంధస్తం జేశాడు. ఆత్మస్థాయి నిండి వెలువడే సాయి దైవలీలలు సాధారణ మానవుల మానసిక తర్కానికందనంత దూరంగా ఉంటాయి. మరి అలాంటి సాధారణ మనసుతో అసాధారణ గ్రందాన్నెలా రచించాడు? అదే గురుమహిమ,సద్గురుసాయి కృప. ప్రేరణ సాయిది, రచయితా సాయియే! అన్నాసాహెబ్ కేవలం ఉపకరణమాత్రమే. సాగర అలలుగా సాయిలీలలు నిత్యనూతనములు, సత్యబోధకములు. శోధించేకొలది సాధకునికి నూతనభావాలు ఆవిష్కృతమౌతాయి. సాయిపలుకులు ఆత్మలోతులనుండి వెలువడే వెలుగుకిరణాలు.రచయిత తన అహంకారాన్ని గురుచరణాల సర్వసమర్పణజేసి గ్రంథరచనకు కావలసిన శక్తిని,బుద్ధిబలాన్ని సంతరించుకొన్నాడు. రచనజేయు తన తలుపును అత్యంత భక్తుడు శ్యామా ద్వారా విన్నవించుకొని బాబా నుండి యూది, అశీసులు పొందాడు. వాని అహం సూన్యమైనపిమ్మట సాయియే తమ జీవితచరితను లిఖించారు. సాయి బోధలు కేవలం నోటిమాటలుకావు,నిగూఢ సత్యాలను వెలికితీసే ప్రబోధాలు,భక్తుల భక్తి విశ్వాసాలకు పునాదులు. అపరిచయ భక్తులను తామే చెంతకులాగెదరు సాయి. నానాసాహెబ్ చాందోర్కర్ ద్వారా కబురంపి,మార్గంలో మహమ్మదీయుని రూపంలో సాయపడి అన్నాసాహెబును శిరిడీకీడ్చారు. ప్రధమ దర్శనంతోనే ప్రపంచమంతా సాయిరూపనే యనుభూతి పొందుట వాని పూర్వజన్మ పుణ్యఫలంగా భావింపవచ్చును. సద్గురునిపై విశ్వాసం నిలుపుట అంతటి సులువైన విషయంకాదు. తాను శిరీడీ జేరిన మొదటి రాత్రే గురుని గొప్పదనం గూర్చి బాలాసాహెబ్ భాటేతో వాదించాడు. అహం తొలగుట అంతసులువుకాదుగదా! మరునాడు వాడాలో జరిగిన వారి వాదనను సాయి ప్రశ్నింపగా విస్తుపోయిన అన్నా బాబా సర్వజ్ఞతకు అబ్బురపడ్డాడు. త్రికాలజ్ఞాని బాబా వాని భవిష్యత్తునెఱిగి హేమాద్రిపంతు బిరుదునిచ్చారు. దైవాన్ని జేరుటకెన్నో దారులున్నాయి, శిరిడి నుండి కూడా ఓ మార్గముందని అందులకు మార్గదర్శి సాయం తప్పక కావలెననెడి బాబా మాటలను స్వయంగా విన్నాడు అన్నా. సర్వమత సామరస్యము, సద్గురు శరణాగతి ఆవశ్యకత సాయిసందేశము! శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికి శుభమగుగాక!ఓంసాయి శ్రీసాయి జైజైసాయి!
" Verily this divine illusion of Mine, ,made up of Gunas is difficult to cross over;those who take refuge in Me, they alone cross over this illusion." The Holy Gita 7:14 ( " త్రిగుణాత్మకమైన యీ నాయొక్క మాయ దేహసంబంధమైనది. అనగా నావలన కలిగినది. కనుకనిది సామాన్యులచే దాటశక్యము గానిదిగా నుంటున్నది. కాని ఎవరు నన్ను శరణు పొందుచున్నారో , వారు ఈ మాయను సులభముగా దాటుచున్నారు").
**Salutations to Shri Sai Natha.** On this auspicious day — the 87th Jayanti of the revered Sri Ekkirala Bharadwaja — we begin the second chapter of *Shri Sai Sandesha Amritam.* The divine plays (*leelas*) of Sai bring not only joy but also wisdom. They reveal truths that are far beyond the reach of human intellect. It was only through the boundless grace of the Guru that Annasaheb Dabholkar could compose the *Sai Satcharitra,* recording Sai’s divine glory. Such writings are not born of the ordinary mind; they arise through the supreme power and compassion of the Sadguru Sai. The inspiration was Sai’s; the writer was merely His chosen instrument. Sai’s *leelas* are like the endless waves of the ocean—ever-new, ever-revealing eternal truths. The more one contemplates them, the deeper the realization becomes. Sai’s words are rays of light shining from the depths of the soul. Annasaheb surrendered his ego completely at the Guru’s feet and, through that surrender, attained the strength and clarity needed to write. Before beginning his work, he sought Baba’s blessings through the devoted Shyama. When his ego dissolved into nothingness, it was Sai Himself who wrote His own life story through him. Sai’s teachings are not mere words; they are revelations that uncover hidden truths. They form the foundation of devotion and faith for countless followers. Sai draws even unknown devotees to Himself—appearing in many forms. Once, through Nanasaheb Chandorkar’s story, and again, in the guise of a Muslim traveler, Sai guided Annasaheb safely to Shirdi. At his very first darshan, Annasaheb perceived the entire world as one form of Sai—a vision that could only be the fruit of great merit from previous lives. To maintain unwavering faith in a true Guru is no easy task. On his first night in Shirdi, Annasaheb debated Baba’s greatness with Balasaheb Bhate—proof that ego does not fade easily. The next morning, when Baba Himself mentioned their private conversation, Annasaheb stood astonished, realizing Sai’s all-knowing nature. Seeing the devotee’s future, Baba affectionately gave him the title *Hemadri Pant.* Sai taught that there are many paths leading to the Divine, and even from Shirdi, one such path exists—but for that, a true guide, a Sadguru, is essential. This is Sai’s eternal message: the harmony of all faiths and the necessity of surrender to the True Guru. May the rays of Sai’s compassion shine upon all beings. May peace and goodness prevail everywhere. **Om Sai Shri Sai Jai Jai Sai.** ⸻

Comments

  1. This message of Sadhguru Saibaba to all His devotees is similar to the message of Lord Sri Krishna to His warrior disciple Arjuna.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)