శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)
శ్రీసాయినాథాయనమః.సాయిబాబ తమ శుభసందేశాలనే కిరణాలతో భక్తుల హృదయాల్లో వెలుగులనింపి చైతన్యవంతం చేస్తున్నారు . బాబాసందేశాలనాచరిస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకుందాము.
పాఠక భక్తులెల్లరకు విజయదశమి శుభాకాంక్షలు,సదా బాబా ఆశీసులు!
సమర్ధసద్గురు శ్రీసాయినాథులకు శతకోటి హృదయపూర్వక నమస్కారములతో ఈ వ్యాసమును ప్రారంభిస్తున్నాను. బాబా దయవలన గత కొన్ని సంవత్సరములుగా శ్రీసాయి సచ్చరిత్ర నిత్యపారాయణము విధిగా జరుగుచున్నది. చదివిన ప్రతిసారి కొత్త కొత్త అర్ధాలు,సందేశాలు స్ఫురణకు రావడం గమనించాను. చదివిన మొదట్లో బాబా లీలలు భక్తుల బాధానివారణ కన్నట్లు తలచేవాడను. పారాయణము కొనసాగేకొలది లీలల వెనుక బాబా మనకేదో సందేశమిస్తుంన్నారనే భావన కలుగ సాగింది. లోతుగా చదివిన పిమ్మట నిగూఢసందేశాల జాడ కొద్ది కొద్దిగా అవగాహన కొచ్చెడిది. అధ్యాయ క్రమంలో ఆయా లీలాసందేశాల సమాహారమే ప్రస్తుత సాయిసందేశామృతము. పాఠక భక్తులకు పారాయణానంతరము సాయిలీలల వెనుక వేరువేరు అర్ధములు,భావములు గోచరించుట సహజము. ప్రస్తుతం నా జ్ఞానపరిధికందిన భావాలను తోటి సాయి భక్తులతో పంచుకుంటున్నాను. ఇది పూర్తిగా వ్యక్తిగత భావన. భక్తులెల్లరు తమతమ సూచనలను,స్పందనను క్రిందనున్న comments section లో దయతో పొందుపరచగలరు.
శ్రీసాయిసందేశామృతము :అధ్యాయము 1.
ఈ అధ్యాయ ముఖ్యవిషయం బాబా గోధుమలు విసిరిన పిండిని శిరిడీ గ్రామసరిహద్దులలో చల్లించి కలరావ్యాధి బాపుట. సద్గురువుల చేష్టలు,సంకల్పాలు సామాన్యుల ఊహలకందవు. అవి ప్రకృతిశక్తులను సైతం శాసించి సర్వమానవ కళ్యాణానికి దోహద పడతాయి. శిరిడీలో ప్రబలిన కలరామారి నివారణ సాయి సంకల్పము. గోధుమలు విసరుట బాహ్యచేష్ట. అంతేకాదు,మహాత్ముల సంకల్పాలు భక్తుల సత్కార్యాలకు పురిగొల్పుతాయి.సాయి ప్రేరణచే హేమాద్రిపంతు శ్రీసాయిభాగవతాన్ని అతిమహిమాన్వితంగా రచించాడు. బాబా గోధుమలు విసరుట అత్యంత గూఢచర్య. కలరా వీడినపుడు అచటి ప్రజలు బాబా శక్తిని కొలదిమాత్రము గ్రహించారు.మనుజుల అంతరంగ ఆశలు, ఆలోచనలు,కోర్కెలు,మంచిచెడు భావాలు వాసనలు దేహానంతరం నశింపక మరల మరోదేహంలో మొలకెత్తుతాయనెడిది శ్రీకృష్ణ భగవానుని గీతోపదేశము. అందుకే కర్మ రాహిత్యం,అంతఃకరణ శుద్ధి జరిగేవరకు కర్మలు కర్మఫలాలు వాటిని యనుభవించే దేహాలు మరల మరల అంకురిస్తునే ఉంటాయి. అందులకే మొలకెత్తడానికి వీలుకాని కర్మలకు సంకేతంగా బాబా గోధుమలను పిండిజేశారు.ముడి గోధుమలు మరికొన్ని గోధుమ మొలకలకు కారణములు,కాని పిండిగామారిన గోధుమలు ఎలాంటి మొలకలనీయజాలవు. మంచి వంటకం వండాలంటే మంచి సరుకులోతోపాటు శుద్ధమైన వంటపాత్ర అవసరమైనట్లు, మనం చేసే పుణ్యకర్మల సత్ఫలితాలివ్వాలంటే అంతరంగశుద్ధి తప్పక ఆవశ్యకము. అందులకు ఫలాపేక్షలేని కర్మలు చేయడం,భక్తి లేక జ్ఞానమార్గముల ననుసరించడమని శాస్త్రవాక్యము. అంతరంగశుద్ధి కలిగినపుడు మోక్షమార్గం సులభమవుతుంది. పండిన ప్రతి పండులోను దానికి మూలమైన విత్తనం దాగినవిధంగా బాబా చూపిన ప్రతి లీలవెనుక దైవశక్తితోపాటు నిగూఢంగా ఓ సందేశం ఇమిడి యుంటుంది. లీల వినోదాన్ని,సంతోషాన్ని మరియు ఆశ్చర్యాన్ని కలిగిస్తే, సందేశం విజ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని ప్రబోధిస్తోంది.లీల భక్తిని ప్రేరేపిస్తే , సందేశం మార్గదర్శక దీపమౌతుంది. ఈ ప్రయోజనములు దృష్ట్యా సాయి లీలల శ్రవణపఠనాదులు వ్యక్తి ఆధ్యాత్మిక జీవన పురోగతికెంతో మేలుజేయగలవు. శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికి శుభమగుగాక!ఓంసాయి శ్రీసాయి జైజైసాయి!
"When a man completely cuts off, O Partha,all the desires of the mind,and is satisfied in the Self by the Self, then is he said to be one of steady wisdom." The Holy Gita 2:55 ("ఓ అర్జునా! అంతఃకరణములోగల సమస్తములైన కోరికలను ఎప్పుడు ప్రయత్నపూర్వకంగా విడుచుచున్నాడో ,అప్పుడు శుద్ధమైన ఆత్మయగును. ఆ స్థితిలో ఆత్మకంటే భిన్నమైన వస్తువు గోచరింపనందున తనలో తానే అఖండానందము ననుభవించును. అట్టి స్థిరమైన జ్ఞానము గలవాడు స్థితప్రజ్ఞుడనబడును.")
🌸 The Nectar of Sri Sai's message. Chapter 1.
Reflections on the Divine Teachings of Shirdi Sai Baba
Om Sri Sainathaya Namah
On this sacred day of Vijaya Dashami, heartfelt greetings and blessings to all devotees.
May the compassionate glance of our beloved Sadguru, Sri Sai Nath Maharaj, forever protect and uplift us.
With deep reverence and gratitude, I bow to the holy feet of Baba and begin this humble offering — a drop from the ocean of His grace.
For several years now, by Baba’s boundless mercy, I have been performing regular parayana (recitation) of the Sri Sai Satcharitra. Each reading feels like the first — new insights, new emotions, new layers of meaning revealing themselves each time.
In the beginning, I perceived Baba’s leelas merely as divine interventions that removed the sorrows of devotees. But gradually, through deeper contemplation, I realized that every leela is a teaching — a message wrapped in divine play. Behind every act lies a lesson, behind every story a symbol, guiding us toward truth, purity, and surrender.
Thus was born this humble series — “Sai Sandeshaamrutam”, the Nectar of Sai’s Messages — drawn from the hidden meanings behind His leelas, chapter by chapter. Each devotee may perceive a different essence, for Baba speaks uniquely to every heart. What follows is my own limited understanding, offered with devotion. I welcome fellow devotees to share their reflections, so that together we may drink deeper from the nectar of His wisdom.
🌾 Message Nectar — Chapter 1
The Inner Meaning of Grinding Wheat
The first chapter of the Satcharitra recounts Baba’s act of grinding wheat and scattering the flour along the borders of Shirdi to ward off the cholera epidemic.
To the ordinary mind, this might appear as a simple physical act. But the ways of realized Masters are never ordinary — every gesture holds cosmic purpose. When saints act, even the forces of nature bow in obedience; their will moves unseen worlds for the welfare of humanity.
Baba’s outward intention was to protect Shirdi from the raging disease. Yet, hidden within this divine play was a profound spiritual message. His act of grinding wheat was not merely a cure for cholera — it was a sacred symbol of inner purification.
The grains of wheat represent the seeds of karma — the countless desires, impressions, and attachments that bind us to the cycle of birth and death. So long as these seeds remain intact, they sprout again and again, compelling us to reap their fruits in future lives.
But once the wheat is ground into flour, it loses the power to germinate. Similarly, when the mind is purified through selfless devotion, right knowledge, and surrender to God, the seeds of karma are destroyed. The soul then becomes free — no longer compelled by past desires or future cravings.
As the Bhagavad Gita teaches:
“When a man completely relinquishes all desires that arise in the heart,
and is content in the Self by the Self alone,
then he is called steadfast in wisdom.”
(Gita 2:55)
Baba’s grinding was, therefore, an act of grace — silently teaching that true liberation is not in outer rituals but in the grinding away of inner impurities. The cholera that vanished from the village was but a reflection of the deeper cleansing He brought to the hearts of men.
Just as a wholesome meal requires not only good ingredients but also a clean vessel, so too our actions must be performed with purity of heart. When deeds are done without selfish desire, they become offerings — fragrant with devotion, free from the taint of expectation.
Thus, through the simple act of grinding wheat, Baba gave humanity an eternal message:
“Purify the mind, and all diseases — of body, heart, and destiny — shall be cured.”


This message of Sadhguru Saibaba to all His devotees is similar to the message of Lord Sri Krishna to His warrior disciple Arjuna.
ReplyDelete