శ్రీసాయిసందేశామృతము 4 (Nectar of Sri Sai's message 4.) Happy Geeta Jayanthi.

శ్రీసాయినాథాయనమః. సాయిబాబ తమ శుభసందేశాలనే కిరణాలతో భక్తుల హృదయాల్లో వెలుగులనింపి చైతన్యవంతం చేస్తున్నారు . బాబాసందేశాలనాచరిస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకుందాము.
శ్రీసాయిసందేశామృతము: అధ్యాయము 4. పరస్పర ఆకర్షణచే గ్రహాలు చలించినట్లు,దైవశాసనానికి అనుగుణంగా సృష్టి నడుస్తుందనేది సనాతన సత్యవాక్కు. దైవనిర్దేశ ధర్మానికి హాని జరిగినప్పుడు ఆదైవమే ఓ అవతారరూపుదాల్చి పరిస్థితుల చక్కబెడతాడనేది గీతావాక్యం. ఆ కోవలోనే కాలానుగుణంగా సద్గురువుల అవతరణ జరుగుతుంది. అందుకోసమే సాయిబాబా శిరిడీలో ప్రత్యక్షమై వర్ధిల్లారు.వారి నివాసం చేతనే శిరిడీ పావన క్షేత్రంగా పరిధిల్లుచుంది.వారిపాదస్పర్శచే అచటి ప్రతిధూళికణం పవిత్రత సంతరించుకొంది. వారి దైవసాన్నిధ్యంలో చంచలమనసులకు పరమశాంతి ప్రాప్తిస్తుంది. అది నిత్యసత్యం,నిరంతర ప్రక్రియ. భక్తులయనుభవాలే ఇందులకు సాక్ష్యం.కారుణ్యమూర్తి పండరీపురరంగని కలియుగరూపమే శిరిడీలోని సాయిబాబా.భగవంతుని స్మరణ, సంకీర్తనలు సదా సాయికి ప్రీతిపాత్రములు. "అల్లా మాలిక్ " వారినాలుకపై నిత్యం నాట్యంజేసే మంత్రాక్షరాలు. దాసగణు మహారాజుచే విఠలనామసప్తాహం జేయించి, దీక్షితుకు ధ్యానదర్శనమివ్వడం ఓ ఆశ్చర్యం. సప్తాహ కార్యక్రమం నిర్వహించింది దాసగణు, విఠల దర్శనం ప్రాప్తించినది దీక్షితుకు, ఇదొక వింతైన దైవలీల.నిశితంగా పరిశీలిస్తే ఇచ్చటొక శ్రీకృష్ణగీతావాక్య సందేశం గుర్తుకొస్తుంది. విఠల దర్శనం లభించాలనే ఫలాపేక్షతో దాసగణు నామసప్తాహం జేస్తే , దీక్షితు సాయి మాటపై భక్తివిశ్వాసాలతో సప్తాహంలో పాల్గొన్నాడు. ఫలాపేక్ష లేకపోవడమే దీక్షితు దైవదర్శనానికి కారణముగా యూహింపవచ్చును. తల్లిదండ్రుల భక్తిశ్రద్ధలను వారి సంతానం కొనసాగించాలనెడి సత్యాన్ని భగవంతరావు క్షీరసాగరుని ఘటనద్వారా మనందరికీ చెబుతున్నారు బాబా.ఇచట తండ్రిజేసే విఠలపూజ బిడ్డ మరచాడు. భగవంతరావు పూజ, నైవేద్యం మరచి విఠలుని,తనను ఆకలితో మాడ్చాడని చెప్పడంలో తాము విఠలుని మరో రూపంగా మనలకు గుర్తు చేస్తున్నారేమో! ఇది ఆలోచింపదగిన విషయంకాదా?పూజ మరియు నైవేద్యముల ప్రక్రియ దైవం ఆరగిస్తున్నాడనే శ్రద్ధాభావంతో కూడియుండాలికాని కేవలం యాంత్రికంగా కాదు. సాయి చిత్రపటానికి మరియు మూర్తికి భేదంలేదనేది భక్తుల యనుభవం మరువరాదు. భక్తిశ్రద్ధలుంటే గురుసన్నిధే పావనక్షేత్రమని, ప్రయాగ స్నానానికి వెళ్లదలచిన దాసగణుకు అనుభవం ప్రసాదించారు. గంగయమునల పావనధారలు వారి పాదపద్మాలనుండి వెలువడ్డాయి. కులగోత్రాలకు,మత సాంప్రదాయాలకు విలువివ్వలేదు బాబా.అందులకేనేమో సాయి జన్మ వివరాలు లోకానికి తెలియలేదు. విశ్వమే తామైన సద్గురునికి ఓ ప్రత్యేక నివాసమెందుకన్నటుల ,వేపచెట్టుమూలాన్నే తమ ఆశ్రమంగా మలచుకున్నారు సాయి. వేపచెట్టు క్రిందనున్న గుహలా సద్గురుసాయి జన్మకర్మలు గుహ్యాతిగుహ్యములు. భవిష్యత్కాల అవసరాలనిమిత్తమేమో యన్నటుల సాఠేవాడ,దీక్షితువాడ,బూటీవాడల నిర్మింపజేశారు సాయి. సాయిసంకల్పానికవి సాక్ష్యభూతాలు!శ్రీసాయి కరుణకిరణాలు అందరిపై ప్రసరించుగాక!అందరికి శుభమగుగాక!ఓంసాయి శ్రీసాయి జైజైసాయి !
"భారతకులోద్భవుడవగు ఓ యర్జునా! అట్లు నేనవతరించుట యెందుకనగా, ఎప్పుడు ధర్మము క్షీణించుచున్నదో, అధర్మమభివృద్ధి యగుచున్నదో, అప్పుడు అధర్మమునణచుటకును, ధర్మము నుద్ధరించుటకును నన్ను నేనే సృజించుకొనుచున్నాను. అనగా నేను స్వయముగా అవతరించుచున్నాను".భగవద్గీత : 4:37
Sri Sai Sandeshamrutam – Chapter 4. Blessed Greetings to all Devotees on the Holy Occasion of Gita Jayanti! Sri Sainathaya Namaha According to the eternal law of creation, just as planets move under the influence of mutual attraction, the universe too moves in perfect rhythm with the divine ordinance. Whenever this sacred law of righteousness is disturbed, the Supreme Being assumes an earthly form to restore balance. This profound declaration of the Bhagavad Gita points to the timeless truth that the descent of divine teachers and Sadgurus happens in every age. In that very way, Sri Sai Baba of Shirdi manifested on earth and uplifted countless seekers. By His sacred presence alone, Shirdi became a holy kshetra, a sanctified field of divine vibrations. Every grain of dust touched by His feet became blessed. In His august presence, the wavering minds of devotees attained deep, inner peace. This is not mere imagination—it is an eternal truth, proven by the experiences of His devotees. The embodiment of compassion, the Lord of Pandharpur, the eternal Vittala Himself, assumed the form of Sai Baba in the Kali age. Remembrance of the Lord and devotional singing were ever pleasing to Him. “Allah Malik”—these sacred syllables constantly danced upon His tongue. One of His wondrous leelas is the incident of Das Ganu Maharaj conducting a Vittala Nama Saptaha, after which the divine vision of Vittala was granted— not to Das Ganu, but to Kaka Saheb Dixit. Das Ganu performed the saptaha with the deep desire for divine darshan, while Dixit participated simply because Baba had instructed him, with unshaken faith and without any expectation. Thus, it was Dixit who was blessed with the Lord’s vision. This leela perfectly echoes the divine message of the Gita: Freedom from expectation is the key that opens the door to divine grace. Another profound incident is the story of Bhagiratha Rao Ksheerasagar. Through this leela, Baba conveys a universal message—that the devotion and sincere practices of parents should continue through their children. Here, the father daily worshipped Vittala, yet the son forgot the offering of food, leaving both Baba and Vittala hungry. Through this playful divine complaint, Baba gently reminds us that He Himself is Vittala and that devotion must be filled with heartfelt sincerity, not performed mechanically. We must never forget that Sai’s picture and Sai’s presence are one and the same. When devotion is pure, every place becomes a sacred pilgrim centre, and the Guru’s feet become our holy Prayag. Das Ganu himself experienced this when the sacred streams of Ganga and Yamuna flowed mystically from Baba’s toes, fulfilling his desire for a holy dip without leaving Shirdi. Baba never recognized caste, lineage, or religious differences. Perhaps that is why His own birth details remain unknown to the world. For a Sadguru who is the form of the entire cosmos, of what significance is a particular birthplace? Thus, Baba chose the neem tree as His earliest abode—its cool shade becoming His hermitage, its roots hiding the mystery of His divine origin. He made Sathe Wada, Dixit Wada, and Booty Wada arise—not merely as physical structures but as living witnesses to His Sankalpa, built to serve future generations. May the compassionate rays of Sri Sai shine upon all! May everyone be blessed with auspiciousness! Om Sai, Sri Sai, Jai Jai Sai! ⸻ Bhagavad Gita 4:7 “Whenever righteousness declines, O Bharata, and unrighteousness rises, then I manifest Myself.”

Comments

  1. This message of Sadhguru Saibaba to all His devotees is similar to the message of Lord Sri Krishna to His warrior disciple Arjuna.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)