శ్రీసాయిసందేశామృతము 10 (Nectar of Sri Sai's Message 10).
శ్రీసాయినాథాయనమః . సాయిబాబ తమ శుభసందేశాలనే కిరణాలతో భక్తుల హృదయాల్లో వెలుగులనింపి చైతన్యవంతం చేస్తున్నారు . బాబాసందేశాలనాచరిస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకుందాము.
శ్రీసాయిసందేశామృతము: అధ్యాయము 10. ప్రతివ్యక్తియొక్క అలుపెరుగని ఆరాటానికి కారణము తెలిసో లేక తెలియకనో తానెవరో తెలుసుకొనే ప్రయత్నమే ! ఈ అప్రయత్న ప్రయత్నము అవగాహనతోకాని , అవగాహనరాహిత్యముతోగాని అహర్నిశలు కొనసాగుతూనే యుంటుంది. ఇందులకు ఉపమానం, సాగరంలో సంగమించేవరకు తనప్రవాహాన్ని కొనసాగించి తుదకు నది సముద్రంలో ఐక్యమవ్వడం . ఈ మనిషియొక్క అన్వేషణే తానెవరో గ్రహించెడి ఆత్మజ్ఞానాన్వేషణ . ఈ ఆత్మజ్ఞాన ప్రక్రియకు ఆత్మసాక్షాత్కారము లేక మోక్షము పర్యాయపదములుగా నెరుగవచ్చును . సద్గురువు సదా పరిపూర్ణావస్థలో ప్రకాశిస్తుండాడు. సర్వస్య శరణాగతిచేత భక్తుడు గురుని కృపకు పాత్రుడౌతాడు . బాబా సిద్ధపురుషుడు . కోరకనే అష్టసిద్ధులు బాబాకు వశమయ్యాయి . అవి వరుసగా అణిమ(అణురూపముపొందుట ) , మహిమ(పెద్దరూపము పొందుట ) గరిమ( తమ దేహభారమును పెక్కురెట్లు పెంచుట ) , లఘిమ(దేహమును దూది కంటే తేలికజేయుట,నీటిపై నడచుట ) , ప్రాప్తి(అనుకొన్నస్థాయికి జేరుట ) , ప్రాకామ్య(కోరిన కోర్కెల పొందుట ) ఇషిత్వ(వస్తువుల సృష్టించుట , స్వాధీనపరచుకొనుట ), వసిత్వ( ఇతరుల అధీనుల జేయుట , జనన మరణాల నియంత్రించుట ) . నిశితంగా పరిశీలిస్తే బాబాజీవితంలో ఈ అష్టసిద్ధులు ప్రకటితమయ్యాయి . కాని బాబా యెన్నడూ ఆయాసిద్ధులను తనమహిమ చాచుటకు వినియోగింపక కేవలము అవసరానుగుణంగా భక్తుల రక్షణ నిమిత్తమై వినియోగిచెడివారు . గుడ్డపీలికలతో వ్రేలాడు చిన్నబల్లపై శయనించుట బాబాజూపిన ఓ దివ్యలీల(లఘిమ సిద్ధి ). భక్తులబరువులు మోసే తండ్రి ఏమాత్రం బరువులేకపోవడం విచిత్ర వినోదం. బాబాచూపిన ఈవింత మహిమ భక్తులవినోదం లేదా బాబాపట్లవారి భక్తివిశ్వాసాల పెంపొందించుటకొరకు కావచ్చును . ఉపరితలం పెద్దపెద్ద అలలతో యెంతో అల్లకల్లోలంగా కనిపించినా, సాగర అంతరహృదయం మిగుల నిశ్చలమైనట్లు, బాబా చిర్రుబుర్ర చేష్టలు చూపరులకు బహువింతగా తోచినా వారిహృదయం అమృతకలశం . తమభక్తుల యోగక్షేమములకై మిగుల తపించెడివారు . సాయిబాబా సదాచింతారహితులు, పరిపూర్ణ ఆనందమయులు . నిరాడంబరతకు నిలువెత్తు దర్పణం బాబా జీవితవిధానం . " అల్లా మాలిక్ " వారి నిరంతర ధ్యానమంత్రం . వారిజీవితవిధానమే భక్తులకు నిశ్శబ్ద సందేశం . చూపరులకు బాబా 80 సంవత్సరములు జీవించినా వారు కాలాతీతులు . నమ్మినభక్తులకు సాయి యునికి నిత్యసత్యం . వివిధమతములువారు తమ కలహాలు మని సోదరభావంతో మెలగాలనేది వారి నిత్యభోధ . ఆత్మసాక్షాత్కార సిద్ధిపొందిన యోగిరాజులు సాయినాథులు, వారియనుభవాన్ని అర్హతగల భక్తులకు ప్రసాదింపగల సర్వసమర్థులు . శ్రీకృష్ణ భగవానుడు బోధించిన స్థితప్రజ్ఞుని లక్షణములెల్లను బాబాలో మూర్తీభవించినాయి . సాయిమహిమను తమనిత్యకృత్యములలో సదాస్మరించెడి అమాయకపు శిరిడీ వాసుల జన్మలు ధన్యముగదా! ఫకీరువేష పరమాత్మయే సాయిబాబా ! భగవంతుని ఆరు లక్షణములగు కీర్తి , ధనము , అభిమానరాహిత్యము,జ్ఞానము , మహిమ , ఔదార్యము బాబాలో రూపుదాల్చినవి . వారి యణుకువకు వారేసాటి. బానిసలకు బానిసగా భావించెడివారు . తమగద్దెను విచిత్రపురుషుడు నానావళి కర్పించిన నిరభిమానులు . ఇంద్రియానుభూతులకతీతులు . బ్రహ్మచర్యవ్రతమున హనుమ సమానులు. సాయీబోధ మిగులసరళము, ఆచరణకు సులభసాధ్యము . జటిల యోగాభ్యాస, మంత్రోపదేశముల యవసరంలేదు . కేవలం " సాయి , సాయి " నామస్మరణము చాలు . భక్తిశ్రద్ధలతో కూడిన నామస్మరణచే సాయికృపను సులువుగా పొందవచ్చును . మహాత్ముల కథాశ్రవణము వారిసత్సంగ సమము . గురుకృపయే దైవకృప ! గురుసన్నిధే దైవసన్నిధి ! శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక ! అందరికి శుభమగుగాక ! ఓంసాయి శ్రీసాయి జైజై సాయి !
" There is no end to My Glories, O Arjuna;but this is but a brief statement by Me of the particulars of My Divine Glories".The Holy Geeta: 10:40. (శత్రుసంతాపకుడ నగు ఓ అర్జునా ! అద్భుతములైన నాయొక్క విభూతులకు మహాత్మ్యములకు అంతములేదు . అయినను ఇప్పుడు చెప్పబడిన విస్తారము నీకు గురుతుగాను సంగ్రహముగా చెప్పబడినది . గీత : 10:40)
🌸 Sri Sai Sandeshamrutam – Chapter 10 (English Devotional Rendering) 🌸
Śrī Sāyināthāya Namah.
Sai Baba forever illumines the hearts of His devotees with rays of divine messages—
awakening them, uplifting them, filling them with inner light.
Let us live by His sacred teachings and make our lives truly blessed.
The Eternal Quest
Every being, knowingly or unknowingly, is tirelessly searching—
seeking the answer to the ageless question:
“Who am I?”
Like a river that flows unceasingly until it merges with the ocean,
this inner enquiry continues day and night,
ending only in the ocean of Self-Realization.
This quest for Self-Knowledge is what sages call
Ātma-jñāna,
Self-realization,
or Liberation (Moksha).
The Role of the Sadguru
The Sadguru ever shines in a state of absolute perfection.
When a devotee takes complete refuge in Him,
he becomes worthy of the Guru’s boundless grace.
Sai Baba is a Siddha Purusha—
one to whom the eight mystical powers, the Aṣṭa Siddhis,
come naturally without seeking:
Aṇimā – becoming minute as the atom
Mahimā – becoming vast and immense
Garimā – increasing one’s weight enormously
Laghimā – becoming lighter than cotton, even walking on water
Prāpti – reaching or obtaining anything at will
Prākāmya – fulfilling all desires
Īśitva – the power of creation or lordship
Vaśitva – mastery over beings, even control over birth and death
In Baba’s life, all these siddhis manifested—
yet never did He display them for self-glory.
He used them silently, only to protect and uplift His devotees.
The incident of Baba reclining on a tiny cloth-covered plank,
suspended high above—
is a radiant expression of Laghimā Siddhi.
The One who bore the burdens of all His devotees
Himself remained weightless, effortless, free.
His playful miracles were not for exhibition—
they were gentle ways
to deepen love and strengthen faith
in the hearts of His children.
The Ocean-like Heart of Sai
Though the surface of the ocean may churn with mighty waves,
its depths remain calm and serene.
So too—
though Baba outwardly displayed quirky, simple, or mysterious ways,
His heart was a kalasha of nectar—
overflowing with compassion
for the welfare of every being.
Sai was beyond agitation, beyond desire,
dwelling ever in perfect bliss.
His life was a mirror of absolute simplicity.
“Allāh Mālik”—God alone is the Master—
was His constant mantra.
His very way of living was a silent scripture
for all sincere seekers.
Though Baba lived for eighty years in a mortal frame,
to His devotees He is timeless,
eternal, unbound by age or era.
The Universal Master
Sai Baba taught people of all faiths
to live like children of one Mother—
in unity, harmony, and brotherhood.
Like Lord Krishna’s Stithaprajña,
all divine qualities shone in Baba,
effortlessly, luminously.
Fortunate indeed were the simple villagers of Shirdi
who lived in His presence—
their lives sanctified by His daily leelas.
Sai Baba, the Supreme Lord in the garb of a Fakir,
embodied the six divine attributes of God:
Fame (Kīrti)
Wealth (Dhana)
Non-attachment (Vairāgya)
Wisdom (Jñāna)
Power (Mahimā)
Generosity (Dāna / Audārya)
Humility was His crown.
He considered Himself the servant of His devotees.
He had no ego, no pride, no sense of possession.
Untouched by the senses,
He lived like Hanuman in absolute brahmacharya.
The Simplicity of Sai’s Path
Sai’s teaching is profoundly simple—
free from complications of esoteric yogas
or complex ritualistic disciplines.
Just one thing is enough:
Chant “Sai… Sai…” with love and faith.
This alone draws His grace
like a fragrant breeze draws the heart.
Listening to the stories of saints
is itself equal to satsanga.
Guru’s grace is God’s grace.
Guru’s presence is God’s presence.
May the compassionate rays of Sri Sai
shine on all beings,
bringing auspiciousness, peace, and joy.
Om Sai Sri Sai Jai Jai Sai!
Bhagavad Gita 10:40
“O Arjuna, there is no end to My Divine Glories.
What I have declared to you is only a brief statement
of the vastness of My infinite manifestations.”
— Bhagavad Gita 10:40

Comments
Post a Comment