శ్రీసాయిసందేశామృతము 11 (Nectar of Sri Sai's Message 11).
శ్రీసాయినాథాయనమః.సాయిబాబ తమ శుభసందేశాలనే కిరణాలతో భక్తుల హృదయాల్లో వెలుగులనింపి చైతన్యవంతం చేస్తున్నారు . బాబాసందేశాలనాచరిస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకుందాము.
శ్రీసాయిసందేశామృతము: అధ్యాయము 11.ఘనీభవించిన నీరు మంచుగడ్డగాను, అదేనీరు వేడిచేయగా రూపరహిత ఆవిరిగాను మారుతుంది . అదేవిధంగా విశ్వచైతన్యశక్తి లేక దైవశక్తి సగుణ,నిర్గుణ రూపాలలో వ్యక్తమవుతోంది . మానవుడు భౌతికమైన ఆకారము కలిగియున్నాడుగావున భగవంతుని సగుణరూపునిగా పూజించుట సులభము . కావున సాయిసగుణోపాసన భక్తులగ్రాహ్యమునకందే సద్గురుపూజ . సాకారులుగా ప్రకటితమైన నిరాకారులు సాయి . వారి క్షమాశీలత , క్రోధరాహిత్యము , రుజువర్తన , శాంతస్వభావము , నిత్యతృప్తి మున్నగు దైవలక్షణములు భక్తుల అవగాహనకందే సందేశగుళికలు . మహాత్ములు జీవనదులవంటివారు , తమజీవన గమనంలో ఎందరో జనులకు శాంతిసౌఖ్యముల ప్రసాదిస్తారు . సర్వహృదయవాసి సాయి , భక్తులు జేసెడి వేరువేరుసేవలు వారికి ప్రియము, ఆమోదయోగ్యము . భక్తులనుండి సేవలిష్టపడని బాబ, అమాయకపు డాక్టరు పండితుని చందనసేవకు మిన్నకున్నారు . రాగద్వేషములు లేని నిర్మలహృదయులు బాబాకు ప్రియపాత్రులు. శాంతి సహనములకు ప్రతిరూపులు బాబ అపుడపుడు భక్తులశ్రేయస్సుకై క్రోధము ప్రకటించినా వారి అంతరంగము అమృతభాండము,శీతలహిమము. మక్కా మదీనా పుణ్యక్షేత్రముల దర్శించానన్న అహంకారంతో చూడవచ్చిన హాజీని నిరాకరించారు సాయి . తొమ్మిది నెలలపిమ్మటే భక్తుడు శ్యామా విన్నపముతో హాజీకి మసీదు ప్రవేశం లభించింది . ఎత్తైన కొండపై నీరునిలువనట్లు అహంకారయుత హృదయంలో సాయికి చోటులేదు . వినమ్రతను చెప్పకచెప్పుతున్నారు బాబ. భగవంతుని సృష్టియే పంచభూతములు . శిరిడీలో తీవ్ర గాలివానల తుఫాను సమయాన ప్రజలు భయభ్రాంతులై సాయిని ఆశ్రయించినవేళ, తమ తీవ్రగర్జనలచే తుఫాను శాసించి శాంతింపజేశారు సాయి . మరొకపర్యాయం ధునిమంటలు పెద్దవై మజీదు కప్పుకంటుతున్న వేళ అచటివారు మిగుల భయభ్రాంతులకు లోనయ్యారు . తమ సటకాతో స్తంభముపై మెల్లగా కొట్టుచూ మంటల నియంత్రించారు బాబ. కేవలం సంకల్పమాత్రంచే చిలుము వెలిగించుటకై నీరు నిప్పుల సృష్టించిన సద్గురునకు తుఫాను , దునిజ్వాలల నియంత్రించుట విశేషవిషయమా? జీవనప్రయాణంలో ఎదురయ్యే వేడిగాలులనుండి , గాలివానలనుండి భక్తుల సదాకాపాడే సద్గురునకు సహస్రకోటి వినమ్రప్రణామాలు! శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక ! అందరికి శుభమగుగాక ! ఓంసాయి శ్రీసాయి జైజై సాయి !
" To those men who worship Me alone thinking of no other to those ever self-controlled, I secure for them that which is not already possessed (Yoga) by them,and preserve for them what they already possess(Kshema)".The Holy Geeta:9:22.(" ఏ పరమభక్తులు ఇతర చింతలు లేనివారై, పరదైవమగు పరమాత్మనగు నన్ను ఎల్లప్పుడును ధ్యానించువారై సేవించుచున్నారో ,అట్లు సర్వకాలముల యందు సమాహిత చిత్తులైన వారియొక్క యోగక్షేమములను నేను వహించుచున్నాను " ).
🌸 Sacred English Translation (Soulful, Poetic, Devotional) 🌸
Śrī Sāyināthāya Namaha.
With rays of auspicious grace, Sai Baba illumines the hearts of devotees, awakening inner awareness.
Let us sanctify our lives by living His divine teachings.
Sri Sai Sandeshamrutam – Chapter 11
Just as water becomes a solid block of ice, and the same water transforms into formless vapor when heated,
so too the Universal Consciousness — the Divine Power — expresses Itself in both saguna (with form) and nirguna (formless) manifestations.
Since human beings naturally relate to concrete forms, the worship of God with form becomes easy and accessible.
Thus, Sai’s saguna-upāsana, the worship of the Sadguru as the visible form of the Supreme, is the path closest to the hearts of devotees.
Sai, though formless in His true essence, assumed a human form for the sake of devotees.
His qualities — patience, freedom from anger, straightforward conduct, serene nature, and ever-satisfied heart —
are divine pearls of wisdom offered for our understanding.
Great saints are like flowing rivers;
on their life-journey they offer peace, solace, and cool comfort to countless beings.
Sai, the indweller of all hearts, accepts the diverse services offered by devotees with love.
He never desired offerings or rituals, yet He cherished the innocent sandalwood service
performed by the simple doctor and the humble scholar.
Those free from likes and dislikes, pure in heart, become dear to Baba.
Though He embodied peace and forbearance,
at times He displayed righteous anger only for the ultimate good of His devotees.
But within Him always flowed the nectar of compassion — cool, serene, and infinite.
Once, an arrogant Haji sought to see Baba, boasting of his pilgrimage to Mecca–Madina.
Sai gently refused him entry.
Only nine months later, upon Shyama’s humble request, the Haji was allowed into the mosque.
Just as water cannot remain on the peak of a high mountain,
so too Baba never enters a heart filled with ego.
Through every act, He silently teaches humility.
The very creation of God is woven from the five elements.
In Shirdi, when a fierce storm terrified the villagers,
they ran to Baba for refuge.
With His mighty roar, Sai subdued the tempest and restored calm.
On another occasion, the burning flames of the Dhuni rose high enough to threaten the mosque.
People trembled in fear.
But Baba, with serene composure, gently struck a pillar with His satka
and the flames obeyed His command and receded.
For the Sadguru who could create fire from mere water
and kindle a lamp by sheer resolve,
what difficulty is there in silencing storms or calming blazing fires?
We offer a thousand million humble prostrations
to the Master who shields devotees from the scorching winds
and turbulent storms of worldly life!
May the rays of Sri Sai’s compassion shine upon all!
May auspiciousness prevail everywhere!
Om Sai Sri Sai Jai Jai Sai!
Bhagavad Gita 9:22
“To those who worship Me alone, thinking of none else,
to those who are ever steadfast,
I Myself secure what they lack and preserve what they possess.”

Comments
Post a Comment