శ్రీసాయిసందేశామృతము 13.

శ్రీసాయినాథాయనమః.సాయిబాబ తమ శుభసందేశాలనే కిరణాలతో భక్తుల హృదయాల్లో వెలుగులనింపి చైతన్యవంతం చేస్తున్నారు . బాబాసందేశాలనాచరిస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకుందాము.
శ్రీసాయిసందేశామృతము అధ్యాయము 13. బాబామాటలు క్లుప్తము , భావగర్భితము , అర్ధపూర్ణము , సమతూకము, మరియు శక్తివంతములు . శక్తివంతములెలాగో పరిశీలించెదము . నోటితో మాటవెలువడేముందు మనసులో ఆలోచనవస్తుంది , ఆ ఆలోచనను బుద్ధివిశ్లేషిస్తుంది , బుద్ధిని ఆత్మప్రకాశింపజేస్తుంది . అదియే భగవాన్ రమణమహర్షి పలుసంవత్సరములు పాటించిన మౌనస్థితి . ఆ స్థితి పరమపవిత్రము , అతి శక్తివంతము . బాబా సదా ఆత్మస్థితులుకావున వేరుచేసే ప్రతిచర్య , మాట్లాడే ప్రతిమాట ఆనిగూఢ ఆత్మశక్తిని సంతరించుకొంటాయి . అందులకే వారి ఆశీసులు , వారిచేతి విభూతి అంతటి మహిమాన్వితములు . బాబా దైవస్వరూపులైనప్పటికీ మానుషజన్మంబెత్తి తోటివారలతో కలిసి అతిసాధారణంగా జీవించారు. అందుకేనేమో అందరిలా తననూ మాయ పీడిస్తుందన్నారు . కాని బాబా మాయను జయించారనేది జగమెరిగిన సత్యము . భక్తులకుపయోగార్ధమై "హరినామ స్మరణ " ను మాయవిరుగుడు మందుగా బాబా చెప్పారు . నిరంతర హరిభజన చేయమన్నారు . అలా బోధిస్తూనే మరొక నిగూఢ విషయాన్ని వ్యక్తపరిచారు . అదేమన 'సాయి సాయి ' యని స్మరించెడివారల సప్తసంద్రముల మాయనుండి దాటించెదమన్నారు. అంటే సర్వపాపముల హరించెడి శ్రీహరి కార్యము తాము చేస్తారన్నమాట. కాని తాము శ్రీహరియని ఏమాత్రము చెప్పలేదు . ఇదేరీతిలో శిరిడీలో 1909వ సంవత్సరంలో పవిత్రగురుపూర్ణిమ పర్వదినమున ద్వారకామాయిలోని మూలస్తంభమును పూజింపమని భక్తులకు చెప్పారేగాని, తమనుపూజింపమని చెప్పకపోవడం నిచట ఆలోచింపదగిన విషయం . ఆపైన శ్యామామున్నగు భక్తులు బాబాకు నూతనవస్త్రములు సమర్పించి గురుపూజజేశారు . అప్పటినుండి ప్రతియేటా గురుపూర్ణిమ మహోత్సవము ఘనంగా కొనసాగుతుంది . బాబాను మనసా , వాచా , కర్మణా భక్తితో సేవిస్తే చాలు , ఎలాంటి బాహ్య పూజాతంతులతో పనిలేదు . నారాయణగామ్ నివాసి భీమాజీపాటిలు తీవ్ర క్షయవ్యాధి పీడితుడు, తనజీవితంపై ఆసవీడి దైవాన్నిప్రార్ధించాడు . దైవసహాయం స్నేహితులద్వారాకూడ లభిస్తుంది . తనబాధతెలుపుచు భీమాజీ బాబాభక్తుడు నానాసాహెబ్ చాందోర్కరునకు లేఖవ్రాయ, అతడు బాబాను శరణువేడమని జాబువ్రాసాడు . ఆపై భీమాజీ బాబానుదర్శించి తనరోగనివారణకై శరణువేడాడు . బాబాహృదయం ద్రవించి ఆశీర్వదించారు . పిదప రెండుస్వప్నాలలో బాధననుభవించి రోగముక్తుడైనాడు పాటీలు . పాటీలు కొండంత కర్మదోషాన్ని కేవలం కలలబాధరూపంలో అనుభవింపజేసి పాపకర్మను హరించారు . ఈవిషయమై తామే దైవమని చెప్పక , కేవలం దయగల ఫకీరుగా పేర్కొనడం వారి నిరహంకారభావానికి తార్కాణం . భక్తులనుండి బాబా ఆశించేది వారి ప్రేమను , కృతజ్ఞతను . భక్తులెల్లరకు ఇవి ఆదర్శ సూచకకములు . తన గ్రామం జేరిన పాటీలు వెంటనే సత్యనారాయణస్వామి వ్రతమునకు బదులుగా సాయిసత్యవ్రతాన్ని ప్రారంభించాడు . బాబాయే సత్యనారాయణస్వామి యనెడి భావమిచట మదిలో మెదలాడుతుంది . మరికొందరిభక్తుల రోగనివారణములు ప్రస్తుత అధ్యాయంలో వివరింపబడ్డాయి . బాబా మాటననుసరించి బాలాషింపి యనునతడు లక్ష్మీమందిరం వద్ద నల్లకుక్కకు పెరుగన్నము పెట్టి మలేరియా జ్వరంనుండి ముక్తుడయ్యాడు . కలరాసోకిన బూటీ బాబాసూచనచే నానబెట్టిన బాదాం పిస్తాలను పాలలో ఉడికించి తినగా వాని కాలరావ్యాధి దూరమయ్యింది . కడుపునొప్పి పీడితుడు ఆళందిస్వామి బాబా అశీసులతో స్వస్థత పొందాడు . వేరుశనగపప్పు తినిపించి కాకాజని నీళ్ళవిరేచనాల కట్టించారు సాయి . ఇదేరీతి హార్దా గ్రామవాసి దత్తోపంతు బాబా ఆశీసులచే కడుపునొప్పి పోగొట్టుకున్నాడు . శ్యామా బాబాకరుణచే మూలవ్యాధి ముక్తుడయ్యాడు . ఈఅధ్యాయంలో చెప్పబడిన ఘటనలు రెండువిషయముల ధ్రువీకరిస్తున్నాయి . బాబా తమమహిమచే పాతమజీదును సర్వదేవీదేవతల దేవాలయముగను, భక్తుల వివిధ వ్యాధుల బాధల తొలగించి వైద్యాలయముగను రూపొందించారు . నిత్యం గోధుమలు విసరుచు , ధుని మండించుచు భక్తుల పాపకర్మలనుండి ముక్తులజేశారు . బాబాలీలలు నిత్యనూతనములు , కాలనియమంలేని నిరంతర ఘటనలు ! శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక ! అందరికి శుభమగుగాక ! ఓంసాయి శ్రీసాయి జై జై సాయి !
"Verily,none can ever remain,even for a moment ,without performing action; for, everyone is made to act helplessly, indeed, by the qualities born of PRIKRITI".It is implied that the diseases and pains of life happen as per the results of their actions". The Holy Geeta: 3:5. ( ఎవడును ఎప్పుడును క్షణకాలమును కర్మనాచరింపక యుండజాలడు. ప్రతివాడును స్వభావమువల్ల గలిగిన (ప్రకృతిజన్యములైన ) సత్వ రజ స్తమో గుణములచేత నస్వతంత్రుడై వాటికి లొంగి కర్మమును జేయుచునే యున్నాడు.వ్యక్తులకు గలిగెడి వ్యాధులు , బాధలు వారివారి కర్మఫలములుగా నెరుగవలెను ) . గీత : 3:5.

Comments

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

అధ్యాత్మరామాయణము : అహల్యస్థుతి.