శ్రీసాయిసందేశామృతము 16,17.

శ్రీసాయినాథాయనమః . సాయిబాబ తమ శుభసందేశాలనే కిరణాలతో భక్తుల హృదయాల్లో వెలుగులనింపి చైతన్యవంతం చేస్తున్నారు . బాబాసందేశాలనాచరిస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకుందాము.
శ్రీసాయిసందేశామృతము : అధ్యాయములు 16,17.శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ తనను నాలుగువిధములగు భక్తులు ఆశ్రయిస్తారని అర్జునునకు బోధించాడు . వారు వరుసగా 1)ఆర్తి (ఈతిబాధలనుండి ముక్తికోరువాడు ), 2) అర్ధార్ధి (ధనసంపదల కోరువాడు ), 3)ముముక్షు (దైవాన్నిగూర్చి తీవ్రముగా యోచించువాడు ) , 4) జ్ఞాని ( ఆత్మజ్ఞానముననుభవించుయోగిపుంగవుడు). అదేక్రమంలో సద్గురుసాయిబాబాను చతుర్విధభక్తులు ఆశ్రయించేవారు . ప్రస్తుత అధ్యాయములలో ఓ ధనవంతుడు ఆత్మజ్ఞానప్రాప్తికై సాయిని ఆశ్రయించిన విషయము చెప్పబడినది . భాగ్యవంతుడైనప్పటికీ వచ్చినవాడు బహుపిసినారి . రానూపోనూ టాంగాను బాడుగకు కట్టించుకొని శిరిడీ వచ్చాడు . బాబాకునమస్కరించి తనకు వేగిరం బ్రహ్మజ్ఞానము జాపమని తొందరజేయసాగాడు . వాని కోరికకు సంతసించిన బాబా ఓ బాలుని పిలిచి 5 రూపాయల అప్పునకై వేరువేరు మార్వాడి ఇళ్లకు పంపారు . కాని అప్పుపుట్టక ఆబాలుడు వట్టిచేతుల తిరిగివచ్చాడు . ఈతతంగాన్ని చూస్తున్న ధనికుడు మిన్నకున్నాడుగాని తనడబ్బునివ్వ సిద్ధపడలేదు , పైగా బ్రహ్మజ్ఞానము పొందుటకు తొందరపెట్టసాగాడు . అందులకు బాబా బ్రహ్మజ్ఞానప్రాప్తికై ఐదు వస్తువుల సమర్పణమవసరమన్నారు . అవి పంచప్రాణములు , పంచేంద్రియములు , మనసు , బుద్ధి మరియు అహంకారము.బాబా తనబోధనుకొనసాగిస్తూ బ్రహ్మజ్ఞానప్రాప్తికి మరిన్ని దైవగుణములావశ్యతను గూర్చి తెలియజెప్పారు . వరుసక్రమంలో అవి , 1) ముముక్షుత, 2)విరక్తి , 3) అంతర్ముఖుత , 4) పాపవిమోచన, 5) సరియగు ప్రవర్తన, 6) ఇష్టమైనవిగాక ప్రయోజనకరమైన వానిని కోరుట, 7) చంచలమనసును , ఇంద్రియములను స్వాధీనపరచుకొనుట, 8) పవిత్రమగు మనసును కలిగియుండుట, 9)సద్గురుని శరణువేడుట, 10) తుదకు భగవంతుని కటాక్షము . పిసినారి ధనికుని అంతరంగమెరిగిన బాబా వాని జేబులో బ్రహ్మము యాబదింతలు 5 రూపాయల నోట్లరుపానున్నది , బయటకు తీయమన వాడట్లేజేసి లెక్కింప సరిగా 25 పదిరూపాయల నోట్లున్నాయి . ఈఘటన తిలకించిన యచటివారందరు బాబా సర్వజ్ఞత సమయస్ఫూర్తికి మిగుల విస్మయమందారు. ఎవడు ధనపుత్ర భోగాదుల, కోర్కెల మునిగి , పేరాసను విడువడో వానికి బ్రహ్మజ్ఞానము లభించుట దుర్లభమని యిచటి బాబా సందేశము . అన్నికాలాలవారికి వర్తిస్తుందీ బాబా ధనికునిపరంగా చెప్పిన సందేశం! బాబావద్ద ఆత్మజ్ఞాన ఖజానా పొంగిపొరలుచున్నను, అర్హత కలిగేవరకు పొందలేము . ధనికునితోపాటు మజీదునున్న యితరులు బాబాబోధామృతమును ఆస్వాదించి సంతుష్టిచెందారు . భగవద్దర్శనానికి ధనము మిగుల అడ్డుగోడగా శ్రీరామకృష్ణ పరమహంస బోధించారు . భగవాన్ రమణమహర్షి కేవలం కౌపీనధారణ జేసెడివారు . బాహ్యసంపదల మోహాశక్తి బలహీనపడనంతవరకు, దైవశక్తి వ్యక్తిని ఆశ్రయించదనే సత్యమును అనాదినుండి ఋషులు ఘోషిస్తున్నారు . సూదిబెజ్జమునుండి ఒంటె వెళ్లగలదేమోగాని ధనపిపాసి దైవాన్ని దర్షింపలేడనే జీసస్ క్రిస్తు బోధ ఎంతటి నిజమో ! శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక ! అందరికి శుభమగుగాక ! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి !
" " ఓ అర్జునా ! దైవాంశమందు పుట్టినవారికి అభయము, సత్త్వసంశుద్ధి , జ్ఞానయోగవ్యవస్థితి , దానము , దమము , యజ్ఞము , స్వాధ్యాయము , తపస్సు , ఆర్జవము , అహింస , సత్యము , అక్రోధము , త్యాగము , శాంతి , అపైశునము (చాడీలు చెప్పకుండుట ) , సమస్తప్రాణులయెడ కరుణ , ఆలోలత్వము , మార్దవము , హ్రీ (లజ్జ ) , అచాపలము , తేజస్సు , క్షమము , ధృతి , సౌచము , అద్రోహము , అనతిమానిత్వము అనగా గర్వరాహిత్యము - అను దైవధనము గలుగుచున్నది . ఇవియన్నియు దైవగుణములు . " భగవద్గీత : 16:1,2,3. ( The following 26 qualities belong to the one born for the Divine Estate O Arjuna! Fearlessness,purity of heart, steadvfastness in the Yoga-of-knowledge,alms-giving,control of the senses. sacrifice,study of the Sastras,straitforwardness, harmlessness,truth,absense of anger,renunciation,peacefulness,absence of crookedness, compassion to beings, non-covetousness, gentleness, modesty, absense of fickle-mindedness,vigour, forgiveness, fortitude, purity,absence of hatred and absence of pride ).

Comments

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

అధ్యాత్మరామాయణము : అహల్యస్థుతి.