శ్రీసాయిసందేశామృతము : 18,19 (Nectar of Sri Sai's message 18,19).
శ్రీసాయినాథాయనమః .సాయిబాబ తమ శుభసందేశాలనే కిరణాలతో భక్తుల హృదయాల్లో వెలుగులనింపి చైతన్యవంతం చేస్తున్నారు . బాబాసందేశాలనాచరిస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకుందాము.
శ్రీసాయిసందేశామృతము : అధ్యాయములు 18,19. శ్రీసాయిసచ్చరిత్ర పావన పారాయణగ్రంథానికి హృదయస్థానంలాంటివీ రెండధ్యాయములు . ఇందు బాబా బోధించిన పలుముఖ్యసందేశాలు చెప్పబడినవి . ఈబోధలు భక్తులనిజజీవితములకు ఆచరణయోగ్యములు , సుఖశాంతులసోపానములు . బాబాబోధలు రహస్యములుగావు . అనుభవానంతరము యితరులకు వెల్లడింపవచ్చని ప్రారంభమున చెప్పబడినది . సాఠేయను యాతడు తనవ్యాపారంలో విశేషంగా నష్టపోయి వికలమనస్కుడయ్యాడు . దైవవశమున వాని మిత్రులు బాబాను దర్శింపమని సలహానివ్వ యాతడట్లే బాబాసన్నిధిజేరి పరమశాంతిని పొందాడు . పట్టుదలగల సాఠే 7 రోజుల గురుచరిత్ర పారాయణము పూర్తిజేయ, ఆరాత్రి బాబా స్వప్నదర్శనమిచ్చి మరొకవారము పారాయణ జేయవలెనని దీక్షితుద్వారా సందేశమిచ్చారు . సమీపమున బాబానుసేవిస్తున్న హేమాద్రిపంత్ బాబామాటలు విని మిగులవ్యాకులపడ్డాడు . ఎప్పటినుండో సేవిస్తున్నాయతనికి కలుగని బాబా దయను సాఠే కేవలం 7 రోజులలో పొందాడని యసూయపడ్డాడు. పంతు మనసుచదివిన బాబా వానిని శ్యామా యింటికి పంపి 15 రూపాయల దక్షిణ తెమ్మన్నారు . శ్యామా యింటికెళ్లిన పంతు , శ్యామా పూజలోనుండుటచే అచటి ఎకనాథభాగవతము తెరచి తానానాడు ఇంటివద్దపూర్తిజేయని భాగవతపారాయణమును ముగించాడు . పూజముగియ తననుజేరిన శ్యామాను బాబాలీలల ముచ్చడింపమన, యాతడు తన మదిలోమెదిలిన భక్తురాలి యనుభవం వివరించాడు . శ్రీమతి రాధాబాయి దేశముఖ్ శిరిడీలో బాబానుండి ఉపదేశమాశించి ఆమరణ ఉపవాసమారంభించినది . మూడురోజులపిమ్మట ఆమెను బాబా పిలిపించి హితబోధజేశారు. సంగ్రహంగా ఈబోధ యేమనభగవంతుని జేరుటకు ఎలాంటి ఉపదేశపు ఆవశ్యకతలేదు . కేవలము తానువిశ్వసించిన సద్గురుని పరిపూర్ణశరణాగతితో సేవించాలి . ఇందులకు తమకథనే ఉదహరించారు . సాయి ఉపదేశమాశించి తమగురునికి శ్రద్ధా సహనములనెడి రెండు రూకల దక్షిణిచ్చి 12 సంవత్సరములు సేవించారు . నిరంతరం వారిపైనే దృష్టి , వారిపైనే ధ్యానము. కాని వారిగురువెలాంటి మంత్రోపదేశం చేయలేదు,కేవలం తమ ప్రేమామృతమును కురిపిస్తూ పెంచిపెద్దజేశారు . ఏవిధంగా తాబేలు తనబిడ్డలను కేవలం కంటిచూపుతో పోషించినటుల గురువు తనను కరుణప్రేమలతో కాపాడారు . అలా ఎలాంటి ఉపదేశముపొందని తాము యితరులకేవిధంగా మంత్రోపదేశం చేయగలమని నమ్మబలికారు . ఇచటి బాబా బోధించిన సందేశం కేవలం ఆ భక్తురాలికేకాదు , ఆమెను నెపంగాజేసి లోకమంతటికిజేసిన హితబోధ . తృప్తిచెందిన భక్తురాలు రాధాబాయి బాబాకు ప్రణమిల్లి ఉపవాసదీక్షను విరమించినది . ఈ కథవిన్న హేమాద్రిపంతు హృదయం పులకరించింది . సద్గురుని సర్వస్యశరణాగతి పొందుటయే అంతిమ ఉపదేశమనేసత్యాన్ని శ్యామా ద్వారా గ్రహించాడు . బాబాసందేశానికి శ్యామా ఓ నిమిత్తమాత్రుడే ! పిదప పంతు శ్యామాతోపాటు మజీదుకు వెళ్ళాడు . ఆదిమధ్యాన్న ఆరతి సమయం . తానువిన్న కథను, గ్రహించిన సందేశాన్ని బాబాకు పూసగుచ్చినటుల వివరించాడు . ఆరతి ముగిసినపిమ్మట జోగు బాబాచేతిలో కలకండ ప్రసాదముంచ, దానినంతను పంతుకిచ్చారు సాయి . ఆవిధంగా రచయితపంతుకు సందేశము ప్రసాదము రెండూ లభించాయి . అది సాయిభక్తులందరికీ వర్తిస్తుంది . సద్గురునిపై భక్తిశ్రద్ధలు , నిరంతర ధ్యానం , సర్వస్యశరణాగతులే సాయిపంచిన తీయని కలకండ ప్రాప్తికి అర్హతలుగా గ్రహింపగలము . బాబానుండి మరొకసందేశరత్నమేమన వ్యక్తులమధ్యనుండెడి ఋణానుబంధము . ఇద్దరువ్యక్తులు కలవడం కేవలం కాకతాళీయం కాదు . ఏదోతెలియని గతకాలబంధంచేత మనుషుల కలయిక ఏర్పడుతుంది . కావున దరిజేరినవారిని నిరాదరింపక ఒకరికొకరు తోడ్పడి ప్రేమించి సంతోషంతో జీవించాలి . అన్నార్తులకు అన్నము , నిరుపేదలకు బట్టలు సమకూర్చిన సర్వేశ్వరుడు సంతోషిస్తాడు . భక్తుల హృదయాలలో సత్సంకల్పాల గలిగిస్తారు సాయి, ఆపై అవి కార్యరూపం దాల్చుతాయి . మరునాడు గురువారమంతా రామనామస్మరణజేయ తలచాడు హేమాద్రిపంతు . మరుసటి ఉదయం లేవగనే రామనామం జ్ఞప్తికివచ్చింది . బాబాను చూడ మజీదువైపుకు బయలుదేరిన వానికి దారిలో శ్రావ్యమైన రాముని పాటవినబడినది . అది ఏకనాథ్ మహారాజ్ రచించిన చక్కని భక్తిగానం . తలచినవిధంగా ఆరోజంతా రామనామస్మరణచే కాలంగడిపాడు పంతు. మరొక బాబా ఉపదేశం పరనిందగూర్చి . అందరిలో దైవమున్నాడని తెలియ వ్యక్తి ఇతరులనెలా దూషింపగలడు? ఆ దూషణ దైవదూషణగదా ! అలానిందించినవ్యక్తి రెండవవాని పాపములగ్రహించి తాను మలినమైపోతాడు , ఆవ్యక్తి ముక్తుడౌతాడు ! బాబా వేరువేరు భక్తులకు వారివారి స్వభావాన్ననుసరించి వేర్వేరు సలహాలిచ్చెడివారు, అందరికీ ఒకే ఔషధం పనిచేయనివిధంగా . మరొక మహత్తర విషయమేమన తమ ఆచరణనే బోధగా జేసిడివారు బాబా ! నిచ్చెనదెచ్చిన చిన్నపనికి రెండురూపాయలిచ్చారు . పనికితగిన ప్రతిఫలమివ్వడమే సాయి సందేశం . బాబానేవిధంగా ధ్యానించాలి ? ఈవిషయమై బాబాయే స్వయంగా చెప్పినమాటలు," సదా నానిరాకార స్వభావమును ధ్యానింపుము . అదియే జ్ఞానస్వరూపము , చైతన్యము ,ఆనందము . మీరిది చేయలేనిచో రాత్రింబవళ్లు మీరు చూచుచున్న నా యీఆకారమును ధ్యానించుడు! అట్లు కొన్నాళ్ళు చేయగా ధ్యానించువాడు చైతన్యముతో నైక్యమై బ్రహ్మముతో నభిన్నమగును". బాబా తమకు తమవిగ్రహానికి , చిత్రానికి ఏమాత్రం తేడాలేదనే యనుభవాన్ని పలుభక్తులకు కలిగించారు . కావున భక్తుల గృహములలోని ప్రతిమకు , చిత్రపటానికి భక్తిశ్రధ్ధలతోజేసిన పూజ బాబాకే చెందుతుంది, బాబా ప్రీతిచెంది తప్పక అనుగ్రహిస్తారు !
శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక ! అందరికి శుభమగుగాక ! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి !
"ఎవరు నాయందు మనస్సు నిలిపి, నిరంతర సమాహిత చిత్తులును, మిక్కిలి శ్రద్ధతో గూడిన వారునై నన్నుపాసించుచున్నారో అట్టివారు యోగులలో శ్రేష్ఠులు. వారు నాకు సమ్మతులు ". భగవద్గీత : 12:2. (" Those who, fixing their mind on Me, worship Me, ever steadfast and endowed with Supreme faith, these, in my opinion, are the best in yoga". The Holy Geetha: 12:2.). " అసురగుణములందు పుట్టినవానికి డంబము , గర్వము , దురభిమానము ,కోపము , వాక్పారుష్యము , అనగా పరులను పీడించే లాగున వచించెడి స్వభావము , వివేకజ్ఞాన హీనతయు గలుగుచున్నది . ఇది అసుర సంపద గలవారి లక్షణములని భావము " . భగవద్గీత : 16-4. (" Hypocricy,arrogance and self-conceit,anger,and also hardness and ignorance, belongs to one who is born, O Partha, for a demoniac- Estate"). The Holy Geeta: 16:4. " తత్వవేత్తలైన ఆత్మజ్ఞానులు నీకు జ్ఞానము నుపదేశింపగలరు . అట్టి జ్ఞానమెట్లుకలుగుననిన, వినయముతో చేయు నమస్కారముతోడను, సమయమును కనిపెట్టి యడుగుటచేతను గుర్వాజ్ఞను పాటించుటచేతను వారు చెప్పగలరు " . భగవద్గీత : 4:34. ( " Know that by long prostration,by question, and service, the "Wise" who have realized the Truth will instruct you in (that) ' Knowledge' ). The Holy Geeta: 4:34.
Śrī Sāyināthāya Namaḥ
Sai Baba, through the radiant rays of His auspicious messages, illumines the hearts of devotees and awakens them to higher consciousness. Let us live by Baba’s teachings and thereby make our lives truly fulfilled and meaningful.
**The Nectar of Sai’s Message
(Śrī Sai Sandeśāmṛtam – Chapters 18 & 19)**
Chapters 18 and 19 of the sacred Śrī Sai Satcharitra occupy a place akin to the very heart of this holy text. They contain several profound teachings of Baba—teachings that are practical for everyday life and serve as steps leading to peace and happiness. Baba’s teachings are not secret doctrines; it is stated at the very beginning that, once realized through experience, they may be shared with others.
Sāṭhe, a determined devotee, suffered heavy losses in business and became deeply distressed. By divine will, his friends advised him to seek Baba’s darśan. Obeying them, he came to Baba and attained supreme peace. With steadfast resolve, Sāṭhe completed a seven-day Guru Charitra parāyaṇa. That very night, Baba appeared to him in a dream and, through Dīkṣit, conveyed the message that he should undertake another week of parāyaṇa.
Hearing this, Hemādripaṇṭ (Hemadpant), who had long been serving Baba, felt troubled. He wondered how Sāṭhe had received Baba’s grace in just seven days, while he himself, despite long service, had not experienced such favor. Baba, who reads the hearts of all, sent Hemadpant to Śyāmā’s house to bring fifteen rupees as dakṣiṇā.
When Hemadpant reached Śyāmā’s house, he found Śyāmā engaged in worship. An Ekanātha Bhāgavata lay open there. Hemadpant completed the portion of the Bhāgavata reading that he himself had once left unfinished at home. After the worship concluded, Baba’s līlās were discussed, and Śyāmā narrated an experience concerning a devoted woman that had deeply moved him.
Radha Bai’s Lesson
Śrīmatī Rādhābāi Deśmukh came to Shirdi longing for spiritual instruction from Baba. When no direct upadeśa was given, she undertook a vow of lifelong fasting. After three days, Baba summoned her and gave her gentle, compassionate counsel.
In essence, Baba taught that no special instruction is required to attain God. One needs only to serve one’s chosen Sadguru with complete surrender and unwavering faith. Baba illustrated this truth through His own life. Seeking spiritual instruction, He had served His Guru for twelve years, offering as dakṣiṇā the two coins of śraddhā (faith) and sabrī (patience). His gaze and meditation were fixed solely on His Guru. Yet His Guru gave Him no mantra or formal teaching—only showered Him with the nectar of pure love, nurturing Him to spiritual maturity.
Just as a tortoise nourishes its young merely through its loving gaze, so did Baba’s Guru protect and guide Him with compassion. Baba humbly declared that since He Himself had received no formal instruction, how could He bestow mantras upon others? This teaching, though delivered to Rādhābāi, was meant for the entire world.
Fully satisfied, Rādhābāi bowed to Baba and gave up her fast.
The Heart Awakens
Hearing this account, Hemadpant’s heart overflowed with joy. Through Śyāmā, he realized the supreme truth that total surrender to the Sadguru is the ultimate teaching. Śyāmā was merely an instrument in conveying Baba’s message.
Later, Hemadpant went with Śyāmā to the Masjid. It was the time of the midday ārati. Like offering a garland of flowers, Hemadpant placed before Baba the story he had heard and the message he had understood. After the ārati, Jogu placed crystallized sugar (kalkand) in Baba’s hand, and Baba gave it all to Hemadpant as prasād. Thus, the author received both the message and the prasād.
This truth applies to all Sai devotees. Devotion filled with faith, constant remembrance, and complete surrender to the Sadguru are the qualifications to receive Baba’s sweet kalkand of grace.
Other Precious Teachings of Baba
Another jewel of Baba’s teaching concerns the bonds of karmic debt between people. The meeting of two individuals is never mere coincidence; it is shaped by unseen ties from past lives. Therefore, one should never disrespect those who come into one’s life, but instead support one another with love and live joyfully.
The Lord is pleased when food is given to the hungry and clothing to the poor. Sai instills noble intentions in devotees’ hearts, which later manifest as noble actions.
One Thursday, Hemadpant resolved to spend the entire day chanting the name of Rama. Upon waking the next morning, the name of Rama spontaneously arose in his mind. As he walked toward the Masjid to see Baba, he heard a melodious devotional song of Rama—composed by Ekanātha Maharaj. Thus, his entire day passed in Rama-nāma smaraṇa, just as he had wished.
Another of Baba’s teachings concerns slander. How can one who knows that God dwells in all beings speak ill of others? Such slander is nothing but slander of God. The one who criticizes another takes on that person’s sins and becomes tainted, while the one criticized is purified and liberated.
Baba would give different advice to different devotees, according to their nature—just as the same medicine does not cure all ailments. Another great truth: Baba taught primarily through His own conduct. For a small task involving a ladder, He paid two rupees, emphasizing that fair recompense for work done is itself a sacred principle.
How Should One Meditate on Baba?
On this subject, Baba Himself said:
“Always meditate on My formless nature. That is the essence of knowledge, consciousness, and bliss. If you are unable to do so, then meditate day and night on this form of Mine that you see before you. By practicing thus for some time, the meditator will merge with consciousness and become one with Brahman.”
Baba gave many devotees the direct experience that there is no difference whatsoever between Him, His idol, and His photograph. Therefore, worship offered with faith and devotion to Baba’s image or picture in one’s home reaches Baba Himself. Pleased, Baba will surely bestow His grace.
Blessings
May the rays of Śrī Sai’s compassion spread upon all.
May auspiciousness befall everyone.
Om Sai Śrī Sai Jai Jai Sai!
Scriptural Affirmations
“Those who fix their minds on Me and worship Me with unwavering devotion and supreme faith—I consider them the highest of yogis.”
— Bhagavad Gītā 12:2
“Hypocrisy, arrogance, pride, anger, harshness, and ignorance—these belong to those born with demoniac tendencies.”
— Bhagavad Gītā 16:4
“Know the Truth by humble prostration, sincere questioning, and devoted service; the wise who have realized the Truth will impart knowledge to you.”
— Bhagavad Gītā 4:34
🙏


Comments
Post a Comment