శ్రీసాయిసందేశామృతము : 24
శ్రీసాయినాథాయనమః . సాయిబాబ తమ శుభసందేశాలనే కిరణాలతో భక్తుల హృదయాల్లో వెలుగులనింపి చైతన్యవంతం చేస్తున్నారు . బాబాసందేశాలనాచరిస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకుందాము.
శ్రీసాయిసందేశామృతము : అధ్యాయము 24. బహువిధముల తమసందేశాన్ని భక్తులకందిచెడివారు బాబ. కొన్ని సందర్భాలలో వారిబోధ అతిసున్నితముగను, హాస్యసమ్మిళితముగను వినువారలకు వినోదము కల్గించేది . ప్రస్థుత అధ్యాయంలో రచయిత హేమాద్రిపంతు తన స్వానుభవాన్ని వివరించాడు . ఆరోజు ఆదివారము , సంతరోజు . పంతు బాబాపాదసేవ చేయుచుండగా పక్కనున్న శ్యామా వాని చొక్కాచేతులు తట్టాడు . వెంటనే చొక్కామడతలనుండి శనగలు నేలరాలాయి . అదొక దైవలీల , పంతుకుతెలియకుండా శనగలు రాలడం . శనగల సృష్టి బాబాలీల యేల కాకూడదు ? బాబా తమచర్యద్వారా భక్తులకో సందేశాన్నిస్తున్నారని తలంపవచ్చును . ఈఘటనను సాకుగాజేసి అన్నాసాహెబుకు తానొక్కడే తినెడి దుర్గుణమున్నదని చురకవేసారు . ఈవిషయమై తాను అమాయకుడనని, పక్కవారలకుపెట్టక తానెన్నడూ తిననన్నాడు . దానికి ప్రతిగా ఎవరూలేనపుడు తాను వానితో లేనా , ఆ ఎరుకకలిగి తనకు అర్పిస్తున్నావాయని బాబా ప్రశ్నించారు . ఇది కేవలం అన్నాసాహెబునకు వేసిన ప్రశ్నకాదు, భక్తులెల్లరకు వర్తిస్తుంది . నమ్మినభక్తుల హృదయాలలో వసించెడిబాబాను ఎందరు గుర్తించి తదనుగుణంగా వ్యవహరిస్తున్నారు ? పోలీసు సమ్ముఖమున ఏవ్యక్తి దొంగతనం చేయలేని చందాన !
బాబాను గాఢంగా విశ్వసించేభక్తులు చాలమెళకువతో నడచుకొంటారు . చేసే ప్రతిపనీ , ప్రతిఆలోచనా ముందు బాబాకర్పిస్తారు. ఆ ఎరుకతో జేసెడి ప్రతివిషయం పవిత్ర అర్పణ , ఆవిధంగా వ్యక్తియొక్క అంతరంగం పరిశుద్ధమై దైవానికి దగ్గరవుతాడు . అదే బాబా ఆశించెడి నివేదన , దక్షిణ . ఇదేవిషయాన్ని సుదాముని కథద్వారా మరొక్కసారి ధృవరిచాడు పంతు. సమీపానున్న దేవుని కర్పించక తాను తిని , ఆపై అసత్యములాడి బహుకష్టములపాలయ్యాడు సుదాముడు . పిమ్మట భార్యజేసిన యటుకుల నర్పించి భగవంతుని కరుణతో భాగ్యవంతుడయ్యాడు బాల్యమిత్రుడు సుదాముడు . భక్తులెందరో అన్నిబోధనామార్గాలు ! ఎవరికినచ్చినవిధంగా వారు దైవాన్ని సేవించుకోవచ్చును . అనుకరణలకుగాని, పోటీలకుగాని తావులేదు . ఈసందేశాన్ని అణ్ణాచించణీకర్ మరియు మావిశీబాయి సంఘటనలద్వారా భక్తులకందించారు సాయిబాబ! వారికి నచ్చినవిధంగా జేసెడి సేవలను పూర్తిగా స్వీకరించారు సాయినాథులు . శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక ! అందరికి శుభమగుగాక ! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి !
" నాయందు చిత్తము గలవాడవును , నాయందు భక్తి గలవాడవును , నన్నే నమస్కరించువాడవు నగుము. సకలమును నాయందు సమర్పించితివేని, తప్పక నన్నేపొందెదవు . నా కిష్టుడవైనందున నీకు సత్యముగా ప్రతిఙ్ఞజేసి చెప్పుచున్నాను . " భగవద్గీత : 18 : 65. ( " Fix your mind upon Me; be devoted to Me; sacrifice for Me; bow down to Me; you shall come surely then to Me alone; truly I promise to you (for) you are dear to Me." The Holy Geeta: 18:65.)
Comments
Post a Comment