శ్రీసాయిసందేశామృతము - 25

శ్రీసాయినాథాయనమః . సాయిబాబ తమ శుభసందేశాలనే కిరణాలతో భక్తుల హృదయాల్లో వెలుగులనింపి చైతన్యవంతం చేస్తున్నారు . బాబాసందేశాలనాచరిస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకుందాము.
శ్రీసాయిసందేశామృతము : అధ్యాయము 25. భక్తికి వశుడు , పరవశుడు శ్రీసాయిబాబ. భక్తితీవ్రతకు అనుగుణంగా అనుభవాల ప్రసాదిస్తారు బాబ. భక్తికి గాఢమైన విశ్వాసం పునాదిరాయి . పిందస్థాయిలో రాలిపోక, పరిపక్వతచెందిన ఫలస్థాయివరకు భక్తుడు తన విశ్వాసాన్ని తప్పక కొనసాగించాలి . నమ్మినభక్తుల యోగక్షేమములనెలా బాబా పరిరక్షిస్తారనుటకు చక్కని యుదాహరణము దాము అన్నా కథ . మిత్రులసలహాపై ప్రత్తి ధాన్యవ్యాపారముల జేయదలచిన దాము అన్నాను ఆప్రయత్నమునుండి విరమింపజేసి పెక్కునష్టములనుండి వాని కాపాడారు బాబ. ఈవిషయమై బాబా సలహాకొరకు దాము వ్రాసిన జాబును శ్యామా చదువకమునుపే అందలివిషయమెరిగి వ్యాపారముల విరమింపజేయుట సాయిబాబ సర్వజ్ఞతకు, భక్తులయెడగల ప్రేమకు చక్కని యుదాహరణ . బాబా నివారింపకున్న నానా బహునష్టముల పాలయ్యెడివాడు . ఇద్దరు భార్యలున్నను సంతానహీనుడు దాము. జ్యోతిష్యులు వాని సంతానలేమిని ధృవీకరించారు . కాని బాబా ఆశీసులతో వానికి బహుబిడ్డలు కలిగారు . గ్రహబలాన్ని మించినది బాబా యనుగ్రహబలము . సమాధిచెందినపిమ్మటకూడ తమ ఎముకలు మాట్లాడతాయని బాబాచెప్పిన మాటలు నిత్యసత్యములు . ఖండఖండాంతరముల వారిభక్తులు దినదినాభివృద్ధిచెందుట వారిభవిష్యవాణికి సాక్షిభూతము . మనసును పరిపరివిధముల పక్కదారులకు మల్లింపక ఏకాగ్రచిత్తమును నిలిపినవారల వెన్నంటినడుస్తారు బాబా . భక్తులనుండి బాబాఆశించేది అట్టి ప్రగాఢవిశ్వాసాన్నే ! పిందెలా మధ్యలో రాలిపోవద్దని భక్తులందరికీ దాము అన్నా ద్వారా సందేశమిచ్చారు సాయినాథులు! సందేశాన్ని పాటించాడుకావునే యాతని అన్నివేళలా కాపాడారు బాబ. పెక్కుకుటుంబ కష్టములు సంభవించినప్పటికీ సాయిబాబ యనుగ్రహంచే వాటిచే మనోవికలత చెందక అనుకూలతలపొందాడు ధన్యజీవి దాము అన్నా ! ఇంతకూ బాబా కృపపొందుటకు దాము అన్నా జేసిన పుణ్యకార్యములేమిటి ? శిరిడీలో 1897 నుండి శ్రీరామనవమినాడు జరుగు ఉరుసు యుత్సవమునకు అలంకరించిన పతాకమొకటి కానుకగా నిచ్చెడివాడు, మరియు ఉత్సవమునకు వచ్చు బీదలకు అన్నదానముజేసెడివాడు . వాని పిమ్మట యాతని వంశీయులాసాంప్రదాయమును కొనసాగిస్తున్నారు.
శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక ! అందరికి శుభమగుగాక ! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి !
" ఎవరు నాయందు మనస్సు నిలిపి, నిరంతర సమాహిత చిత్తులును , మిక్కిలి శ్రద్ధతో గూడిన వారునై నన్నుపాసించుచున్నారో అట్టివారు యోగులలో శ్రేష్ఠులు , నాకు సమ్మతులు . " భగవద్గీత : 2: 2. (" Those who, fixing their mind on Me, worship Me ever steadfast and endowed with Suprme faith, these in My opinion, are the best in Yoga.") The Holy Geeta: 12: 2.

Comments

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

అధ్యాత్మరామాయణము : అహల్యస్థుతి.