శ్రీసాయిసందేశామృతము 27 (Nectar of Sri Sai's message 27).
శ్రీసాయినాథాయనమః !
శ్రీసాయిసందేశామృతము : అధ్యాయము 27. సద్గురుసాయిసమర్థుల నోటినుండి వెలువడిన మాటలే మంత్రాలై భక్తుల రోగముక్తులజేసెడివి. అదిగురువాక్య మహిమ . అదేశక్తి వారి హస్తస్పర్శలోను ప్రవహించేది . వారుతాకిన గ్రంథాలు పవిత్రమయ్యెడివి . కావున భక్తులు పారాయణకుముందు ఎకనాథభాగవతము , గీతారహస్యము మున్నగు గ్రంథాలను బాబాచేతిమీదుగ స్వీకరించేవారు . ప్రస్తుతాధ్యాయ ప్రధానాంశము ప్రసిద్ధ విష్ణుసహస్రనామ గ్రంధముగూర్చి . గ్రంధప్రాముఖ్యతను సన్నిహితభక్తుడు శ్యామాకువివరించి ఆపుస్తకమును తమచేతులుమీదుగా బహూకరించారు. ఆపుస్తకము రామదాసియను వేరొక భక్తునిది . అందులకై యాతడు జగడమాడగ నేర్పుగా సమాధానపరచారు బాబ. దేవనాగరిభాషనెరుగని వాడైనను బాబాదీవెనలచే గ్రంధముచదివి గొప్పప్రావీణ్యము సంపాదించాడు శ్యామా . భక్తులెల్లరు పఠించి ప్రయోజనముపొందవలెననేది బాబాసందేశముగ గ్రహింపగలము . ఈఅధ్యాయములో మరొక ముఖ్యాంశము శ్రీమతి ఖాపర్డే వృత్తాంతము . ఆమె యేడు మాసములు శిరిడీలో బాబానుసేవించిన ధన్యురాలు . అందులకేనేమో బాబా యామెను అంతగా ప్రేమిచేవారు . ఓరోజు ఆమెతెచ్చిన మధ్యాన్న భోజనమును అతిగా యిష్టపడి ఆరగించారు . సమీపానున్న శ్యామ యీపక్షపాతానికి కారణమడుగ ఆమెపూర్వజన్మ వివరాల వెల్లడించారు సాయి . క్రమంగా ఆమె గతంలో గోవు , తోటమాలిబిడ్డ, క్షత్రియ,బ్రాహ్మణయింట జన్మలెత్తి సాయిని సేవించినది . అంటే జనమ జన్మలనుండి ఆమెకు తోడునీడగా సాయమైనట్లు తలచవచ్చును . అందులకే సాయి జన్మజన్మల బంధువు! భక్తులకెరుకలేకున్నా సాయిసమర్థులు వారిని విడువరు ! బాబాకాళ్లను తోముచున్న ఆమె సేవకు పరవశించిన సాయి అదేవిధంగా ఆమెనుసేవించి 'రాజారామ్' మంత్రోపదేశంజేశారు. ఎవ్వరికి మంత్రమివ్వని బాబా ఆశీర్వదించడం ఆమెపూర్వజన్మ సుకృతమేమో ! శ్రీమతి ఖాపర్డే జన్మపరంపరలు జెప్పుటద్వారా బాబా పునర్జన్మల నమ్మకాన్ని ధ్రువపరచారా ? ఆయాజన్మలలో చేసిన పుణ్యకర్మల ఫలితంగా ఉన్నతజన్మలపొంది చివరిగా బ్రాహ్మణజన్మనెత్తి బాబాను సేవించిన ఆమెజన్మ ధన్యముగదా ! సత్కర్మలద్వారా ఉన్నతజన్మలు పొందవచ్చునని బాబాచెప్పిన ఆమెకథ పరమపదసోపానపటములోని నిచ్చెనను బోలియున్నటుల తలంపవచ్చును .
శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక ! అందరికి శుభమగుగాక ! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి !
" మనుష్యుడు ఏ ప్రకారము చిరిగిపోయిన వస్త్రములను విడిచి నూతనములైన వస్త్రములను గ్రహించుచున్నాడో , ఆప్రకారము ఆత్మ ముసలితనము , రోగము మొదలగు వానిచే శిధిలమగు దేహములను వదలి, క్రొత్త క్రొత్త దేహములను పొందుచున్నది . భగవద్గీత : 2:22 (" Just as a man casts off his worn out clothes and puts on new ones,so also the emobodied-self casts off its worn out bodies and enters ohters which are new." Geeta 2:22)
Śrī Sāināthāya Namaḥ 🙏
The sacred words that flowed from the lips of Sadguru Sai Samarth themselves became mantras, capable of freeing devotees from disease and suffering. Such is the glory of the Guru’s utterance. That same divine power also flowed through His very touch; whatever His hands touched became sanctified. Therefore, before beginning their recitations, devotees would reverently receive holy texts such as the Eknātha Bhāgavata and Gītā Rahasya directly from Baba’s hands.
The main theme of this chapter concerns the renowned Viṣṇu Sahasranāma. The greatness of the holy book was explained and gifted to Shyama, Baba's intimate devotee. That book actually belonged to another devotee, Ramdasi, who objected to this. Baba, with great skill and compassion, resolved the situation peacefully.
Though Shyama did not know the Devanagari script, by Baba’s blessings he studied the text and attained remarkable mastery over it. From this, we may understand Baba’s message: all devotees should read, reflect, and derive spiritual benefit.
Another important episode in this chapter is the account of Śrīmatī Khaparde. Blessed indeed was she, for she served Baba devotedly in Shirdi for seven months. Perhaps for this reason Baba loved her deeply. One day, He relished the midday meal she brought with great delight. When Shyama, who was nearby, wondered about this special affection, Baba revealed to Khaparde the details of her past lives.
Gradually, Sai explained that in her previous births she had been a cow, the child of a gardener, a Kshatriya, and finally born into a Brahmin family—serving Sai in each of those lives. Thus, it may be understood that Sai had been her companion and protector across many births. Hence it is truly said: Sai is a relative across lifetimes. Even when devotees are unaware, Sai Samarth never abandons them.
When Khaparde was lovingly massaging Baba’s feet, Sai deeply moved by her service; served her in return by bestowing the mantra “Rājarām”. Baba who rarely gave mantra initiation, blessed her so—surely due to the merit of her past virtuous deeds.
By narrating Khaparde’s chain of births, did Baba affirm belief in rebirth? Through the fruits of righteous actions, she attained higher and higher births, finally being born a Brahmin and blessed with the service of Sai—what a fortunate life indeed! Her story illustrates Baba’s teaching that through noble deeds one ascends to higher states of existence, much like climbing the steps of a ladder that leads to the supreme abode.
May the rays of Sai’s compassion spread upon all.
May auspiciousness befall everyone.
Om Sai, Śrī Sai, Jai Jai Sai!
As the Bhagavad Gītā declares (2:22):
“Just as a person casts off worn-out garments and puts on new ones,
so too does the soul discard worn-out bodies
and enter into new ones.”


Comments
Post a Comment