శ్రీసాయిసందేశామృతము 29 (Nectar of Sri Sai's message 29.)

శ్రీసాయినాథాయనమః !
సాయిబాబ బహువిధముల వివిధనెపములతో తనభక్తుల శిరిడీ కీడ్చేవారు.ప్రస్తుత అధ్యాయములో మదరాసు భక్తమండలిని పిచ్చుకబృందముగ మార్చి బాబా తమవద్దకు లాగిన వైనం తెలుపబడినది . బాబా కీర్తిప్రతిష్టలు దానధర్మాలగూర్చి విని ధనమాశించి బాబానుదర్శించారు కాశీయాత్రకు వెళ్లే భక్తమండలి . వారంతా మంచి భజనజేశారు. పిదప ఆరతిసమయాన బాబా ఓచిత్రమైన లీలజూపారు. రామభక్తురాలైన భక్తమండలి యజమానిభార్యకు శ్రీరామునిగా దర్శినమిచ్చారు బాబ,ఇతరులు బాబానుమాత్రమే జూశారు . పరమానందాన్నిపొందిన ఆమె తనయనుభవాన్ని భర్తకు వివరించింది . బాబానంతగా విశ్వసించని భర్త ఆమె యనుభవాన్ని భ్రమగా ఆక్షేపించాడు. పిదప ఓ రాత్రి భర్త తాను చెరసాలలో యున్నటుల, బాబాసాయంతో విడుదలైనట్లు కలగన్నాడు . ఈ అనూహ్యఘటనతో యాతనికి కనువిప్పుకలిగి బాబాపై విశ్వాసమేర్పడి భక్తిశ్రద్ధలు కలిగాయి . ఓ అవిశ్వాసి అతి విశ్వాసభక్తునిగా మారిపోయాడు . పిదప బాబా అశీసులతో కాశీయాత్రముగించి క్షేమంగా తమ యిల్లుజేరారు. బొంబాయి నివాసి శ్రీమతి సావిత్రిబాయి టెండూల్కర్ పరివారమంతా సాయిభక్తులు . వైద్యపరిక్షకు హాజరవుతున్న ఆమెపుత్రునికి గ్రహస్థితి బాగుగలేదని జ్యోతిష్యులు నిరాశపరచారు . ఈవిషయమై తల్లి బాబానాశ్రయించి సాయంకోరింది . బాబా ఆశీసులతో ఆసంవత్సరమే యాతడు పరీక్షపాసయ్యాడు . బాబాయనుగ్రహబలం, గ్రహబలాన్నాధికమించింది . పదవీవిరమణ జేసిన యామెభర్తకు బాబా ఆశీసులతో అనుకున్నదానికంటే ఎక్కువ పెన్షన్ లభించింది . బాబాస్వప్నదర్శనాలు తదుపరి భక్తుల వాస్తవ యనుభవాలుగా మారేవి . గ్వాలియర్ లోని కెప్టెన్ హాటే కలలో బాబానుజూసి చిక్కుడుకాయలకూర మరియు దక్షిణ సమర్పించుటకై బొంబాయిలోని మిత్రునికి 12 రూపాయల పంపాడు . బాబా అతిప్రేమతో మిత్రునిద్వారా వాటిని స్వీకరించారు. వేరొకసారి హాటే పంపిన నాణాన్ని తాకి తమ ఆశీసులుగా తిరిగి పంపారు . కాని వేరొకసారి మరొక భక్తుడు తిరిగి పొంద తలచి సమర్పించిన సీతారాములనాణాన్నివ్వక సమీప భక్తుడు శ్యామాకందించారు . సర్వజ్ఞులైన సాయికి అందరివిషయాలు అవగాహనయే ! భావానుగుణంగా భక్తులు యనుభవాలపొందేవారు. సాయి సంకల్పం సాధారణవ్యక్తుల శక్తికందని దైవసంకల్పం !
శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక ! అందరికి శుభమగుగాక ! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి !
" నాయందు చిత్తము గలవాడవును, నాయందు భక్తిగలవాడవును , నన్నే నమస్కరించు వాడవు నగుము. సకలమును నాయందు సమర్పించితివేని , తప్పక నన్నే పొందెదవు . భగవద్గీత : 18:65. ( "Fix your mind upon Me; be devoted to Me; sacrifice for Me; bow down to Me; you shall come, surely then, to Me alone; truely do I promise to you." The Holy Geeta: 18:65. )
Drawn by Grace: The Gentle Miracles of Sai Baba Sai Baba had a way of calling souls to Him — quietly, mysteriously — as though scattering crumbs of grace and watching sparrows find their way home. So it was with a group of pilgrims from Madras, traveling toward the holy city of Kashi. They had heard whispers of Baba’s compassion, His kindness, His miracles — and their hearts longed for His darshan. They arrived in Shirdi singing bhajans, their voices soft with love. During the evening āratī, Baba revealed a tender wonder. The leader’s wife, a devoted lover of Lord Rama, suddenly saw before her not Baba — but Sri Rama Himself, radiant and serene. The others saw only Baba — yet she saw the Beloved in the form her heart adored. Overwhelmed with bliss, she told her husband. He brushed it aside. “Only imagination,” he said. But that night, he dreamt he was chained inside a prison — and Baba came, broke the locks, and set him free. He woke trembling… and faith bloomed where doubt once stood. The skeptic became a devotee. With Baba’s blessings, the group completed their Kashi pilgrimage and returned home safely — hearts full, spirits transformed. In Bombay lived Mrs. Savitribai Tendulkar and her family, all devoted to Sai. When her son faced his medical examinations, astrologers warned of failure, blaming ill-fated planets. A mother, however, trusts the One above the stars — and she prayed to Baba. Through His grace, her son passed that very year. Where planetary strength ended, Baba’s blessing began. Later, when her husband retired, a pension greater than expected came his way — another quiet miracle, another whisper of love. Sai often spoke through dreams that later unfolded in real life. Captain Hatae of Gwalior once dreamt of Baba and felt moved to send twelve rupees to a friend in Bombay, asking that offerings of simple food — chickpea curry and a southern dish — be placed before Him. Baba accepted them with deep affection. Another time, Hatae sent a coin for blessing; Baba touched it gently and returned it. Yet when another devotee sent a sacred Sitaram coin, hoping to take it back, Baba instead gifted it to Shyama nearby — reminding all that He alone knows to whom each blessing truly belongs. For Sai, nothing was hidden. He read every heart, heard every unspoken prayer, and gave not what people wanted — but what their souls needed. According to each devotee’s faith, their experience unfolded. Sai’s will was not ordinary will — it was the vast and compassionate will of the Divine. 🌿 Reflect & Contemplate Where have I seen grace gently guiding my life, even when I did not recognize it? Do I approach God with trust — or with doubt and fear? Am I willing to let go, so that the Divine can lead me where I truly need to be? Can I learn to accept blessings as they come — even when they arrive in unexpected forms? Let these stories remind us: faith grows where the heart bows in surrender. 🙏 Closing Prayer O compassionate Sai, Guide our steps as You guided those before us. Where there is doubt, plant faith. Where there is fear, bring trust. Where hearts feel lost, lead them gently home. May Your grace strengthen us, Your love protect us, And Your presence fill our lives With peace, humility, and devotion. Sri Sai, ever remain in our hearts — refuge, friend, and divine light. Om Sai Ram. 🙏

Comments

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

అధ్యాత్మరామాయణము : అహల్యస్థుతి.