శ్రీసాయిసందేశామృతము 30 (Nectar of Sri Sai's message 30.)
శ్రీసాయినాథాయనమః !
శ్రీసాయిబాబ సంకల్పములేక వారినెవ్వరు దర్శింపలేరుగ ! సాయిపిలుపుతో శిరిడీకి లాగబడిన మరోపిచ్చుక వణిలోని సప్తశృంగిదేవి పూజారి కాకాజీ వైద్య . బహుకష్టములపాలైన పూజారి దేవిని ప్రార్ధింప బాబానుదర్శింపమని స్వప్నసందేశమిచ్చినది ఆతల్లి . బాబాయన త్రయంబేశ్వరునిగా తలచి యచటకు వెళ్లి అభిషేకాదులతో పదిరోజులు శివుని పూజించాడు . కాని మునుపటివలె అశాంతి మనస్కుడై మరల ప్రార్ధింప దేవి యాతని శిరిడీసాయిని దర్శింపమని కలలో సూచించినది. దేవీదేవతలు సయితం తమభక్తులను బాబావద్దకు పంపడంద్వారా సాయి శక్తి వ్యక్తమవుతుందిచట. కాని శిరిడికేలావెళ్లాలనేదే మరోపెద్దప్రశ్న . ఈవిషయంలోనూ సాయిమహిమ వెల్లడవుతుంది . సంకల్పం కల్పించిన బాబ ప్రయాణపుఏర్పాట్లు చేయలేరా ? సప్తశృంగిదేవికి బాకీయున్న మొక్కులను స్వీకరింపమని బాబానాశ్రయించిన శ్యామామొక్కుల నంగీకరింపక వణికెళ్లవలసినదిగా నిర్బంచారు సాయి . షిరిడీవెళ్ల మిగుల యాతురతతోయున్న కాకాను శ్యామాకలవడమెంత ఆశ్చ్యర్యకరవిషయం . మొక్కులు దీర్చినయనంతరం శ్యామా కాకాతో కలసి శిరిడీ జేరాడు . బాబానుదర్శించిన పూజారి వైద్య మిగుల ప్రశాంతచిత్తుడయ్యాడు . బాబాతో ఎలాంటి సంభాషణలు, ఆశీసులులేకయే వాని మానసిక యలజడి చల్లారుట ఎంతటి గొప్పవిషయం . ఈసన్నివేశం దక్షిణామూర్తి సన్నిధిలో వాని శిష్యులుపొందిన పరమశాంతిని స్మరింపజేస్తుంది ! శిరిడీ బాబాసన్నిధిలో పన్నెండు రోజులుగడిపి మిగుల తృప్తి శాంతులతో ఇల్లుజేరాడు వైద్య . శ్యామా విషయానికొస్తే వాని మొక్కులుతీరాయి , కాకాజీ శిరిడీ వచ్చుటకు చేసిన పుణ్యం ప్రాప్తించింది . మరొక బాబా పిలుపు . రహతావాసి కుశాల్ చందుకు స్వప్నదర్శనమిచ్చి శిరిడీకి రమ్మన్నారు . ఎలా వెళ్లాలని యోచిస్తున్న సమయాన దీక్షితు టాంగాతోవచ్చి వానిని బాబావద్దకు తెచ్చాడు . బాబానుగూర్చి తెలియని పంజాబీ రాంలాల్ నకు కలలోకనపడి శిరిడీకి రమ్మన్నారు . దుకాణదారుని ఫోటోద్వారా సాయివివరాలెరిగిన యాతడు సాయినిదర్శించి తుదివరకు శిరిడీలోనే నివసించాడు . పైన జరిగిన ఘటనలకన్నింటికీ సాయిసంకల్పమే ముఖ్యసూత్రము . వర్ణనకందని ఆ దివ్యసాయిశక్తికి శతకోటివందనములు ! శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక ! అందరికి శుభమగుగాక ! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి !
When Sai Baba Calls, the Path Unfolds
No one can behold Sri Sai Baba unless it is His will.
Only when He calls do devotees—like gentle sparrows—find themselves drawn to Shirdi, often without knowing how the journey will unfold.
One such devotee was Kakaji Vaidya, a priest of the Saptashringi Devi Temple at Vani. Troubled by suffering and inner unrest, he prayed earnestly to the Divine Mother. In a dream, she appeared and instructed him:
“Go and have the darshan of Sai Baba of Shirdi.”
Believing Baba to be a form of Lord Shiva, Kakaji first went to Trimbakeshwar and performed worship for ten days. Yet peace eluded him. When he prayed again, the Goddess firmly repeated in another dream:
“Your peace lies only in Sai Baba.”
This reveals Sai Baba’s unique glory—
even Gods and Goddesses guide seekers to Him.
Though eager to go to Shirdi, Kakaji did not know how the journey would happen. But when Baba grants the resolve, He also arranges the way. Through a series of divine coincidences, Kakaji traveled with Shyama, completed the required vows, and finally reached Shirdi.
The moment Kakaji had Sai Baba’s darshan, his restless mind became still.
No words were spoken. No blessings were uttered.
Yet a deep, lasting peace descended upon him.
This silent transformation is reminiscent of Dakshinamurti, who imparted supreme wisdom through silence alone. Kakaji spent twelve blissful days in Baba’s presence and returned home fulfilled and serene.
Many such calls followed. Baba appeared in dreams to Kushal Chand of Rahata and arranged his journey effortlessly. He even summoned Ramlal, a Punjabi who had never heard of Sai Baba, drawing him to Shirdi where he spent the rest of his life.
All these episodes reveal one timeless truth:
Sai Baba’s will is the unseen force guiding every sincere seeker.
Living Sai Baba’s Presence Daily
Sai Baba asks not for elaborate rituals, but for a transformed life.
We worship and serve Him best when we:
Live with faith (Shraddha) and patience (Saburi)
Serve the needy with compassion and humility
Remember His name in the midst of daily duties
Surrender the fruits of our actions to Him
Every act done with love becomes worship.
Every moment lived in trust becomes prayer.
May the compassionate rays of Sri Sai Baba’s grace fall upon all.
May our lives themselves become offerings at His sacred feet.
Om Sai Sri Sai Jai Jai Sai 🙏
Comments
Post a Comment