శ్రీసాయిసందేశామృతము 31 (Nectar of Sri Sai's message 31.)
శ్రీసాయినాథాయనమః !
బాబాసన్నిధి భక్తులకు పెన్నిధి ! సర్వదేవీదేవస్వరూపులుగా బాబా భక్తులకనుభవమిచ్చారు. కావున వారున్న శిరిడీ క్షేత్రము పరమపావన తీర్థము ! అదియే వైకుంఠము , కైలాసము . శిరిడీలో సాయిని సేవిస్తూ తుదిశ్వాసవిడచిన కొందరి పుణ్యాత్ముల గాథలీయధ్యాయమున పొందుపరచడమైనది . విజయానందుడు మద్రాసుప్రాంతపు సన్యాసి,మానససరోవరం వెళ్లదలచి మార్గమధ్యంలో సాయిని సందర్శించాడు . సన్యాసి భవిష్యత్తునెరిగిన బాబ వానిచే భాగవత పారాయణము చేయించారు . ఆపై కొలదిరోజులలోనే సన్యాసి తుదిశ్వాసవిడిచాడు . బాలారాం మాన్కర్ కు 12 రూపాయలిచ్చి వానిని మచ్చింద్రగడ్ కు పంపారు బాబ. అచట ధ్యానంలో భౌతికంగా ప్రత్యక్షమై సర్వవ్యాపిగా యతనికి యనుభవమిచ్చారు.మాన్కరుకు తిరుగుప్రయాణంలో పరిచయంలేని పల్లెటూరివానిరూపంలో సాయపడ్డారు . ఏరూపంలో బాబా వస్తారో భక్తులయుహకందని గుహ్యం ! తుదకు బాబా సాన్నిధ్యంలో చివరిశ్వాస వదలిన మాన్కరు జన్మ సార్ధకమైనది . తాత్యాసాహెబ్ నూల్కర్ బాబాపై మిగులవిశ్వాసం పెంపొందించుకొన్నాడు . తనకుకలిగిన యనుభవములచే తనచివరిరోజులలో శిరిడీలో నివసించి బాబాచెంతనే మరణించాడు . చివరిక్షణంలో బాబాపాదతీర్థం స్వీకరించిన వాని జన్మ ధన్యమైనది . అతనికి పునర్జన్మలేదని బాబా వ్యాఖ్యానించుటచే యాతడెంత భాగ్యవంతుడో అవగతమౌతుంది . రోగపీడితయైన ఓపులి చివరిక్షణాల్లో సాయిని చూస్తూ కనులుమూసి ధన్యతనొందినది . సాయిని మిగుల భక్తిశ్రద్ధలతో తనఇష్టదైవమైన శివునిగా పూజించి బాబాసాన్నిధ్యంలో శ్వాసవిడిచిన మేఘాజన్మము మిగులధన్యము.వానిదహనసంస్కారాలైనపిమ్మట కన్నీరుకార్చారు బాబ. ఇది సాధారణవిషయం కాదుగదా ! కేవలం నాలుగుసంవత్సరములు మాత్రమే సేవించి సాయికంతటి ప్రేమపాత్రుడైన మేఘ జన్మము చిరస్మరణీయము !శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక ! అందరికి శుభమగుగాక ! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి !
Baba’s Presence — The Eternal Refuge
(Nectar of Sri Sai's message 31.)
Baba’s sacred Presence is an inexhaustible treasure for devotees.
To those who surrender with love, He reveals Himself as the living essence of all gods and goddesses. Thus, Shirdi — where Sai dwells — is no ordinary pilgrimage. It is Vaikuntha and Kailasa manifested upon earth.
This chapter lovingly records the stories of blessed souls who offered their final breath while serving Sai in Shirdi, reminding us that to live near Baba is grace, and to depart in His Presence is the highest fulfillment of life.
Vijayananda, a wandering ascetic bound for Manasarovar, paused in Shirdi, drawn by an unseen call. Sai, knowing his destined hour, guided him to recite the Bhagavata. Within days, the ascetic completed his journey at Baba’s feet.
Balaram Mankar was sent by Baba to Machhindragad with twelve rupees. There, in deep meditation, Sai appeared before him and revealed His all-pervading nature. On the return journey, Baba protected him in the form of an unknown villager — a reminder that Sai comes to us in ways beyond imagination. Mankar later breathed his last in Baba’s Presence, his life thus made whole.
Tatyasaheb Noolkar’s faith ripened through lived experience. Choosing to spend his final days in Shirdi, he departed at Sai’s lotus feet. Baba declared that one who receives His Padatirtha at the final moment is freed from rebirth — revealing the immeasurable grace of such surrender.
A tiger, afflicted by illness, gazed upon Sai in her last moments and attained blessed peace. Megha, who worshipped Sai as Lord Shiva Himself, surrendered his final breath in Baba’s Presence. After Megha’s passing, Baba wept — a sacred testimony to divine love. Though Megha served only four years, his devotion made him eternally dear to Sai.
The message of this chapter is simple and profound:
Sai walks with His devotees till the very end. What matters is not the length of service, but the depth of love and surrender. When life is offered at His feet, death itself becomes divine union.
May the compassionate rays of Sri Sai bless all beings with faith and peace.
Om Sai Sri Sai Jaya Jaya Sai. 🙏
Comments
Post a Comment