శ్రీసాయిసందేశామృతము 32 (Nectar of Sri Sai's message 32.)
శ్రీసాయినాథాయనమః !
అధ్యాయారంభమున రచయిత హేమాద్రిపంత్ సంసారాన్ని తలకిందుల అశ్వత్థవృక్షంతో పోల్చాడు , వేళ్ళు పైన కొమ్మలు క్రిందుగా వ్యాపించాయి . చెట్టుకు మూలం వేళ్ళు, వేళ్ళు గ్రహించిన పోషకాలతో చెట్టుపెరిగినట్లు, పూర్వజన్మ వాసనలచే చెట్టులాంటి కొత్తజన్మ ఆరంభమవుతుంది . ఊర్ధ్వలోకాలనున్న సూక్ష్మదేహాంనంటియున్న కర్మఫలాలు నూతనజన్మకు పోషకాలుగా తలచవచ్చును . సూక్షదేహాలు ఊర్ధ్వలోకాల్లో సంచరిస్తాయికనుక వేళ్ళు పైనున్నటులగ వర్ణింపబడినవేమో ? వివేకవైరాగ్యాలను పొదునైన కత్తితో అనిత్యమగు పూర్వకర్మఫలాలను వధింప స్వస్వరూపమైన ఆత్మ ప్రకాశమానమౌతున్నటుల తలంపవచ్చును . బాబాతనముగ్గురు మిత్రులతో దైవాన్వేషణకై అడవిలో బయలుదేరాడు . దైవాన్ని మనసు బుద్ధులతో వ్యాఖ్యానించారు . బాబాభావన ఇందులకు విరుద్ధమైనది. పనియే పరమాత్మగా తలచి విధించినకర్మల నాచరించాలని తనమాటగా చెప్పారుబాబ. భావాతీతమైన ఆత్మను కేవలం ఆత్మసాక్షాత్కారముపొందిన సద్గురుశరాణాగతిచేతనే పొందవలెనని బాబా తలచారు . పుస్తకజ్ఞానమే సూర్యరశ్మిచొరబడని అడవి . అందులకు దారినెరిగిన మార్గదర్శి సాయము తప్పకకావలెను. మిత్రులుమువ్వురు బంజారారూపంలో కలసిన గురునివిస్మరించి వాని ఆతిధ్యం తిరస్కరించి తద్వారా తమ గమ్యాన్నిజేరలేకపోయారు . కాని బాబా బంజారారూపంలోని గురునికాత్మసమర్పణముజేసి పన్నెండేళ్ళు అకుంఠిత భక్తిశ్రద్ధలతో సేవించాడు . బావిలో తల్లకిందులుగా వేలాడి అమితానందాన్ననుభవించాడు . అనగా బాహ్యప్రపంచానికి వ్యతిరేకంగా ఆత్మముఖంగా బాబా విచారణలు కొనసాగిన్నటులగ అర్థంజేసుకొనవచ్చును . వారికామూలస్థితిలో బాహ్యప్రపంచం కనుమరుగైనది . అలాంటిస్థితినే భగవాన్ రమణమహర్షి పెక్కుసంవత్సరాలనుభవించారు! ఉపవాసమనగా దైవానికి దగ్గరగా వసించడమేగాని భోజనం మానడంకాదని శ్రీమతి గోఖలే చేయ దలచిన ఉపవాసమును తిరస్కరించారు . శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక ! అందరికి శుభమగుగాక ! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి !
ఓ అర్జునా ! వేదమందలి అర్థవాదవాక్యములచే నాకర్షింపబడినవారై విషయభోగములందు ,స్వర్గాదిసుఖములందు ఆసక్తులై, ఆత్మజ్ఞానశూన్యులైన అవివేకులు, స్వర్గాదిసుఖములకంటే ఉత్కృష్టమైనది , శ్రేయస్కరమైనది మరియొకటిలేదని చెప్పెదరు ! గీత : 2:42. " Flowery speech is uttered by the unwise, taking pleasure in the eulogising words of Vedas" The Holy Geeta: 2:42
Nectar of Sri Sai's message 32.At the very beginning of the chapter, the author Hemadri Pant compares worldly life to the inverted Ashwattha tree whose roots are above and branches spread downward. Just as a tree grows by drawing nourishment through its roots, a new birth begins and expands through the impressions (vasanas) of past lives. The fruits of karma attached to the subtle body, moving in the higher worlds, become the nourishment for the next incarnation. Perhaps that is why the roots are described as being above, since the subtle bodies wander in the higher realms.
With the sharp sword of discrimination and detachment, when the impermanent fruits of past karma are cut away, the Self, one’s true nature, shines forth in its own radiance.
Baba set out into the forest with three friends in search of God. They tried to explain God through mind and intellect. Baba’s vision was completely different. He taught that work itself is God and that one must perform the duties assigned by destiny as worship. The Self that is beyond all thoughts and feelings can be attained only through surrender to a Sadguru who has realized the Truth. Book knowledge alone is like a dense forest where even sunlight cannot enter; without a guide who knows the path, one cannot cross it.
The three friends failed to recognize the Guru who appeared before them in the form of a Banjarā and rejected his hospitality; therefore, they could not reach their goal. But Baba surrendered himself totally to that Guru in Banjarā form and served him with unwavering devotion and faith for twelve long years. By hanging upside down in a well, Baba experienced infinite bliss. This symbolizes his turning away from the external world and directing his awareness inward, toward the Self. In that state, the outer world vanished for him. The same state was lived for many years by Bhagavan Sri Ramana Maharshi.
Baba taught that fasting does not mean merely giving up food, but living close to God. Therefore, he discouraged Shrimati Gokhale from observing a mere physical fast. When Haribhao Karnik wished to offer him a rupee as dakshina, Baba accepted it through Narsing Maharaj, revealing the unity of great souls and the oneness of divine consciousness. All-knowing Sai thus demonstrated the truth of spiritual unity.
May the rays of Sri Sai’s compassion spread upon all.
May auspiciousness and peace prevail everywhere.
Om Sai, Sri Sai, Jai Jai Sai!

Comments
Post a Comment