శ్రీసాయిసందేశామృతము 33 (Nectar of Sri Sai's message 33.)
శ్రీసాయినాథాయనమః !
ఈ అధ్యాయ ముఖ్యాంశము విభూతి మహిమలు . బాబా యూది దక్షిణలద్వారా భక్తులకు వివేకవిరాగ్యముల బోధించెడివారు . నాసిక్ నివాసి నారాయణ మోతీరాం తన మిత్రుడు తెలుకుట్టివిపరీతంగా బాధపడుతుంటే విభూతిలేనికారణంగా బాబాను ప్రార్ధించి అగరుబత్తి బూడిదను నొప్పియున్నచోట రాయ తక్షణమే నొప్పితగ్గినది . బాంద్రా భక్తుని కూతురి ప్లేగువ్యాధి నానాసాహెబ్, బాబాను ప్రార్ధించి రోడ్దుమీద మట్టిని తనభార్యనుదుటిపై అద్దినవెంటనే తగ్గిపోయినది . బాబాకు వారి ఫోటోకి తేడాలేదనే సందేశాన్ని బాలబువా అనుభవంద్వారా అందించారు . బాబా ఏరూపంలోనైనా భక్తుని కనుభవమీయగలరు. అప్పాసాహెబ్ కులకర్ణి గృహానికి ఫకీరువేషంలో వచ్చి దక్షిణస్వీకరించి విభూతిని ప్రసాదంగా అందించారు . మహాసమాధి యనంతరం బాబాలీలలు కొనసాగుతున్నాయనే నిజం భక్తుడు నారాయణరావు వ్యాధినివారణద్వారా వెల్లడవుతుంది . స్వప్నంలో వానినాశీర్వదించినపిమ్మట వాని జబ్బు తగ్గిపోయినది . సమాధినుండే సమాధానమన్న బాబామాట రుజువయ్యింది . యోగులు పరస్పర ఏకాత్మభావనతో పనిజేస్తారనే భావన హరిభావ్ కార్నిక్ యనుభవం నిరూపిస్తుంది . బాబాకివ్వదలచిన ఒకరూపాయి దక్షిణను నాసిక్ లోని నరసింగమహరాజ్ స్వీకరించారు . ఈ అధ్యాయంలో ప్రసిద్ధమైనడి జాంనేరు లీల . జాంనేరులో బాబా ప్రియభక్తుడు నానాసాహెబ్ చాందోర్కరుని కుమార్తె మైనతాయి ప్రసవవేదననుభవిస్తూ మిగులదయనీయస్థితిలో వుంది. ఇంట్లో విభూతిలేనికారణంగా సాయిని అతిదీనంగా ప్రార్ధించాడు చాందోర్కర్ . సర్వహృదయవాసి సాయికందినది యాతని మనోవేదన . వెనువెంటనే రాంగిరిబువా ద్వారా వూది ఆరతి పంపించారుబాబా . జలగాంలో రైలుదిగినవానిని బండివానిరూపంలో వచ్చి జాంనేరు జేర్చి యదృశ్యమయ్యారు బాబా . సమయానికి వూది యందినది , మైనతాయి ప్రసవవేదన తొలగి సుఖంగా బిడ్డను కన్నది . ఈ లీలలో సాయిబాబా సర్వవ్యాపకత ,సర్వజ్ఞత , కారుణ్యం , సమర్ధత మున్నగు దైవగుణాలు ఒకే సంఘటనలో ప్రకటితమవుతాయి .శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక ! అందరికి శుభమగుగాక ! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి !
SAIRAM GITA MESSAGE
Nectar of Sri Sai's message 33.This chapter beautifully describes the divine power of Baba’s Vibhuti and how, through dakshina, He taught His devotees the values of discrimination and detachment. It shows that Baba could understand the pain of His devotees in any form and grant them instant relief, proving His boundless compassion and omnipotence.
Narayan Motiram of Nasik prayed to Baba when his friend was suffering from severe pain and no Vibhuti was available. He applied the ash of an incense stick to the painful spot, and the pain disappeared immediately.
In another instance, the daughter of a devotee from Bandra was afflicted with plague.The devotee sent a message to Nanasaheb Nana was travelling that time. Nana Saheb prayed intensely to Baba and applied roadside soil to his wife's forehead who was travelling along with him. The disease subsided at once.
Through Balabua’s experience, Baba conveyed that there is no difference between His photograph and His living presence. Baba can give His divine experience in any form He chooses.
Baba once came in the guise of a fakir to Appasaheb Kulkarni’s house, accepted dakshina, and blessed him with Vibhuti.
Even after His Mahasamadhi, Baba’s divine acts continued. This was proved through the healing of devotee Narayan Rao, who was cured of his illness after Baba blessed him in a dream. Thus Baba’s words, “From the Samadhi itself shall come the answer,” were proven true.
Haribhau Karnik’s experience shows that realized yogis work in unity through spiritual oneness.
When a devotee wished to offer one rupee as dakshina to Baba, it was accepted instead by Narsing Maharaj in Nasik, indicating the spiritual unity among saints.
The most famous episode in this chapter is the Jamner Leela.
In Jamner, Nana Saheb Chandorkar’s beloved daughter Mainatai was undergoing unbearable labor pains and was in a pitiable condition. As there was no Vibhuti in the house, he prayed to Sai Baba with utmost humility. Sai Baba, the indweller of all hearts, immediately perceived his agony and sent Vibhuti and Aarati through Rangiribua.
Baba alighted from a train at Jalgaon, appeared as a cart driver, took the sacred ash to Jamner, and then vanished. As soon as the Vibhuti arrived, Mainatai’s pain subsided and she safely delivered a healthy child.
In this single divine episode, Sai Baba’s qualities of
Omnipresence, Omniscience, Infinite Compassion, and Supreme Power
are all magnificently revealed.
May the rays of Sri Sai’s mercy spread upon all!
May auspiciousness bless everyone!
Om Sai Sri Sai Jai Jai Sai!

Comments
Post a Comment