శ్రీసాయిసందేశామృతము 34 (Nectar of Sri Sai's message 34.)

శ్రీసాయినాథాయనమః !
నయముకాని రాచకురుపు పీడితుడు డాక్టరు మేనల్లుడు . వ్యాధినివారణకై బాబాను దర్శించి ప్రార్ధించారు బిడ్డతో తలిదండ్రులు. " ఎవరైతే ఈమజీదుకు వచ్చెదరో వారెన్నడు ఈజన్మలో ఏవ్యాధిచేతను బాధపడరు . కురుపుపై ఊదిని పూయుము వారమురోజులలో నయమగును . " అన్నారు సాయిబాబా . బబామాటలననుసరించి ఉది రాయగా వ్యాదినెమ్మదించి కొద్దిరోజులలో పూర్తిగా నయమయ్యింది . బాబా నివాసంచే పాతమజీదు గొప్ప శక్తిస్థలంగ మారింది . నిత్యంమండే ధుని భక్తులకర్మల భస్మం జేస్తూనే ఉంది . సూర్యోదయంతో మంచుతెరలు వీడినట్లు , బాబాచూపులతో భక్తుల బాధలు, భయాలు రోగాలు దూరమయ్యాయి . వ్యాధికుదిరినా రోగి మేనమామ డాక్టరునకు బాబాపై నమ్మకం కుదురలేదు . వ్యక్తికి నమ్మకాన్నికల్గించేది బాబాయే. " ఇంకనూ నన్నునమ్మవా " అని వరుసగా ;మూడురాత్రులు స్వప్నంలో వానిని పిలుచుటచేతను, తాను చికిత్సజేయు రోగి త్వరలో కోలుకోవడంచేతను డాక్టరు బాబాను దర్శించి ప్రణమిల్లాడు డాక్టరు . మేనల్లుని రోగనివారణ మిషచే విశ్వాసంలేని డాక్టరు ఓ మంచి భక్తునిగా మారాడు. ఉదీమహిమతోపాటు బాబా శక్తియుక్తులకలయికనిచట చూడగలము . భయంకర బాధ వలన పీడితుడు డాక్టరు పిళ్లే తనబాధను పదిజన్మలకు పంచమని ప్రార్ధింపగా యూది ద్వారా పదిరోజుల్లోనే మాయంజేశారు బాబా . భక్తివిశ్వాసాలే బాబాకోరెడి రుసుము . బాబాకరుణాకటాక్షాలే భక్తులుపొందే ఔషధాలు . సత్వరమే సాయి సాయం . కేవలం ఒక్కరోజులోనే శ్యామా మరదలు ప్లేగువ్యాధి ఉదీమహిమచే నయమైనది . ఇరానీ బాలిక, హర్దా పెద్దమనిషి, బొంబాయి మహిళా ఊదినద్ది తమరోగాలను బాధలను పోగొట్టుకున్నారు . వైద్యులకే వైద్యుడు సాయినాథుడు . శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక ! అందరికి శుభమగుగాక ! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి !
A doctor’s young nephew, Tormented by an incurable boil, Was brought by his parents To Baba’s holy presence in prayer. Sai spoke with gentle assurance: “Whoever comes to this Masjid Shall never suffer from disease in this lifetime. Apply Udi upon the wound— Within a week, it shall heal.” They followed Baba’s sacred words; The holy ash was applied with faith, And slowly the illness faded away— Soon the child was completely cured. Thus Baba’s ancient Masjid Became a powerful shrine of grace. The ever-burning Dhuni Continues to turn devotees’ karma into ash. Like mist that melts at sunrise, At Baba’s glance disappear Sorrows, fears, and sickness of devotees. Yet the doctor uncle still doubted. Faith awakens only by Baba’s will. “For how long will you not believe in Me?” Baba called him in dreams For three nights in a row. Soon, a patient under his care recovered swiftly, And the doctor bowed at Baba’s feet. Through his nephew’s cure, A skeptic became a true devotee. Here we witness both the glory of Udi And the divine power of Baba. Dr. Pillai, tormented by terrible pain, Prayed to share his suffering across ten lifetimes— But Baba, through Udi’s grace, Erased it all within ten days. Faith and devotion— These alone are Baba’s desired offering. His compassionate glance— The only medicine devotees receive. Sai’s help comes swiftly. In a single day, Shama’s sister-in-law Was cured of plague by Udi’s miracle. An Iranian child, a nobleman of Harda, And a woman from Bombay— All were freed from illness and sorrow. Sai Nath— The physician of physicians. May Sri Sai’s rays of compassion Shine upon all beings. May auspiciousness bless everyone. Om Sai, Sri Sai, Jai Jai Sai. 🙏

Comments

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)