శ్రీసాయిసందేశామృతము 36 (Nectar of Sri Sai's message 36)
శ్రీసాయినాథాయనమః !
ఈఅధ్యాయంలో ఇద్దరి గోవపెద్దల అనుభవాలు చెప్పబడ్డాయి . వారిరువురు బాబాను దర్శించినప్పుడు , సాయి కేవలం ఒకరినుండి అడిగి 15 రూపాయలు దక్షిణ స్వీకరించారేగాని మరొకరు 35 రూపాయలు స్వయంగా సమర్పించినా స్వీకరింపలేదు . సమీపమునున్న శ్యామా అదేమి న్యాయమని ప్రశ్నింప సర్వజ్ఞుడగు బాబా ఆపెద్దల పూర్వ విషయాలను పూసగుచ్చినట్లు వివరించారు . మొదటివ్యక్తి దత్తభక్తుడు . తనకు ఉద్యోగం లభిస్తే మొదటినెల జీతమిచ్చెదనని తనదైవానికి మొక్కుకున్నాడు . 15 రూపాయల ఆరంభజీతంతో మొదలై అంచెలంచెలుగా పెద్దజీతం పొందాడు . మొక్కు మరచినవానిని పిలిచి ఆమొక్కుకుసరిపడ దక్షిణ స్వీకరించి రుణముక్తునిజేసి తానె దత్తుడనెడి అనుభవాన్నికలిగించారు . రెండవవ్యక్తి యనుభవం మరోవిధంగా వుంది . ఎంతోకాలంగా విశ్వాసంతో పనిజేసిన వాని వంటమనిషి చెడుదారినపడి ఇంటిలోని 30 వేలరూపాయల దొంగిలించాడు . మిగుల దుఃఖంతో విచారగ్రస్తుడైన వానింటికి ఓ సన్యాసివచ్చి వివరములనెరిగిన పిమ్మట శిరిడీ బాబానుదర్శింపమని అప్పటివరకు తనకు ప్రియమైన ఆహారమును తినుటమానుమనిజెప్పి వెళ్ళిపోయాడు . సన్యాసిమాటలపై విశ్వాసంతో అన్నంతినుటమానిన పిమ్మట 15 రోజులలో దొంగిలించిన సొమ్మును తిరిగినిచ్చి మిగుల పశ్చాత్తాపపడ్డాడు వంటవాడు . శిరిడీ దర్శనం మరచినవానికి బాబా స్వప్నదర్శనమిచ్చి మొక్కుగుర్తుజేశారు . బాబానుదర్శింప బయలుదేరినవానికి మార్గంలో అపరిచిత వ్యక్తిరూపంలో సాయమందింది . ఇచట ఘటనల పరిశీలిస్తే వాటిమధ్య ఓ చక్కటి కూర్పు కనబడుతుంది . మొదట సన్యసిరుపంలో , పిదప స్వప్నరూపంలో, చివరిగా అపరిచుతుని రూపంలో సాయపడి శిరిడికీడ్చారుబాబ. ఈవిషయంలో బాబాసర్వజ్ఞత , సమర్ధత , కారుణ్యం మున్నగు దైవగుణాలు వ్యక్తమవుతాయి . అందులకే బాబా తరచు తమభక్తులకు రుణము, శత్రుత్వము , హత్యలకు దూరంగా మెలగాలని హెచ్చరించేవారు. రెండవ వ్యక్తి మొక్కు కేవలం బాబానుదర్శించుటయే గాని దక్షిణకాదు , అందులకే వానినుండి ఎలాంటి డబ్బుగ్రహింపలేదు . సాయిసంతానలక్ష్మి , వయసుమరలిన ఔరంగాబాద్కర్ భార్యను దీవించి, సంవత్సరకాలంలోపే పుత్రసంతానం కలిగించారు .శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక ! అందరికి శుభమగుగాక ! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి !
The First Devotee
The first was a devotee of Lord Dattatreya.
Once he prayed,
“If I gain employment,
My first month’s salary I shall offer to my Lord.”
His first wage was fifteen rupees.
From there, step by step,
His fortune grew and his salary rose —
But the vow faded from memory.
So Baba called him near,
Accepted only fifteen rupees,
Freed him from the debt of his promise,
And revealed the truth within the heart —
“I am that very Datta you worship.”
The Second Devotee
The story of the second was different.
His cook, trusted for years,
Strayed into darkness
And stole thirty thousand rupees from his home.
Grief consumed him.
One day a wandering monk arrived,
Heard his sorrow, and said:
“Go to Shirdi and see Sai Baba.
Until then, give up your favourite food.”
Trusting those words, he obeyed.
Within fifteen days,
The thief returned in repentance,
Restored the money, and begged forgiveness.
Yet the man forgot his vow to visit Shirdi.
Baba then appeared in a dream,
Reminding him of his promise.
When he set out on the journey,
An unknown traveller helped him along the way.
Look closely at these events —
A beautiful pattern shines:
First as the monk,
Then in the dream,
Finally as the stranger on the road —
Baba Himself led him to Shirdi.
Here shine the divine qualities of Sai:
Omniscience, power, and boundless compassion.
Thus Baba often warned His devotees:
“Stay away from debt, enmity, and violence.”
The second man’s vow was only to see Baba —
Not to offer money.
So—
Baba accepted nothing from him.
Sai, the giver of children,
Blessed the aged wife of Aurangabadkar;
Within a year, she bore a son.
May the rays of Sai’s grace
Shine upon all beings.
May all be blessed.
Om Sai, Sri Sai, Jai Jai Sai. 🙏
Comments
Post a Comment