శ్రీసాయిసందేశామృతము 37 (Nectar of Sri Sai's message 37)
శ్రీసాయినాథాయనమః !
శ్రీసాయిసచ్చరిత్ర నిత్యపారాయణముచే నిరంతరము సాయి చర్యలను బోధలను వారిజీవన విధానమును అనుక్షణము స్మరించెదము . అదియే సాయితో నిత్యసాంగత్యము . సాంగత్యబలంచే వ్యక్తి ప్రవర్తనలో తెలియకనే మార్పు వస్తుంది, అలానే సాయిపథంలో పయనం మొదలవుతుంది . బాబా మొదట్లో ఒకనాడు మజీదులోను మరునాడు చావడిలోను నిదురించెడివారు . 1910 డిసెంబరు 10 నుండి చావడిలో పుజారతులు మొదలెట్టారు . ఆ చావడి వేడుక మహత్తర యుత్సవం. భజనబృందాలు , రధము, తులసీబృందావనము,దివిటీలు , అలంకరింపబడిన పల్లకి , గుఱ్ఱము శ్యామకర్ణ బాబావెంట నడిచేవి . భక్తుల జయజయకారాలు మిన్నుముట్టేవి. శ్రీపురుషుల భజనధ్వనులు మిన్నంటేవి . దీక్షియు బాబాపై పువ్వులు గులాల్ చల్లుచుండెడివాడు . బాబాముఖతేజస్సు ద్విగుణీకృతమయ్యెడిది . మాల్సాపతి తన్మయుడై నాట్యంజేసేవాడు . పిమ్మట ఆశోభాయాత్ర అలంకరింపబడిన చావడిజేరెడిది. అచట భక్తులు తనివితీరా అలంకరించి శ్రద్ధాభక్తులతో బాబాను పూజించెడివారు . వారిభక్తికి దాసుడైన బాబా వారిచర్యలకు అడ్డుచెప్పెడివారుకాదు. భక్తులతోకలసి చిలుము తాగెడివారు . భక్తులపై వాత్సల్యమటువంటిది. బాపు సాహెబ్ జోగ్ ఆరతితో నాటి కార్యక్రమం ముగిసేది . ఆరోజులు గడిచిపోయినా ఆక్షణాల స్మరించి ఆనందించెదముగాక ! అలాంటి భక్తుల భావోద్రేకాల వేళల లోను బాబా నిశ్చల చిత్తులు . లోతైన సముద్రం వలె శాంతగంభీరులు సాయిబాబ! శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక ! అందరికి శుభమగుగాక ! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి !
Through the daily reading of Sri Sai Satcharitra,
we keep remembering every moment
His deeds, His teachings, His gentle way of life.
That remembrance itself becomes
our daily companionship with Sai.
In the silent strength of such holy company,
a heart begins to change without knowing…
and thus begins the journey
on the sacred path of Sai.
In those early blessed days,
one night Baba rested in the Masjid,
the next night in the Chavadi.
And from December 10th, 1910,
the Chavadi procession began —
a festival of devotion and divine joy.
Bhajan groups sang in ecstasy,
torches glowed like stars on earth,
the Tulasi Brindavan shone in reverence,
the palanquin stood richly adorned,
and the gentle horse Shyamakarna
walked beside Baba in grace.
Cries of victory filled the skies,
waves of sacred songs rose higher and higher.
Dixit showered flowers and gulal upon Baba,
and His radiant face glowed ever brighter.
Lost in divine love,
Malsapati danced in blissful devotion.
Thus the grand procession
reached the beautifully decorated Chavadi.
There the devotees adorned Baba
with love overflowing and faith unshaken.
Baba, the humble servant of His devotees’ love,
never stopped their offerings of devotion.
He sat among them as one of their own,
sharing the chillum with tender affection.
Such was His boundless love…
With the Aarti of Bapusaheb Jog,
the sacred night would gently close.
Though those days have passed away,
may we rejoice forever in their remembrance.
Even amidst waves of devotion and joy,
Baba remained still and serene —
calm and majestic
like the depths of an endless ocean.
May the rays of Sai’s compassion
shine upon every heart.
May all beings be blessed.
Om Sai, Sri Sai, Jai Jai Sai. ✨
Comments
Post a Comment