శ్రీసాయిసందేశామృతము 38 (Nectar of Sri Sai's message 38)
శ్రీసాయినాథాయనమః !
దైవాన్ని ఓ ప్రత్యేకరూపంలేని విశాల జలాశయంగా తలిస్తే అదే నిరాకారరూపమవుతుంది . పాత్రలోని ఘనీభవించిన నీరు పాత్ర ఆకృతి ధరించినవిధంగా రూపుదాల్చిన దైవం, ఆ దివ్యాకృతియే సాయిమానుషరూపం . కాని తనను బానిసలకు బానిసగా పేర్కొన్న నిరహంకారరూపమే సాయినాథులు . బాబాజేసిన అన్నదాన ప్రక్రియ వారి కర్మయోగానికి ప్రతీక . స్వయంగా తామే వంటదినుసులసేకరించి శాకాహార మాంసాహారాలను వండి వండిచెడి వారు . మరుగుచున్న దేకిసాలో చేతిని గారిటిగా తిప్పెడివారు . కాని చేయి ఏమాత్రము కాలెడిదికాదు. దేహాతీత యోగస్వరూపులు బాబా . మత్స్యమాంసముల భుజించినప్పటికీ హిందూ దేవీదేవతల మిగుల గౌరవించెడివారు సాయి . శిరిడీవచ్చు దారిలో దత్తదర్శనం చేయని నానాసాహెబ్ చాందోర్కరును మందలించారు సర్వజ్ఞులు సాయి . హిందూ ముస్లిం ఆచార్య వ్యవహారాల సమంగా పాటిస్తూ మతసామరస్యానికి సారధిగా మరియు వారధిగా వ్యవహరించారు . మహిమాన్వితసాయి సాధారణ మనుషులతో కలిసి భుజించెడివారు . ఉపవాసాలనిరసించే సాయి అందరికిభోజనంపెట్టి తృప్తిచెందేవారు . వారిబోధ ఆచరణాత్మకము . అన్నాసాహెబ్ కు గిన్నెడు మజ్జిగ ప్రసాదంగా యిచ్చి వానిచే అమృతసమాన లీలలగ్రంధాన్ని వ్రాయించారు . బాబా ప్రేరణచే అన్నదాన ప్రక్రియ కేవలం శిరిడీ వరకుమాత్రమే పరిమితంగాక దేశవిదేశాలలోని పెక్కుసాయిదేవాలయాలలో కొనసాగుతుంది . శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక ! అందరికి శుభమగుగాక ! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి !
If we imagine the Divine as a vast, shoreless ocean without a form, that is the formless Absolute.
And just as water frozen within a vessel takes the shape of the vessel,
the Divine, when assuming form, appeared in that sacred form —
the human form of Sai.
Yet the truest form of Sai was His humility,
for He called Himself the servant of servants.
The sacred act of feeding all was the living symbol of His Karma Yoga.
He Himself gathered the ingredients,
cooked both vegetarian and non-vegetarian meals,
and lovingly served everyone.
With His own hand He stirred the boiling cauldron as though it were a ladle,
yet the hand was never burned —
for Baba was beyond bodily limitations.
Though He partook of fish and meat,
He held deep reverence for Hindu gods and goddesses.
The all-knowing Sai even reprimanded Nanasaheb Chandorkar
for not taking the darshan of Lord Dattatreya on the way to Shirdi.
By honoring both Hindu and Muslim traditions equally,
He became the bridge and guiding light of religious harmony.
The glorious Sai ate alongside ordinary people.
He discouraged fasting and rejoiced in feeding everyone to contentment.
His teachings were not mere words — they were lived truths.
By gifting a bowl of buttermilk as prasadam to Annasaheb,
He inspired him to write the nectar-like book of divine leelas.
The sacred tradition of feeding the hungry, begun by Baba,
did not remain confined to Shirdi;
today it continues in countless Sai temples
across nations and oceans.
May the rays of Sri Sai’s compassion shine upon all.
May auspiciousness bless everyone.
Om Sai, Sri Sai, Jai Jai Sai. 🙏
Comments
Post a Comment