శ్రీసాయిసందేశామృతము 39 (Nectar of Sri Sai's message 39)
శ్రీసాయినాథాయనమః !
ఈ అధ్యాయంలో బాబాయొక్క సంస్కృత భాషాజ్ఞానము , భగవద్గీతలోని ఓ శ్లోకానికి సాయిజెప్పిన వ్యాఖ్యానము వివరింపబడ్డాయి . భాషకు మూలము ఆలోచన, ఆలోచనకు మూలము భావము , భావానికి మూలము ఆత్మచైతన్యస్థితి . ఆ ఆత్మజ్ఞానికి అన్నిభాషలు , అందరి అంతరంగాలు కరతలామలకములు. సాయికి బల్లులభాషకూడా తెలియును . ఈవిషయం సచ్చరిత్ర 15వ అధ్యాయంలో వివరింపబడినది . నానాసాహెబ్ చాందోర్కర్ బాబాను ఎంతోకాలంగా సేవిస్తున్నా, బాబాశక్తిసామర్ధ్యాల నెరుగకుండెను . తనకున్న సంస్కృతజ్ఞానం బాబాకులేదనే చిన్నఅహంకార భావం. ఆతడు ఓరోజు బాబాసేవలో గీతాశ్లోకమొకటి (4:34) వల్లెవేస్తున్నాడు . బాబా గట్టిగాచదివి ఆశ్లోకార్థమును వివరింపమన నానా ఇలావివరించాడు." గురునికి సాష్టాంగనమస్కారము జేయుట, ప్రశ్నించుట సేవించుటద్వారా తెలిసికొనుము . అప్పుడు మోక్షస్థితినొందిన జ్ఞానులు బ్రహ్మజ్ఞానమునుపదేశింతురు." పిమ్మట బాబా ఆశ్లోక విశేషార్ధమును తెలుపమన నానా తడబడి తనజ్ఞానపరిధిలో శ్లోకానికి వివరణిచ్చాడు, ఆపై వాని వాక్కు మూగవోయింది . " జ్ఞానము నెవరైనా బోధింపగలరా , అజ్ఞానమును తొలగించుటయే జ్ఞానముగాదా ?" యన్నబాబా ప్రశ్నకు నానా మౌనం వహించాడు . ఆపై బాబా ఇలా వివరించారు . " గురుశిష్యులలో ఒకే ఆత్మప్రకాశిస్తున్నా అజ్ఞానంచే శిష్యుడు తనస్వయంప్రకాశాన్ని చూడలేకున్నాడు . గురునిసాయంతో ఆ అజ్ఞాన పొర తొలగించుకొంటే తనలోని ప్రకాశమయ ఆత్మను దర్శింపగలడు ." అట్టి జ్ఞానసిద్ధ గురువులెల్లరు శ్రీకృష్ణసమాన రూపులే ! పిదప తనతప్పును గ్రహించాడు నానా . అన్నీ తెలిసిన బాబా ఏమీ తెలియనట్లు ప్రవర్తించుట వారి వినయానికి నిరహంకారానికి యుదాహరణలు. బాబా కుశలకర్ములు. ఎలాంటి బాహ్య ఆర్భాటాలతో పనిలేక కేవలం సంపల్క బలంచే వారిపనుల నెరవేర్చెడివారుబాబా. ఇందులకు బూటిమందిర నిర్మాణమే నిదర్శనం. వాడాలో నిదురిస్తున్న బూటీకి, శ్యామాకు ఒకేసమయంలో స్వప్నదర్శనమిచ్చి సమాధిమందిరనిర్మాణం తగిన సమయంలో పూర్తిజేయించారు . నిర్మాణం పూర్తయిన వెంటనే మురళీధరస్థానంలో బాబాదేహాన్ని మహాసమాధిజేశారు ! ఇది ఎంతటి విచిత్ర సంఘటనల కూర్పు ! తామే మురళీధరుడనని చెప్పక చెప్పారు సాయిబాబ!శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక ! అందరికి శుభమగుగాక ! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి !
Baba’s wisdom, vast and bright,
Sanskrit knowledge, heart’s own light.
A Gita verse he made us see,
The soul’s own truth, its liberty.
Language flows from thought, then heart,
Feeling and Self cannot depart.
All tongues, all hearts, are clear to him,
Each silent soul, each sacred hymn.
Nana Saheb, proud and small,
Tried to teach, yet learned it all.
“Can knowledge be taught?” Baba said,
“Remove the veil, and light is spread.”
Guru and disciple share the same flame,
Ignorance blinds, but Truth reclaims.
Lift the veil, the Self will shine,
Krishna’s light in heart divine.
No show, no pomp, just deeds so pure,
Baba’s love and grace endure.
Samadhi shrine, dreams aligned,
Booti, Shyama, visions combined.
Om Sai, Shri Sai, Jai Jai Sai,
Grace and peace descend from the sky.
Comments
Post a Comment