శ్రీసాయిసందేశామృతము 40 (Nectar of Sri Sai's message 40)
శ్రీసాయినాథాయనమః !
ఈ అధ్యాయంలో రెండు సాయిబాబా చిత్రవిచిత్ర లీలలు చెప్పబడినవి . బీ.వీ దేవుగారు తమఇంట ఉద్యాపనకు బాబాను రావలయునని లేఖవ్రాసినపుడు మరిద్దరితో వచ్చెదనని జోగుద్వారా జవాబు పంపారు . చెప్పినట్లు ఉద్యాపన రోజున మరిద్దరితో సన్యాసివేషంలో సమయానికివచ్చి భోంచేసి వెళ్లారు . కాని దేవ్ గుర్తింపలేకపొయాడు. కారణం అదేసన్యాసి నెలరోజులముందు చందాలసేకరణ నెపంతో రైల్వే స్టేషన్లో దేవుని కలిసాడు . బాబామాటతప్పారని నిష్టురంగా దేవు లేఖరాస్తే , అదిచదవకముందే ఆవిషయాన్ని జోగుకువివరించారు సాయి . మరొక సాయిస్వప్నసందేశ లీల . హోళీ పండుగనాడు హేమాడపంతుకు కలలోకనబడి ఆరోజు వారింటికి భోజనానికి వస్తామన్నారు . సరిగా భోజనవేళకు వారింటికి చిత్రపటంలో ప్రత్యక్షమయ్యారు . పండుగ వంటలతో చిత్రపటానికి నైవేద్యం అర్పించారు. బాబాత్రుప్తిగా భోంచేసారు . భక్తులు తమయిండ్లలో నైవేద్యంమరచినా బాబాకెరుకే యను లీల వేరొక అధ్యాయంలో చెప్పబడినది . కావున బాబాపూజను భక్తిశ్రద్ధతలో చేయాలిగాని అశ్రద్ధ పనికిరాదు , సాయి సర్వజ్ఞత , సమర్ధత, భక్తవాత్సల్యం ఈలీలలరూపంలో భక్తులు తెలియగలరు . సాయిమనచర్యల సదా గమనిస్తున్నారనే యెరుకతో ప్రవర్తించాలి . సాయి ఏరూపంలో వస్తారో ఎవరికెరుక , అందరిలో తామున్నామని అందుకే చెప్పరేమో ?
శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక ! అందరికి శుభమగుగాక ! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి !
In this chapter, two wondrous leelas of Sai Baba are recounted:
The Sannyasi at Devu’s Home:
When B.V. Devu wrote a letter inviting Baba to their home, Sai replied through Jog to come with a companion. True to His word, on the appointed day, Baba arrived in the guise of a sannyasi, dined, and departed. Yet Devu could not recognize Him—
for a month earlier, at the railway station, he had met the same sannyasi collecting alms.
Even if Devu wrote the letter insistently, Baba, in His omniscience, had already conveyed the truth beforehand.
The Holi Festival Vision:
On the day of Holi, Baba appeared in a dream to Hemadpant, saying He would visit for the meal. At the exact mealtime, He manifested in the painting at their home, accepted the offerings of the festival delicacies, and partook with delight.
Lesson for Devotees:
Even if devotees forget the offerings in their hearts, they reach only Baba.
Worship must be done with devotion and heartfelt care; mere negligence bears no fruit.
These leelas reveal Baba’s omniscience, power, and loving grace toward devotees.
Devotees should always act with awareness, remembering that Baba observes every thought and deed.
His form may appear in any guise, yet He is present in all beings—silent, unseen, yet everywhere.
Comments
Post a Comment