శ్రీసాయిసందేశామృతము 43-44 (Nectar of Sri Sai's message 43-44)

శ్రీసాయినాథాయనమః !
సాయిబాబా మహాసమాధి ఈ అధ్యాయ ముఖ్యాంశము. తమసమాధి విషయం ముందెతెలిసిన సాయి వజే యనుభక్తునిద్వారా రామవిజయమను గ్రంథమును పారాయణజేయించారు. అనాత్మపై, ఆత్మ విజయానికి ప్రతీక రామవిజయం. తమచివరి క్షణాలను దైవంపై నిలిపి సామాన్యులకు దైవచింతనవిషయంలో దారిజూపారు . ఆరోజు భోజనసమయాన అంకితభక్తులను భోజనానికి పంపి అతికొద్దిమందితో మజీదునందున్నారు బాబా. లక్ష్మీబాయి షిండేకి నవనాణెముల దానం జేసినపిమ్మట తమను బూటీవాడాకు తీసుకొనివెళ్ళవలసినదిగా జెప్పి బాయాజీ పాటీలు ఒడిలో తమ తుదిశ్వాస విడిచారు . బాబా దేహత్యాగంచే శిరిడీ ప్రజలు తల్లడిల్లారు . త్వరలో మరలవస్తారనే విశ్వాసంతో కొంత యూరడిల్లారు. బాబాసమాధి విషయమై వాదోపవాదాలు జరిగినా తుదకు మురళీధర స్థాపనకు నిర్దేశింపబడిన స్థానంలో బాబా దేహాన్ని సమాధిజేశారు . నిజంగా బాబాయే మురళీధరుడు , వాడాయే దేవాలయం . నిర్యాణానికి సంకేతమన్నటుల కొద్దిరోజుల ముందు బాబా ఆత్మప్రతీకగా తలచే ఇటుక విరిగిపోయినది . గురుప్రసాదంగా తలచే ఇటుక విరిగినపుడు సామాన్యులవలె సాయి విలపించారు . 1886 లో బాబా 72 గంటలు సమాధిపొంది మరల జీవించుట వారి అసంపూర్తి అవతారకార్యమును కొనసాగించుటకే ! బాబాలోని శాశ్విత ఆత్మ దేహాతీతము ! బాబాలీలలు సమాధికి పూర్వమువలె ఇప్పటికీ కొనసాగటం వారునిత్యసత్యులనుటకు సాక్ష్యం . సమాధికి కొద్దిరోజులముందే జోగ్ యనేభక్తునికి ప్రపంచవిషయాలమరచి సన్యాసం స్వీకరింపవలసినదిగా సందేశమిచ్చారు . ఆపై అటులనే జరిగినది . సర్వజీవుల చేతనే సాయిగనుక అందరిలో తమను చూడమంటున్నారు . మానవసేవయే మాధవసేవగా జేయమంటున్నారు బాబా ! తమకీర్తిని ప్రేమతో వినినా,పాడినా కృపావర్షం కురిపిస్తున్నారు సాయి . శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక ! అందరికి శుభమగుగాక ! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి !
🌺 The Mahasamadhi of Sai Baba of Shirdi — A Poetic Rendering 🌺 The Mahasamadhi of Sai Baba of Shirdi stands as the sacred heart of this chapter. Foreknowing the hour of His departure, He caused the holy text Ramavijaya to be recited by the devotee Vaze. Ramavijaya — the triumph of the Self over the non-self — a symbol of the soul’s eternal victory. In His final moments, He fixed His awareness upon the Divine and, through His own example, showed ordinary seekers the path of God-remembrance. On that destined day, at the hour of the midday meal, He sent His close devotees away to dine and remained in the Masjid with but a few. To Lakshmibai Shinde He gave nine sacred coins — a final gift, rich with silent meaning. Then, asking to be taken to Buti Wada, He breathed His last in the lap of Bayaji Patil. At His leaving of the mortal frame, the people of Shirdi were shaken to their depths — like children bereft of their mother. Yet faith whispered consolation: “He will return.” Though disputes arose regarding the place of interment, at last His body was enshrined in the very spot intended for Muralidhar. In truth — Baba Himself was Muralidhar, and that Wada became a living temple. As if heralding His Nirvana, a few days earlier the brick He cherished as the emblem of His inner Self had broken. That brick, treasured as Guru’s grace — and when it shattered, Sai wept like any simple man. In the year 1886, He had once entered Samadhi for seventy-two hours and returned to life — only to continue His unfinished divine mission. For the eternal Self within Him was never bound by the body. Even now, His Leelas flow unceasingly, as they did before the Samadhi — a living testimony that He is the Ever-True. Days before His passing, He instructed the devotee Jog to renounce worldly ties and embrace sannyasa — and so it came to pass. Since Sai dwells in all beings, He calls to us: “See Me in everyone.” “Service to man is service to God.” Whoever listens to His glory with love, whoever sings His name with devotion — upon them He showers grace. May the compassionate rays of Sri Sai shine upon all. May auspiciousness bless every heart. Om Sai, Sri Sai, Jai Jai Sai. 🙏

Comments

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)