శ్రీసాయిసందేశామృతము 46 (Nectar of Sri Sai's message 46)

శ్రీసాయినాథాయనమః !
భక్తిశ్రధ్ధలున్నభక్తులకు సాయిబాబా నిత్యసత్యులు. సమాధికుముందువలె ఇప్పటికి సాయిలీలలప్రవాహం కొనసాగుతూనేవుంది. తమకు తమ చిత్రపటానికి తేడాలేదన్న వాక్యానికి మరోనిదర్శనం ఈ అధ్యాయవిషయం. ప్రియభక్తులు కాకాసాహెబు దీక్షితు, నానాసాహెబ్ చాందోర్కర్ నాగపూర్ మరియి గ్వాలియర్ లలో తమతమగృహములాజరుగు శుభకార్యములకు సాయినాహ్వానింప, తమకుబదులు శ్యామాను పంపెదమని, వారికంటెముందుగానే గయ జేరేదమన్నారు. శ్యామా అప్పాకోతేయనువానితో పై శుభకార్యములకు హాజరై పిదప కాశీ, ప్రయాగ అయోధ్యల యాత్రముగించి గయజేరి యచట పాండా యింట అతిధులయ్యారు . ఇచట ఆశ్చర్యకరవిషయమేమన పాండా గృహం ముందుహాలులో బాబాచిత్రపటాన్నిజూసి శ్యామా చకితుడయ్యాడు . బాబామాటలు సత్యమయ్యాయి . అంతకు 12 సంవత్సరాల పూర్వము పాండా శిరిడీ దర్శించి బాబాయనుమతితో శ్యామానుండి ఆ పటం పొందాడు . ఈసంఘటన స్మరించిన పాండా మిగుల సంతుష్టుడై శ్యామాను బహు సత్కరించాడు . చిత్రపట విశేషాలను శ్యామా పాండాలు మరచినా సాయి మరువలేదు . సాయి భూత వర్తమాన భవిష్యత్తులెరిగిన సర్వసమర్థులు, కాలాతీతులు . బాబా ప్రేమానురాగాలు కేవలం మానవమాత్రులపైనేగాక సమస్త జీవజంతువులపట్ల వ్యాపించినవి . పరస్పరద్వేషంతో ఒకరినొకరుజంపుకొని మరుజన్మలో మేకలుగా జన్మించిన సోదరులను గుర్తించారు . తమపూర్వజన్మపరియంతో మేకలపై జాలిపడి, మిగుల ఆదరణతో తిండిపెట్టారు . పూర్వజన్మలో సాయి సన్నిహితులుగా మెలిగినా వారిపాపకర్మ ఫలితంగా మేకలుగా జన్మించుట ఎంత శోచనీయము . వ్యక్తుల కర్మలు తదుపరి జన్మల నిర్దేశిస్తాయనుట ఎంతటి సత్యవాక్యము ! నిత్యకృత్యకర్మలలో మిగులమేళకువతో వ్యవహరించుట సర్వులకు శ్రేయోదాయకముగదా ! శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక ! అందరికి శుభమగుగాక ! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి !
For devotees filled with faith and devotion, Sai Baba is the Eternal Truth. Just as in the days before His Mahasamadhi, the stream of Sai’s divine leelas continues to flow even today. The episode in this chapter stands as yet another testimony to Baba’s own words: “There is no difference between Me and My picture.” His beloved devotees Kakasaheb Dixit and Nanasaheb Chandorkar once invited Baba to attend auspicious ceremonies taking place in their homes at Nagpur and Gwalior. Baba replied that instead of going personally, He would send Shama (Madhavrao Deshpande), and intriguingly added that He Himself would reach Gaya before them. Accordingly, Shama accompanied Appa Kote, attended the ceremonies, and then undertook a sacred pilgrimage through Kashi, Prayagraj, and Ayodhya, eventually arriving at Gaya. There they stayed as guests in the home of a panda (a traditional priest of Gaya). What happened there was astonishing. In the front hall of the panda’s house, Shama suddenly saw a portrait of Sai Baba adorning the wall. He stood stunned in wonder — Baba’s words had come true. Twelve years earlier, that very panda had visited Shirdi. With Baba’s permission, he had received that very portrait from Shama and carried it back with devotion. Recalling this sacred memory, the panda felt immense joy and welcomed Shama with great honor and reverence. Though both Shama and the panda had long forgotten the story behind that portrait, Sai Baba had not forgotten. For Sai is Sarva-samartha — the All-powerful One, who knows the past, the present, and the future, and who stands beyond the limitations of time itself. Baba’s love and compassion did not extend merely to human beings. His tender grace embraced all living creatures. On one occasion, Baba recognized two goats brought before Him. In a previous birth, they had been brothers consumed by mutual hatred, who had killed one another and were now reborn as goats. Remembering their past lives, Baba felt deep compassion. He lovingly fed them and treated them with great affection. How tragic it is that those who once lived close to Sai in a former birth had fallen into such a state through the consequences of their own actions. Indeed, this stands as a profound truth: The deeds of one life shape the destiny of the next. Therefore, should we not conduct our daily actions with great awareness and righteousness? For careful and mindful living in our daily duties is truly the path that leads to the welfare and upliftment of all.

Comments

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

అధ్యాత్మరామాయణము : అహల్యస్థుతి.