శ్రీసాయిసందేశామృతము 47 (Nectar of Sri Sai's message 47)

శ్రీసాయినాథాయనమః !
శ్రీసాయిసందేశామృతము Chapter 47. హత్య, ఋణము,శతృత్వము లకు తప్పక బదులుంటుందనేవారు సాయిబాబా. ఈవిషయాలన్ని వివరించుటకే బాబా ఈ అధ్యాయ కథనెంచుకొన్నారుసాయి . ఈ కథయందు ముఖ్యముగా నలుగురు పాత్రధారులు . వీరందరూ మూడుజన్మలెత్తారు . వారిజన్మలన్నింటికీ సాక్షి సాయి . మొదటిజన్మలో ధనికుడు,వాని భార్య , పేదరాలు దుబ్కీ. పురాతన శివాలయాన్ని బాగుచేయుటకై గ్రామస్తులిచ్చిన డబ్బును సరిగా వినియోగించలేదు పిసినారి ధనవంతుడు . భార్య నగలను అతి తక్కువధరకు కొని బదులుగా పేదరాలు దుబ్కీ నుండి తక్కువ వెలకు పొందిన పనికిరాని బంజరునేలను భార్యకిచ్చాడు . ఆనేల ఆలయపూజారి ఆధీనంలోకి వచ్చింది . ఈవిధంగా ధనికుడు దైవాన్ని , భార్యను , దుబ్కీని మోసంచేశాడు . కాలగమనంలో తుఫానుసంభవించి లోభి వాని భార్య దుర్మరణంపాలయ్యారు . దుబ్కీ కాలగతిచెందినది. మరుజన్మలో ధనికుడు పేదబ్రాహ్మణుడు వీరభద్రప్పగను, వాని భార్య పూజారికూతురు గౌరిగాను, దుబ్కీ గౌరవనింటిలో చెన్నబసప్పగను జన్మలెత్తారు . పూర్వజన్మ ఋణానుబంధమీజన్మలో వారినేకం జేసింది . బాబాసమ్మతితో వీరభద్రప్ప గౌరీల వివాహం జరిగింది . కాని భద్రప్ప పూర్వజన్మవాసనలు కొనసాగాయి , ధనవ్యామోహమేమాత్రం తగ్గలేదు . పూజారివద్దనున్న భూమిధర పెక్కురెట్లుపెరిగి లక్షరూపాయలయ్యింది . హక్కుదారు గౌరీనుండి డబ్బుపొందదలచాడు భద్రప్ప . బాబా డబ్బుకు వారసురాలు గౌరీగా నిర్ణయించి కొంతసొమ్మును దేవాలయపనులకై చెన్నబసప్పకిప్పించారు. తీర్పునచ్చని వీరభద్రప్ప ,బాబాపైనను చెన్నబసప్పమీదను ద్వేషం పెంచుకున్నాడు . భయపడిన పిరికివాడు చెన్నబసప్ప శరణువేడ సాయి రక్షింతునని అభయమిచ్చారు . మారిన కాలంలో కర్మఫలంచే భద్రప్ప పాముగను, బసప్ప కప్పగను జన్మించారు, కాని వారిమధ్య వైరం కొనసాగింది . పాము కప్పను జంపు చివరిక్షణాలలో వారి పూర్వ జన్మలెరిగినబాబా తానిచ్చిన మాటప్రకారం కప్పనురక్షించారు. జన్మజన్మల బాంధవుడు సద్గురు సాయినాథులు . అందులకే బాబా రుణాన్ని, శత్రుత్వాలను ప్రస్తుతజన్మలోనే వదిలించుకోమన్నారు. ఈవిచిత్ర మూడుజన్మల కథలో ధనికుని భార్య దైవకార్యానికి తనబంగారు నగలనిచ్చి పెక్కురెట్లు మేలుపొందినది . ధర్మం దప్పిన ధనికుడు మొదట పేదవానిగను పిదప సర్పముగను జన్మలెత్తి అధోగతిపాలయ్యాడు . అన్నింటికీ ,అందరికి సాక్షిభూతులు సాయినాథులు. సాయిజూస్తున్నారు ,సాయి వింటున్నారు, తస్మాత్ జాగ్రత జాగ్రత జాగ్రత ! శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక ! అందరికి శుభమగుగాక ! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి !
Shri Sai Message Nectar – Chapter 47 (Poetic Translation) Sai Baba teaches that every act of murder, debt, or enmity has its inevitable consequence. This chapter narrates such truths through a remarkable story, witnessing the workings of divine justice across three lifetimes. In this tale, four souls play the central roles, all under the watchful eyes of Sai across their births. In their first birth: A wealthy man, His wife, A poor man named Dubki. The rich man misused the villagers’ donations meant for restoring an ancient Shiva temple. He bought his wife’s jewelry at a meager price, while giving the poor Dubki’s worthless goods in return. Thus, he cheated the divine, his wife, and Dubki. Time passed, and as fate decreed, greed claimed the lives of the wealthy man and his wife, while Dubki passed away peacefully. In their second birth: The wealthy man was reborn as a poor Brahmin, Veerabhadrappa, His wife as the priest’s daughter, Gauri, Dubki as Chennabasappa, the respected householder. The debts of their past lives carried into this birth. With Baba’s blessings, Veerabhadrappa married Gauri, yet old desires lingered; his attachment to wealth remained unshaken. The priest’s land had grown, now worth a lakh of rupees, and Veerabhadrappa coveted this wealth from Gauri. Baba, however, directed that some of the money be devoted to temple work through Chennabasappa. Though pleased with the decision, Veerabhadrappa’s heart grew resentful, harboring jealousy and hatred toward both Baba and Chennabasappa. Fearful, Chennabasappa sought refuge, and Sai offered protection. In time, karmic justice continued: Veerabhadrappa was reborn as a snake, and Chennabasappa as a frog. Yet their enmity endured. At the very last moment, remembering their past births and Baba’s guidance, the snake spared the frog. Through all these births, the true guide, Sadguru Sai Nath, witnessed everything. Baba declared that all past debts and enmities could be resolved in this lifetime itself. This extraordinary three-lifetime saga reveals: The wealthy wife gained spiritual merit by offering her gold for divine work, The greedy man first suffered as a poor Brahmin, then as a snake, descending into misery, Throughout, Sai remained the witness, the protector, and the guide, watching, listening, and guiding all souls. Hence, be ever alert, alert, alert! May the mercy-filled rays of Shri Sai shine upon everyone! May blessings and auspiciousness prevail! Om Sai, Shri Sai, Jai Jai Sai!

Comments

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

అధ్యాత్మరామాయణము : అహల్యస్థుతి.