శ్రీసాయిసందేశామృతము 9 (Nectar of Sri Sai's Message 9).
శ్రీసాయినాథాయనమః.సాయిబాబ తమ శుభసందేశాలనే కిరణాలతో భక్తుల హృదయాల్లో వెలుగులనింపి చైతన్యవంతం చేస్తున్నారు . బాబాసందేశాలనాచరిస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకుందాము.
శ్రీసాయిసందేశామృతము: అధ్యాయము 9. సాయిబాబా సర్వజ్ఞులు , అంటే అన్ని సంఘటనలు వారికెరుకే ! తమభక్తులను రక్షించుటకొరకు సర్వజ్ఞతనుపయోగించెడివారు . భక్తుల యోగక్షేమములు వారికంటే బాబాకే మిక్కిలి యెఱుక. భక్తుల గతము , ప్రస్తుతము మరియు భవిష్యత్తు వారికి తెలియును . జరిగినది , జరుగుతున్నది అందరెరుగుదురు కాని జరుగబోయెడి ఘటనలెవరికెరుక ? సామాన్యులది హ్రస్వదృష్టి , బాబాది దివ్యదృష్టి . బాబావలదన్నా వినక కోపర్గామ్ సంతకు గుర్రపుబండిపై బయలుదేరి ప్రమాదానికి గురైనాడు తాత్యా కోతే పాటీలు . మరొక ఐరోపా పెద్దమనిషి బాబా ఆజ్ఞను తిరస్కరించి శిరిడీ విడిచి, మార్గమధ్యమున టాంగా తలక్రిందులై హాస్పిటలు పాలైనాడు. బాబా ఆజ్ఞ శివునాజ్ఞ , వారి యనుమతితో శిరిడీనుండి వెళ్లెడివారు సురక్షితంగా తమతమ యిండ్లకు జేరెడివారు . గృహస్థులు తమనిత్యకృత్యములలో తెలిసో తెలియకో జేసెడి పాపములను హరించుటకై బాబావారినుండి భిక్షగ్రహించెడివారు. వారికిచ్చెడి భిక్ష దైవానికి జేరుతుంది. భక్తిశ్రద్ధలతో సమర్పించిన ఏవస్తువునైనా స్వీకరిస్తానని శ్రీకృష్ణభగవానుడు గీతాగ్రంధంలో అర్జుననుకు బోధించాడు . బాబా సర్వవ్యాపి . సమస్త చరాచర జగత్తునంతట వారు నిండియున్నారు . తన భార్యాబిడ్డలు బాబాను చూచుటకు శిరిడీ వెళ్ళినపుడు, రామచంద్ర ఆత్మారాం తార్ఖడ్ బాంద్రాలో తనయింట బాబాపటానికి నైవేద్యమివ్వడం మరచాడు . ఆవిషయాన్ని అదే నిమిషంలో బాబా తమవద్దనున్న తల్లి బిడ్డలకు తెలియజెప్పి వారినాశ్చర్యపరచారు సాయిబాబా . మరొక్కసారి ఆతల్లి శిరిడీ వెళ్ళేభక్తురాలికి రెండువంకాయలిచ్చి పెరుగుపచ్చడి, వేపుడుజేసి బాబాకు సమర్పించమన్నది. శిరిడీజేరిన భక్తురాలు ఒకవంకాయతో పచ్చడిజేసి బాబాకివ్వగా, తమకు ఇగురుకూర కూడా కావలెనని తమ సర్వజ్ఞతను జూపి యచటివారల నబ్బురపరచారు సాయి . మరొకపర్యాయం తార్ఖడు భార్య నైవేద్యంగా అర్పించిన పేడాను మైలసోకిన ఓ భక్తునిద్వారా శిరిడీ పంపినది . అతడు బాబానుదర్శించాడు గాని తాను దెచ్చిన పేడానివ్వడం మరచాడు . బాబా వానికీవిషయం గుర్తుజేసి మరీ ఆ పేడానారగించారు . సర్వజీవుల జఠరాగ్ని తానేనని శ్రీకృష్ణభగవానుని గీతావాక్యం . అన్నిజీవులదాగిన సాయికి అందరి ఆకలి వారికే ! మరొకపర్యాయం బాబాను జూడవచ్చిన తార్ఖడుభార్య వేరింట బసజేసి, భోజనసమయానికొచ్చిన కుక్కకు ఒకరొట్టెను విసిరింది . పిదప దర్శింప వెళ్లిన ఆమెతో కడుపునిండా భోజనం పెట్టావని, కుక్క ఆకలి తీరితే తమ ఆకలి తీరినట్లేయని పలికి మిగుల నాశ్చర్యపరిచారు సాయి.తార్ఖడు భార్యకు కలిగిన అనుభవములనుండి భక్తులోవిషయం గుర్తుంచుకోవాలి . బాబా సర్వవ్యాపిగనుక భక్తుడు ప్రేమతో పిలిస్తే ఏదోరూపంలో వస్తారు . పక్షిగానో , పశువుగానో , భిక్షునిరూపంలోనో, అపరిచితునిగానో లేక స్నేహితునిరూపంలోనో సమయానికి సాయమందీయవచ్చును. ముఖ్యంగా చెప్పేదేమంటే ఏదోవేషంలో వచ్చిన బాబాను గుర్తించడమంత సులభంకాదు . ఈవిషయమై భక్తులు మిగుల జాగరూకులై మెలగవలె ! ఇచట మరువలేని ఓ విచిత్ర సంఘటన మదిలో మెదులుతుంది . 1993వ సంవత్సరం, నవంబరు మాసంలో, హైదరాబాద్ వెంగళరావు నగర కాలనీలోని సాయిమాస్టర్ అపార్టుమెంట్స్ గృహప్రవేశ సమయాన 7 రోజులు శ్రీషిరిడీబాబా జ్ఞానయజ్ఞకార్యక్రమం నిర్వహించడమైనది . చివరిరోజున పూజావేదిక కెదురుగా పిచ్చివానిరూపంలో ఓ భిక్షువు వచ్చి కాసేపు కూర్చొని ప్రసాదం స్వీకరించి వెళ్ళాడు . అతడు వెళ్లిన వెంటనే కొందరి కార్యకర్తలకు బాబానే ఆ రూపంలో వచ్చారనే ఆలోచన కలిగినది . కొన్నినిమిషాలలోనే ఆ వ్యక్తికొరకు చుట్టుపక్కలెంత వెదికినా జాడతెలియలేదు. తరువాతకూడ ఆవ్యక్తి నెవరు చూడలేదు . అటుపిమ్మట విన్నవిషయమేమిటంటే ఆప్రాంతంలో కొందరి భక్తుల ఇంట ఓ అపరిచిత సన్యాసిగానో , భిక్షువుగానో వచ్చారని, ఆపై జాడలేదని చెప్పారు . ఈ అధ్యాయంలో గుర్తుంచుకోవలసిన బాబా సందేశాలను క్లుప్తంగా పరిశీలించెదము . బాబా చిత్రపటానికి బాబాకు తేడాలేదు , భక్తితో అర్పించిన నైవేద్యమును చిత్రపటరూపంలోనూ ఆరగిస్తారు . బాబాకు భక్తి మరియు ప్రేమలే ప్రధానంగాని, మైలతో ఎలాంటి అవరోధంలేదు . ఆకలికొన్న వ్యక్తికిగాని, ఇతర జీవజంతువులకుగాని పెట్టినభోజనము సాయికి పెట్టిన భిక్షయే! సాయిని విశ్వసించి, వారు సూచించిన సాయిమార్గంలో ప్రయాణించిన భక్తుని ఆధ్యాత్మిక ప్రయాణము సులభతరము మరియు విజయవంతము! శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక ! అందరికి శుభమగుగాక ! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి !
" Woever offer Me with devotion a leaf, a flower, a fruit, water, that I accept, offered by the pure-minded with devotion. The Holy Geeta 9:36. పరిశుద్ధమైన మనస్సుగల పురుషుడు భక్తిచేత సమర్పించునట్టి పత్ర పుష్ప ఫలోదకములను నేను మిగుల ప్రేమతో నారగించుచున్నాను . గీత : 9;26 ").
🌸 Sri Sai Nathaya Namah 🌸
With rays of His auspicious divine messages,
Sri Sainatha fills the hearts of devotees with inner light and sacred awareness.
Let us walk in the path of His teachings and make our lives blessed and fulfilled.
Sri Sai Sandesha Amritam – Chapter 9
The All-Knowing, Ever-Compassionate Sai
Sai Baba is Sarvajña — the Knower of all.
Every event, every thought, every movement in the universe is known to Him.
For protecting His devotees, He uses this divine omniscience with infinite compassion.
He knows the past, the present, and even the unseen future of His children.
What ordinary eyes cannot perceive,
Baba sees with His divine vision.
Many stories shine as proof of this truth:
Tatyasaheb Kote Patil set out for Kopergaon on a horse-cart against Baba’s warning,
and faced a sudden accident along the way.
Another European gentleman ignored Baba’s instruction and left Shirdi.
His tonga overturned mid-way, and he barely escaped with life.
Yet, those who left Shirdi with Baba’s permission always reached home safely.
For Baba’s command is Lord Shiva’s command.
Householders, knowingly or unknowingly, commit many errors in daily life.
To free them of these burdens, Baba accepted their humble bhiksha,
for whatever is offered to Him ultimately reaches the Divine itself.
Just as Sri Krishna taught Arjuna in the Gita—
that whatever is offered with devotion, He lovingly accepts.
Baba is All-Pervading
He fills the entire cosmos.
There is no place where Baba is not.
When Tarkhad’s wife and son were in Shirdi,
Tarkhad forgot to offer Naivedya to Baba’s picture in his home at Bandra.
That very moment, Baba informed the mother and son in Shirdi—
revealing His omnipresent nature.
Another day, Tarkhad’s wife gave a devotee two brinjals
and asked her to prepare chutney and curry for Baba.
The lady offered only the chutney to Baba.
Immediately Baba said,
“Where is My vegetable curry? I want that too!”
Revealing His sweet omniscience and playful grace.
Yet another time, she offered pedha to Baba from home.
But the devotee carrying it forgot to present it to Him.
Baba reminded him of the pedha
and lovingly accepted it—
for He is the inner fire that digests the food of all beings,
as declared in the Gita.
Once, Tarkhad’s wife was staying at another devotee’s house in Shirdi.
She fed a hungry dog with love during mealtime.
When she came for Baba’s darshan,
He said:
“You fed Me well today.
When the dog’s hunger is satisfied,
My hunger is satisfied.”
Such profound compassion can only belong to Sai.
From these divine experiences we must learn—
Sai Baba is present everywhere,
in every creature, every humble form, every unexpected visitor.
If a devotee calls Him with love,
He may appear as a bird, animal, monk, stranger, child, or friend.
Recognizing Him is the subtle test of devotion.
A Profound Incident
In November 1993, during a seven-day Jñāna Yajña
at Saimaster Apartments, Vengal Rao Nagar, Hyderabad,
a madman-like mendicant appeared on the final day.
He sat silently before the altar, received prasadam, and left.
Within minutes, people felt profoundly that Baba Himself
had visited in that form.
When they searched for him,
he had vanished without a trace.
Even days later, no one ever saw him again.
Other devotees too reported visits from
a mysterious sanyasi or beggar who appeared and disappeared suddenly.
Divine hints of Baba’s invisible presence!
⭐ Essence of Baba’s Teachings in This Chapter ⭐
There is no difference between Baba and His picture.
What is lovingly offered before the picture reaches Him.
Purity of heart and devotion are what He seeks.
Rituals and materials hold no barriers for Him.
Feeding the hungry—human or animal—
is offering bhiksha directly to Sai.
One who lives in faith, walks the Sai-path,
and follows His gentle guidance
finds his spiritual journey easy, safe, and successful.
May Sri Sai’s rays of compassion spread over all beings.
May all be blessed with peace and auspiciousness.
Om Sai, Sri Sai, Jai Jai Sai!
Bhagavad Gita 9:26
“Whoever offers Me with devotion a leaf, a flower, a fruit, or water—
I accept it with love from the pure-hearted devotee.”

Comments
Post a Comment