Posts

సాయిలీలావిశ్లేషణ : ప్రేమ - పగ.

Image
శ్రీసాయినాథాయనమః! పెద్దలు జీవితాన్ని పరమపదసోపానపటం లేక పాము,నిచ్చెనల ఆటతో పోల్చిచెబుతారు. సాత్విక గుణములు కలిగి మంచిపనులు జేయువారు క్రమంగా వృద్ధిచెంది నిచ్చెనలనెక్కినట్లు ఉన్నతమార్గంలో పయనించి క్రమంగా జన్మజన్మకు వృద్ధినొంది దైవసన్నిధికి జేరుతారు. అదేవిధంగా రాక్షసస్వభావం కలిగి చెడుకర్మలుజేస్తూ ఇతరులకు హానిజేయువారు తమకు ప్రాప్తించిన మానవజన్మనూ కోల్పోయి పాము కరిచిన విధంగా పాతాళానికి నెట్టవేయబడి పాపజన్మల నెత్తుతారు. శ్రీసాయిసచ్చరిత్రమునందు ఇందులకు చక్కని ఉదాహరణలు చూడగలము. కొందరు పుణ్యాత్ములు సాయిని జన్మజన్మల సేవించి ఉన్నతస్థితిని పొందగా మరికొందరు భాగ్యహీనులు సాయికి సన్నిహిత వ్యక్తులుగా జన్మలనెత్తినప్పటికీ ధర్మాన్నితప్పి పరులకు కీడుజేస్తూ ఆపై హీనజన్మలపోందారు.ఈవిషయాన్ని వివరంగా తెలుసుకొందాము. మొట్టమొదట దాదాసాహెబ్ ఖాపర్డే భార్యను గూర్చిన విషయము. ఖాపర్డే గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు, దేశ స్వాతంత్ర సంపాదనకై బాలగంగాధర తిలక్ కు కుడిభుజంగా పనిజేసాడు. ఖాపర్డే సాయి అనుగ్రహము రక్షణ పొందిన అదృష్టశాలి. భార్యాభర్తలిరువురు సాయిని మిగులభక్తిశ్రద్ధల సేవించారు. శిరిడీలో ఖాపర్డే నాలుగుమాసములుండగా వ...

సాయికథలు-అక్కాచెల్లెళ్లు.

Image
శ్రీసాయినాథాయనమః " మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము జేయుటయే! " శ్రీసాయిసచ్చరిత్రము. శ్రీసాయిసచ్చరిత్ర 15వ అధ్యాయంలో సాయిచెప్పిన ఓ చక్కని అక్కాచెల్లెళ్ల కథ ఇది. బాబాకు మనుషుల బంధుత్వమేగాక , జంతువుల పశువుల. క్రిమికీటకాదులు వరుసవాయలు బాగుగ తెలియును. సాయికి, మేకలుగా పుట్టిన అన్నదమ్ముల కథతెలుసు, పాము కప్పలుగా జన్మలెత్తిన వీరభద్రప్ప చెన్నబసప్పల గాధ తెలుసు. అదేవిధంగా అక్కచెల్లెళ్లుగా చమత్కరించిన రెండు బల్లుల విచిత్ర కలయిక బాబాకు తెలియును. ఈవివరముల నిచట స్మరించెదము. ఓకరోజు ద్వారకామాయిలో బాబా భక్తులతో ముచ్చటించే సమయాన కప్పుపైనున్న ఓ బల్లి టికుటిక్కుమంటూ కూసింది. ఎదురుగా కూర్చున్న భక్తునికి ఆ కూత శుభమా, అశుభమా యను సందేహమొచ్చి బాబాను వివరణమడిగాడు. తన చెల్లి ఔరంగాబాదునుండి వచ్చుచున్న కారణాన బల్లి ఆనందపడుతుందని బాబా చెప్పగా ఆఅడిగిన వ్యక్తి మిగుల ఆశ్చర్యపడ్డాడు. కొంతసేపటికి ఔరంగాబాదునుండి ఒక వ్యక్తి బాబాదర్శనానికై గుఱ్ఱంపై వచ్చాడు. ఆకలిగానున్న వాని గుర్రానికి ఉలవలు తెచ్చుటకై తనదగ్గరున్న సంచిని విదిలించగా, అందులోనుండి ఓబల్లి క్రిందపడి అందరూ చూచుచుండగా గోడనెక్కి తనసోదరివద...

సాయిలీలా విశ్లేషణ - పదిరూపాయలు.

Image
శ్రీసాయినాథాయనమః! సాయిలీలలకు అంతులేదు. ఎవరిని ఏయే విధంగా తమమార్గంలోకి లాగెదరో ఊహకందని విషయము. ప్రస్తుతము శ్రీసాయిసచ్చరిత్రములోని బాబా చమత్కారలీలనొకటి స్మరించెదము. ఇది అప్పాసాహెబు కులకర్ణి, ఠాణా నివాసి యనుభవము, వివరములు 33 యధ్యాయమున చూడగలము. సాయిబాబాను ఎప్పటినుండో చూడదలచినను చూడలేకపోయాడు. బాలాసాహెబు భాటే నుండి బాబా ఫోటోపొంది నిత్యం మిగులభక్తితో పూజజేస్తున్నాడు. మనసులో బాబాను చూడాలనే ప్రబల ఆకాంక్ష. కులకర్ణి ఓ వారంరోజుల పనిపై భీవండి వెళ్ళవలసి వచ్చినది. మూడవరోజు మధ్యాహ్నం కులకర్ణి లేనిసమయాన వారింటికి సాయిని బోలిన ఫకీరు వచ్చాడు. ఫకీరు సాయిబాబాయా? యనెడి సందేహం కులకర్ణి భార్యాబిడ్డలకు కలుగుటచే, తాను కేవలం దేవుని సేవకుడనని, దైవజ్ఞచే వారి యోగక్షేమముల తెలిసికొనుటకై వచ్చానని ఆ ఆగంతకుడు చెప్పాడు. ఓ రూపాయి దక్షిణపొంది వారికో విభూతి పొట్లామిచ్చి ఫకీరు కనుమరుగయ్యాడు. ఇపుడో యనుకోని విషయం జరిగింది. భీవండిలో గుఱ్ఱము జబ్బుపడుటచే మూడవరోజు సాయంకాలానికే కులకర్ణి తన పర్యటన మధ్యలోనేమానుకొని యింటికి వచ్చాడు. భార్యాబిడ్డలనుండి ఆ రోజు ఫకీరు రాక వివరములు గ్రహించి తాను ఫకీరును చూడకుండుటకు మిగుల బాధ...

కల్పతరు.

Image
శ్రీసాయినాథాయనమః!నేడు శ్రీస్వామివివేకానంద జయంతి! Happy Youth Day. " భగవంతుడు సర్వ జీవులను సృష్టించి సర్వులకు తండ్రి అయ్యాడు. తానే పంచభూతాలై తననుండి జీవులందరికీ దేహాలు, పోషణ యిచ్చి తల్లి అయ్యాడు. వేదాలు మొదలుకొని సర్వ శాస్త్రాలు అనుగ్రహించి ఆప్తవాక్యం చెప్పే మిత్రుడయ్యాడు. సకల సృష్టినీ తన అధీనంలో ఉంచుకోవడం వలన జీవులకు ఈశ్వరుడయ్యాడు. మహనీయుల రూపంలో అవతరించి గురువయ్యాడు. భూమిమీద తన ప్రతిరూపమైన సద్గురువు రూపంలో ఆయన అవతరించినపుడు తననాశ్రయించిన వారందరికీ కల్పవృక్షము, కామధేనువు,చింతామణి అవుతాడు." శ్రీసాయి లీలామృతము. శ్రీసాయిసచ్చరిత్ర గ్రంధంలో సాయిబాబాను ఆశ్రితుల కోర్కెలదీర్చెడి కల్పతరువుగా రచయిత హేమాద్రిపంతు వర్ణించాడు. వివిధ కోర్కెలతో బాబాను చూడవచ్చినవారలగూర్చి, అలా వచ్చుట సబబా యన్న ఓ భక్తునితో బాబా, " మొదట అందరు అలానేవస్తారు, ఓ స్థాయిచిక్కినపిమ్మట నా మార్గంలో నడుస్తారు." యని అన్నారు. బాబా వివిధ భక్తుల బాధలను అవసరాలను దీర్చెడివారు. అన్నవస్త్రాల గూర్చెడివారు, రోగనివారణ జేసెడివారు, సంతాన సౌభాగ్యములు ప్రసాదించెడివారు. సత్వగుణముల పెంపొందించి చక్కటి నడవడి నేర్పెడివారు. అజ్ఞ...

" The Divinity is within you."

Image
Sree Sainathayanamah! Wishing the readers a Merry Christmas. Once Jesus was asked, when the kingdom of God would come? Jesus strikingly said," Neighter here nor there, behold the kingdom within you." Luke 17-21. Shirdi Saibaba used to say that He lives in the hearts of one and all. Innumerable experiences of devotees bear testimony to this fact. Saibaba is the Universal Conciousness. Saibaba said," You need not go in search of Me. Barring your name and form, there exists in you as well as in all beings, a sense of being or Conciouness of Existence. That is Myself. Knowing this, you see Me inside your self, as well as in all beings. If you practise this , you will realize all-pervasiveness, and thus attain oneness with Me." ( Sri Saisatcharita:43-44). Bhagavan Ramana Maharshi reiterated,preached the above truth.His method is about the enquiry of the Self or the underlying Reality of everyone. He used to preach that the Self is beyond body,mind and intellect. The S...

భగవద్గీతాపంచప్రాణములు. (Nectar of Holy Geeta in 5 slokas.)

Image
శ్రీకృష్ణపరమాత్మనేనమః! Today is The Holy Geeta Jayanthi. " Equanimity, though hard to maintain is a great virtue, keeps the mind at peace". Bhagavad Geeta. నేడు గీతాజయంతి. షుమారు 5000 సంవత్సరాల పూర్వము శ్రీకృష్ణపరమాత్మ అర్జునునకు కురుక్షేత్రయుద్ధ సమయమున గీతోపదేశము చేసాడు. గీత 18 అధ్యాయములుగ విభజింపబడినది, అందు 700 శ్లోకములు కలవు. అందునుండి మహర్షి సద్గురు శ్రీమలయాళస్వాములువారు 5 శ్లోకములను పంచప్రాణములుగా భక్తులప్రయోజనమునకై ఎన్నికజేసిరి. అవి వరుసగా 2. 14; 2. 45; 5. 20; 12. 17; 18. 54. ఈ పంచప్రాణముల ప్రయోజనమేమన వ్యక్తులకు దైవభావమునుండి మనస్సెపుడైన దృశ్యములోనికి, దృశ్యవృత్తిలోనికి, దృశ్యవిషయములోనికి చిన్నగ జారుచున్నదని తోచినచో ఈ శ్లోకములయొక్క పఠనము చేత, నర్ధచింతనముచేతను మేడపైనుండి చిన్నగా క్రిందకు పడిపోయిన వాడు మరల నింపాదిగా మెట్లపై నెక్కుచు గమ్యస్థానము జేరునట్లు; తిరిగి సహజమగు తురీయపదము (పరమశాంతి స్థితి) పొందగలడు. పై శ్లోకముల అనువాదమును క్లుప్తముగా తెలిసికొనెదము. " కుంతీపుత్రుడవగు నో అర్జునా! ఇంద్రియములకు శబ్దాది విషయముల తోడ గలిగెడు సంయోగములు శీతోష్ణములను, తన్మూల...

సాయిబాబా శివరూపుడా?

Image
శ్రీసాయినాథాయనమః! శ్రీసాయిబాబా అష్టోత్తరశతనామావళిలో మూడవనామం శ్రీరామకృష్ణశివమరుత్యాది రూపాయనమః. ఈనామభావమేమన శ్రీరామ, శ్రీకృష్ణ, శివ, మారుతి మున్నగు దేవతా స్వరూపుడైన సాయిబాబాకు నా నమస్కారము. అనగా నిచట బాబాను శివరూపునిగా చెప్పడమైనది. "పూజ్యశ్రీ భరద్వాజ మాష్టారు రంచించిన శ్రీసాయిలీలామృతగ్రంథంలొ బాబాలో పరమశివునిఁజూపు లీలలు కొన్ని కలవు. వానినిపుడు క్లుప్తముగా స్మరించెదము. మహల్సాపతి కుమారుడు మార్తాండమాల్సాపతి ఓరోజు ఖండోబా దేవాలయంవద్ద కూర్చొన్నాడు. సాయి వానియెదుట ప్రత్యక్షమైనారు. మార్తాండ్ నిలబడగానే బాబా నవ్వుచూ ఖండోబా విగ్రహంవైపు నడచి అందులో లీనమయ్యారు. ఆశ్చర్యంతో మార్తాండ్ విగ్రహంవెనుక వైపు చూసాడు. అక్కడెవ్వరూలేరు. తిరిగి విగ్రహంనుండి సాయి వెలువడి చిరునవ్వుతో ఆతనిఁజూస్తూ బయటకువెళ్లిపోయారు. నాటినుండి యతడు ఖండోబాను బాబా రూపంగా పూజించేవాడు. ( మహారాష్ట్రలో ఖండోబాను శివుని రూపుగా పూజిస్తారు). మరియొక ఉదాహరణ జూచెదము. బాబా సన్నిహిత భక్తురాలు లక్ష్మీబాయి షిండే ఓరోజు దునిదగ్గర స్తంభానికానుకొని కూర్చొంది. ఆమెతో సాయి అక్కడకు రోజూవచ్చే పామునుజూచావా యన్నారు. ఆమె చూడలేదంది. కొద్దినిముషాలలో...