అంతరాత్మల వెలుగు సాయియే మోక్షము!

శ్రీసాయినాథాయనమః 

అంతరాత్మల వెలుగు సాయియే మోక్షము! 

మట్టిరా దేహము, మట్టిలోనె పెరుగును 
మరల మరల పుట్టుచూ  మట్టిలొనె కలియును

మిధ్యరా గేహము, మిధ్యరా లోకము
మధ్యలోనె కనిపించి మాయమై పోవును

మాయరా నామము, మాయరా రూపము
మధ్యలోనె కనిపించి మాయమై పోవును

మజిలీరా జన్మము, మజిలీరా బంధము
మధ్యలోనె కనిపించి మాయమై పోవును

ఆత్మయే సత్యము, ఆత్మయే నిత్యము
అంతరాత్మల వెలుగు సాయియే మోక్షము

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి !



Comments

  1. నామరూపాలకు ఆరంభము మరియు అంతము వుంటాయి. నామరూపాలను ప్రకాశింపజేయు సృష్టి చైతన్యము సదా విలసిల్లుతుంటుంది! సాయి ఆవిశ్వచైతన్య శక్తితో మామేకమైయున్నారు!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)