అంతరాత్మల వెలుగు సాయియే మోక్షము!
శ్రీసాయినాథాయనమః
అంతరాత్మల వెలుగు సాయియే మోక్షము!
మట్టిరా దేహము, మట్టిలోనె పెరుగును
మరల మరల పుట్టుచూ మట్టిలొనె కలియునుమిధ్యరా గేహము, మిధ్యరా లోకము
మధ్యలోనె కనిపించి మాయమై పోవును
మాయరా నామము, మాయరా రూపము
మధ్యలోనె కనిపించి మాయమై పోవును
మజిలీరా జన్మము, మజిలీరా బంధము
మధ్యలోనె కనిపించి మాయమై పోవును
ఆత్మయే సత్యము, ఆత్మయే నిత్యము
అంతరాత్మల వెలుగు సాయియే మోక్షము
నామరూపాలకు ఆరంభము మరియు అంతము వుంటాయి. నామరూపాలను ప్రకాశింపజేయు సృష్టి చైతన్యము సదా విలసిల్లుతుంటుంది! సాయి ఆవిశ్వచైతన్య శక్తితో మామేకమైయున్నారు!
ReplyDelete